కిల్లింగ్ వీరప్పన్

January 08, 2016 | 05:13 PM | 0 Views
Rating :
కిల్లింగ్ వీరప్పన్

నటీనటులు : శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పారుల్ యాదవ్, యాజ్న శెట్టి, సంచారి విజయ్, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రహణం: రామీ, నేపథ్య సంగీతం: శాండీ, సంగీతం: రవిశంకర్, మాటలు- శశాంక్ వెన్నెలకంటి, నిర్మాతలు: శివప్రకాష్ - మంజునాథ్ - సుధీంద్ర
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరోసారి రియల్ లైఫ్ స్టొరీ తో చేసిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గజగజా వణికించిన స్మగ్లర్ వీరప్పన్ కథ ఏంటి, అతనిని ఎలా చంపారు అనే పాయింట్ మీద ఈ సినిమాని తీసారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా, సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రలో కనిపించారు. మరి రక్తచరిత్రలాగా ఈ రియల్ స్టోరీ కూడా ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలోకి వెళ్దాం...

కథ :

మూడు రాష్టాల పోలీసులను ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులకు నిద్ర లేకుండా చేసిన స్మగ్లర్ అండ్ కిల్లర్ వీరప్పన్. ఇక సినిమా కథలోకి వెళితే.. వీరప్పన్(సందీప్ భరద్వాజ్) ఓ డీల్ కోసం బయటకి వస్తున్నాడని తెలిసి ఓ ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ టీం బయలుదేరుతుంది. కానీ మార్గమధ్యంలో పోలీసులనే చంపేస్తాడు వీరప్పన్. అప్పుడే వీరప్పన్ ఎలాగన్నా పట్టుకోవాలన్న ఆలోచన చేస్తారు. అప్పుడే స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి సంబందించిన విజయ్ కుమార్ ఆలోచిస్తుండగా ఆయన అసిస్టెంట్, ఎస్.పి(శివరాజ్ కుమార్) ఓ ప్లాన్ చెప్తాడు.

అదే మనం వీరప్పన్ సామ్రాజ్యమైన ఆ ఫారెస్ట్ లోకి వెళ్లి అతన్ని చంపలేం.. కానీ వీరప్పన్ ని అడవి నుంచి బయటకి తీసుకు రాగలిగితే అతన్ని పట్టుకోవడం చాలా ఈజీ అంటాడు. దానికి అందరూ ఓకే అని మిషన్ స్టార్ చేస్తాడు.. ఇక ఎస్.పి వీరప్పన్ ని బయటకి తీసుకు రావడానికి ఏమేమి ప్లాన్స్ చేసాడు? ఎవరెవరిని రంగంలోకి దింపాడు? ఈ ప్లాన్ లో వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మీని ఎలా వాడుకున్నారు. ఫైనల్ గా వీరప్పన్ పట్టుకోలేక ఎలా చంపారు? అన్నదే కథ.

ఫ్లస్ పాయింట్లు:

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి సినిమా అనగానే ఆసక్తి నెలకొనటం సహజం. ఇక దానిని వర్మ లాంటి దర్శకుడి చేతిలో పడేసరికి అంచనాలు ఇంకా పెరిగాయి. ఇక సినిమా విషయానికి వస్తే.. సినిమాని మొదలు పెట్టిన విధానం సూపర్బ్.. మొదటి ఎపిసోడ్ లోనే ఓ గ్రూప్ పోలీసులను చంపి వీరప్పన్ లోని విలనిజంని ఎలివేట్ చేసిన సీన్, అలాగే ఆ తర్వాత తన లైఫ్ లో జరిగిన రెండు విషయాలపై అతని రియాక్ట్ అయ్యే విధానాన్ని షూట్ చేసిన విధానం ఆడియన్స్ లో ఇంత క్రూరమైన వాడా వీరప్పన్ అనే ఫీలింగ్ ని జెనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే అందరినీ సర్పైజ్ చేసే ఎపిసోడ్ మాత్రం వీరప్పన్ లవ్ స్టొరీ.. ఈ ఎపిసోడ్ రొమాంటిక్ గా లేకపోయినా ఆ లవ్ సీన్ మాత్రం చూసే ఆడియన్స్ లో ఒక చిన్న స్మైల్ ని జెనరేట్ చేస్తుంది. అలాగే వీరప్పన్ ని వెయ్యాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ని తిప్పి కొట్టి అతని పోలీసులపై రివర్స్ లో అటాక్ చేసే ఇంటర్వల్ ఎపిసోడ్ సినిమాకి ఓ మెయిన్ హైలైట్.

                            వీరప్పన్ వలన రియల్ లైఫ్ లో బాగా సఫర్ అయిన శివరాజ్ కుమార్ (ఆయన తండ్రి రాజ్ కుమార్ ని వీరప్పన్ కిడ్నాప్ చేయటం) ఇందులో వీరప్పన్ నే చంపాలని ట్రై చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. వీరప్పన్ ని చంపాలి దానికోసం ఏం చేయడానికైనా ఎవరిని చంపడానికైనా, తను చావడానికైనా సిద్దంగా ఉండే పాత్రలో శివరాజ్ నటన చాలా బాగా చేసాడు. శివరాజ్ కుమార్ తెలుగు వారికి కొత్తైనా నటనపరంగా ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఇకపోతే వీరప్పన్ కి అచ్చుగుద్దినట్టు ఉండేలా సందీప్ భరద్వాజ్ కనిపించాడు. అలాగే క్రూరత్వం, ఫేస్ లో విలనిజం చూపించడంలో ది బెస్ట్ అనిపించుకున్నాడు. వీరిద్దరూ ఈ సినిమాకి ది బెస్ట్ కాస్టింగ్ సెలక్షన్ అని చెప్పాలి. వీరిద్దరి తర్వాత వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో చేసిన యజ్ఞ శెట్టి నటనతో పాటు తన క్యూట్ లుక్స్ కూడా బాగున్నాయి. ఇక పరుల్ యాదవ్ బాగా చేసింది. ఇక మిగిలిన కర్ణాటక నటీనటులు తమ తమ పాత్రల్లో బాగానే చేసారు.

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పార్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. దానికి కారణం రియల్ గా వీరప్పన్ ని చంపిన తరహాలోనే షూట్ చేసిన సీన్ అందరికీ నచ్చుతుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటే సెకండాఫ్ లో చివరి 15 నిమిషాలు మెప్పించగలిగింది.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే...

రమ్మి సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ఫారెస్ట్ ఎపిసోడ్ ని షూట్ చేసిన విధానం చాలా బాగుంది.రఘు కులకర్ణి ఆర్ట్ వర్క్, లొకేషన్ సెలక్షన్ బాగుంది. ఇక వర్మ ప్రజంటెషన్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. తన మార్క్ ను చూపుతూనే ఓ రియలిస్టిక్ చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్లు :

వీరప్పన్ అనగానే అందరూ వీరప్పన్ లైఫ్ ని అందులోని మేజర్ ఇన్సిడెంట్స్ ని చూపిస్తారని అనుకుంటారు. కానీ ఈ కథని వీరప్పన్ పాయింట్ లో చెప్పలేదు.. ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా వీరప్పన్ ని చంపాలనుకున్నాడు అనే పాయింట్ లోనే సినిమాని చెప్పాడు. దాంతో వీరప్పన్ ఎపిసోడ్స్ తక్కువ పోలీస్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. అందువలన వీరప్పన్ గురించి డీటైల్ గా చెప్పలేదే అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో బలంగా ఉండిపోతుంది. అదీ కాక వీరప్పన్ ని పోలీసులు చంపిన మిషన్ గురించి ఇంచు మించు అందరికీ తెలిసిందే. దాని వలన సెకండాఫ్ లో తెలిసిన దాన్నే ఎందుకు చూపిస్తున్నారు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. దానివలన చాలా చోట్ల ఆడియన్స్ కి సినిమా బోర్ కొడుతుంది.

చివరగా :

‘రక్త చరిత్ర’ తర్వాత రామ్ గోపాల్ వర్మ మరోసారి వీరప్పన్ రియల్ లైఫ్ స్టొరీని తీసుకొని చేసిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. ఈ కథలో వీరప్పన్ చివరి దశ, అతన్ని చంపిన ప్లాన్ కి కొన్ని సినిమాటిక్ అంశాలను జోడించి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ మేరకు ఆకట్టుకుంటుందనే చెప్పాలి. వీరప్పన్ ఎంత స్ట్రాంగ్ అనేది చూపడం కోసం చూపిన కొన్ని ఇన్సిడెంట్స్ చూసే ఆడియన్స్ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి.

చివరగా... వీరప్పన్ జీవితాంశం గురించి కాకుండా ఎలా లేపేశారన్నది తెలుసుకోవాలంటే కిల్లింగ్ వీరప్పన్ చూడాల్సిందే. వర్మ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ అవుట్ పుట్.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు