ఇంటర్వ్యూలు

anushka-poudly-says-about-rudramadevi
movie image view

రుద్రమ గురించి గర్వంగా చెప్పుకుంటా

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క టైటిల్‌ పాత్రలో గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో డైరెక్టర్‌ గుణశేఖర్‌ ప్రెస్టీజియస్‌గా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న  ఇండియన్‌ ఫస్ట్‌ హిస్టారికల్‌ త్రీడీ మూవీ ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డిగా, రానా చాళుక్య వీరభద్రుడుగా నటించారు. ‘రుద్రమదేవి’గా అనుష్క గెటప్, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ ఫస్ట్ లుక్‌, చాళుక్య వీరభద్రుడుగా రానా లుక్‌ ఇవన్నీ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన త్రీడీ ప్రీమియర్ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా రుద్రమదేవి గురించి అనుష్క చెప్పిన విశేషాలు...

మరచిపోలేని జర్నీ...

- టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీ అనేది పెద్ద సముద్రం. ఇందులో నాకంటే అందమైన వాళ్లు, బాగా నటించే వాళ్లు చాలామంది వుండవచ్చు. నా వరకు నేను ఏ పని చేసినా హండ్రెడ్‌ పర్సెంట్‌ ఫోకస్‌ పెట్టి చేస్తాను. టాలీవుడ్ లో దాదాపు 47 చిత్రాల్లో నటించాను. అయితే ‘రుద్రమదేవి’ చిత్రంలో నటించడం నా కెరీర్ లోమర్చిపోలేను. హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన నేను మార్చి 12 నాటికి పదేళ్ల కంప్లీట్ చేశాను. ఈ పీరియడ్‌లో అనేక చిత్రాలు చేశాను. వాటిలో నాకు కొన్ని చిత్రాలు చాలా మంచి పేరు తెచ్చాయి. స్టార్‌ హీరోయిన్‌ను చేశాయి. అటువంటి వాటిలో వన్నాఫ్‌ ది బెస్ట్‌ చిత్రంగా ‘రుద్రమదేవి’ నిలుస్తుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన దర్శకులు గుణశేఖర్‌ గారికి, ఆయన సతీమణి రాగిణి గారికి థాంక్స్‌.

స్వేచ్ఛ తీసుకోవాలి.. కానీ దానికి పరిధి ఉండాలి...

- రుద్రమదేవి 13వ శతాబ్దానికి చెందిన ఒక రాణి. ఆ కాలానికి సంబంధించి మనకు దొరికే ఆధారాలు తక్కువ. గుణశేఖర్ గారు కథ చెప్పినప్పుడు నా కళ్ల ముందు సన్నివేశాలు కదలాడాయి. తర్వాత రుద్రమదేవి గురించి గూగుల్‌లో కొన్ని వివరాలు సేకరించాను. ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు ఏదో చేశామని చేయకూడదు. చాలా బాగా స్టడీ చేశాను. అలాగే సినిమాలో మనం ఏవి కావాలంటే అవి చేర్చకూడదు. అలా చేస్తే అసలు కథ దెబ్బతింటుంది. మనం ఎంతవరకు స్వేచ్ఛ కావాలో అంతే పరిధిలో తీసుకుని చేశాం. 

గట్స్ తో పాటు ప్యాషన్ కూడా ఉండాలి...

` గుణశేఖర్‌గారు మంచి ప్యాషన్‌ వున్న నిర్మాత. ఇలాంటి ఒక పీరియాడికల్‌ త్రీడీ సినిమా చేయాలంటే గట్స్ తో పాటు ప్యాషన్‌ కూడా వుండాలి. అలాగే ఆయన వైఫ్‌ రాగిణిగారు, కుటుంబ సభ్యులు బాగా సపోర్ట్‌ చేశారు. ఈ సినిమాకి నేషనల్‌ అవార్డులు వచ్చిన ఆర్టిస్టులు, ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్లు అందరూ పనిచేశారు. గుణశేఖర్‌గారు ఒక దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా వుండడం వల్ల ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు.

గ్రాండియర్ చూసి స్టన్ అయ్యాను...

-సినిమా కథ విన్నప్పుడు, చేసినప్పుడు ఇంత రిచ్‌గా వస్తుందని నేను ఊహించలేదు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను  చూడగానే నేను ఆశ్చర్యపోయాను. ఆ గ్రాండియర్ చూసి స్టన్ అయాయను. ట్రైలరే ఇలా ఉందటే సినిమా నేను ఊహించిన దానికంటే వంద రెట్లు బాగుంటుందని అప్పుడే అనుకున్నాను.గుణశేఖర్‌గారి కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనపడుతుంది. 

ప్రెషర్ ఫీల్ కాలేదు....

- ఎలాంటి ప్రెజర్‌ ఫీల్‌ కాలేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సినిమా అనేది ఒక టీమ్‌వర్క్‌. ఒక సినిమా సక్సెస్‌లో ప్రతి ఒక్కరి పాత్ర వుంటుంది. ఏ ఒకరికో అది సొంతం కాదు. ఈ సినిమాలో నాకంటే ఇళయరాజా, తరణి, గుణశేఖర్‌ గారు వంటి గొప్ప గొప్ప టెక్నీషియన్స్‌ వున్నారు. సినిమా సెట్స్ పైకి రాకముందే ప్లాన్‌గా వచ్చారు. నా నుంచి గుణశేఖర్‌ గారు ఎలాంటి అవుట్‌పుట్‌ను ఎక్స్ పెక్ట్‌ చేశారో దాన్ని నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీలు నేర్చుకున్నాను. షూటింగ్‌కు కొన్ని రోజుల ముందే ప్రాక్టీస్‌ చేశాను. సినిమా సెట్స్ లో ఎక్కువగా గడపడం వల్ల ఈ క్యారెక్టర్‌ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. నీతాలుల్లాగారు డిజైన్స్‌ సహా సినిమాని 90 శాతం ఎలా చేయాలో గుణశేఖర్‌ గారు మైండ్‌లో ఫిక్సయిపోయారు. ఈ క్యారెక్టర్‌ను చాలా ఈజీగా చేశాను...

గర్వంగా చెప్పుకుంటాను...

-‘రుద్రమదేవి’లాంటి సినిమా చేసినపుడు హ్యాపీగా ఫీలయ్యాను అని అనడంకంటే కూడా గర్వంగా ఫీలయ్యాననే చెప్పాలి. భవిష్యత్‌లో నేను రుద్రమదేవి లాంటి చిత్రం చేశానని గర్వంగా చెప్పుకునే విధంగా సినిమా వుంటుంది. 

డిఫరెంట్ గా ఉండాలంటే రిస్క్ చేయాలి...

- కెరీర్‌ అన్నాక ఎవరైనా కొంచెం రిస్క్‌ చేయాలి. అలా చేస్తేనే ఆడియన్స్‌ మనల్ని గుర్తిస్తారు. ‘అరుంధతి’సినిమా తర్వాత ‘వేదం’ సినిమా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అన్నారు.  కానీ ఆ సినిమాలో నా క్యారెక్టర్‌ బాగా నచ్చడంతో చేశాను. సినిమా రిలీజ్‌ తర్వాత ఆ క్యారెక్టర్‌కు చాలా మంచి పేరొచ్చింది. అందుకు కారణం అందులో ఉన్న కొత్తదనమే. అలా డిఫరెంట్‌ రోల్స్‌ చేసినపుడే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. ప్రేక్షకులు కూడా మనల్ని గుర్తిస్తారు.

ఆయనకి పెద్ద ఫ్యాన్ ని...

-ఇళయరాజా గారు తన మ్యూజిక్‌తో మన ఎమోషన్స్‌ని కంట్రోల్‌ చేయగల గొప్ప సంగీత దర్శకులు. ఆయన సంగీతం గురించి మాట్లాడేంత పెద్ద దాన్ని కాదు. ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాలో ఆయన సంగీతం, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాని మరో రేంజ్‌కి తీసుకెళ్తాయి. 

వారికి స్పెషల్ థాంక్స్...

-అల్లు అర్జున్‌, రానాలో వున్న కామన్‌ పాయింట్‌ ఏమిటంటే ఇద్దరూ చాలా ప్యాషన్‌ వున్న హీరోలు. వారి వారి పాత్రలు వినగానే ఇమీడియట్‌గా ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నారు. సినిమా ఇంత బాగా రావడానికి వాళ్లు కూడా కారణం. అందుకు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి ...

-హీరోయిన్ గా పదేళ్ల కెరీర్ ను పూర్తి చేసినందుకు హ్యపీగా ఉంది. నాపై ఇంత అభిమానం  చూపిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఈ పదేళ్ల కాలంలో చాలా మంచి పాత్రలనే చేశాను. అలాంటి వాటిలో ఈ రుద్రమదేవి క్యారెక్టర్ ఒకటి. ఈ సినిమా అభిమానుల అంచనాలకు  తగ్గట్లు ఉంటుంది.