ఇంటర్వ్యూలు

saidharam-says-powerstar-pawan-kalyan-words-inspired-him
movie image view

ఆ మాటలు నాలో చాలా ఉత్తేజాన్ని నింపాయి

షూటింగ్ ల్లో యాక్షన్, కట్ మధ్య జీవిస్తుంటాం. ఏ మాత్రం అవకాశం వచ్చినా సెట్ లోనే సరాదాగా గడపటానికి ప్రయత్నిస్తుంటాం. ఒకరి మీద ఒకరు జోకులేసుకోవడం, అందరూ కలసి ఒకరినే ఏడిపించడం..ఏదయితేనేం..పని వత్తిడి తెలియకుండా ఉండేందుకు ఏదో ఒక అల్లరి పనులు చేస్తుంటాం. అని అన్నాడు మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్..’రేయ్’, ‘పిల్లానువ్వులేని జీవితం’ చిత్రాలు తర్వాత ప్రస్తుతం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. షూటింగ్ గురించి సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చిన ముచ్చట్లు...

నన్ను బాగా ఏడిపించింది...

రామోజీ ఫిల్మ్ సిటీలో పిల్లా నువ్వులేని జీవితం చిత్రం కోసం పాటను షూట్ చేస్తున్నారు. నేను, రెజీనా కలిసి చేయాల్సిన సింపుల్ స్టెప్స్ అవి. షూటింగ్ జరుగుతుండగా ఫిల్మ్ సిటీ సందర్శనకు వచ్చిన వాళ్లంతా చుట్టూ గుమిగూడారు. దాంతో నా మైండ్ బ్లాంక్ అయింది. వాళ్ల ముందు డ్యాన్స్ వేయలేకపోయాను. నేను డ్యాన్స్ బాగా వేయలేకపోతే...నాకు డ్యాన్స్ బాగా రాదని, అంటారేమోననే అనుమానం మొదలైంది. దాంతో డ్యాన్స్ సరిగా చేయలేకపోయాను. ‘ఇంత చిన్న స్టెప్పులు కూడా వేయలేకపోతే ఎలా? బాబూ’ అంటూ ఏడిపించసాగింది. క్రౌడ్ ని చూసిన ప్రతిసారి నాకు ఆ సీన్ గుర్తుకు వస్తుంది.

సయామీ11.. రెజీనా 14...

సీన్ పరంగా ఎమోషన్ పండించడానికి కొన్ని షాట్స్ ను నాలుగైదు యాంగిల్స్ లో తీస్తుంటారు. రేయ్ లో సయామీ ఖేర్ నన్ను కొట్టే సీన్ ఉంది. అన్నీ యాంగిల్స్ తీయడం పూర్తయ్యేసరికి తను నన్ను 11 సార్లు కొట్టింది. అలాగే పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో రెజీనా నన్ను కొట్టే సీనుంది. ఆ సీన్ కోసం రెజీనా నన్ను 14 సార్లు కొట్టింది.

గాగుల్స్.. మేకప్ మేన్...

సెట్ లో ఎప్పుడూ జోవియల్ గా ఉండటం నాకు అలవాటు. ఓ సారి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. బోర్ కొట్టింది. షాట్ పూర్తి కాగానే గాగుల్స్ తీసి మేకప్ మేన్ చేతిలో పెట్టా. ఎవరో పిలిచారని తను గాగుల్స్ ను అక్కడే పెట్టి పక్కకి వెళ్లాడు. నేను వెంటనే వాటిని తీసి దాచేశా. ఏం తెలియనట్లు కూర్చున్నా. షాట్ రెడీ సార్ అని అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పాక ‘గాగుల్స్ ఇవ్వు’ అని మేకప్ మేన్ ను అడిగా. అతను దాన్ని వెతికిన తీరు నాకు ఇప్పటికి గుర్తొచ్చినా నవ్వు వస్తుంది. సెట్ మొత్తం వెతికాక నిదానంగా వచ్చి ‘అవి కనిపించడం లేదు సార్’ అన్నారు. ‘అయ్యో ..అవి లేకుంటే సీన్ కంటిన్యూటి దెబ్బతింటుంది.  పైగా అవి నావి కూడా కావు. డైరెక్టర్ గారివి..ఇప్పుడెలా?’ అని గాభరా పడుతున్నట్లు నటించా. అతనిలో షివరింగ్ మొదలైంది. మధ్యాహ్నం వరకు ఏడిపించి ‘ఏ చోటూ మేరీ పాస్ హై’ అంటూ చూపించా. అంతే అతనికి నవ్వుకి బదులు ఏడుపు వచ్చినంత పనైంది.

తొలిగాయం...

అమెరికాలో ‘రేయ్’ సినిమాకి సంబంధించి సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మోకాలిపై డ్యాన్స్ వేసే మూమొంట్ ఉంటుంది. ఉన్నట్లుండి మోకాలిపై బరుపు పడిందేమో బాగా వాచింది. డాక్టర్ దగ్గరకెళితే హెయిర్ లైన్ క్రాక్ వచ్చింది. రెండు నెలలు రెస్ట్ తప్పదన్నారు. దాంతో యూనిట్ అందరం అమెరికా నుండి తిరిగి వచ్చేశాం. వెళ్లిన రెండో రోజే అలా జరగడం జీర్ణించుకోలేక పోయాను. అప్పుడు నుంచి ఔట్ డోర్ షూటింగ్ వెళ్లేటప్పుడంతా దేవుడికి దణ్ణం పెట్టుకుంటా..

 24 గంటలు...

నటీనటులు సమయాన్ని పట్టించుకోకుండా షూటింగ్ చేస్తారని నాకు తెలుసు. మా మావయ్యలు రాత్రింబగళ్లు షూటింగ్ చేసేవారని అమ్మ చెప్పేది. రేయ్ సినిమా కోసం ఓ రోజు ఉదయం 9 నుండి మరుసటి రోజు ఉదయం 9 వరకు షూటింగ్ చేయాల్సి వచ్చింది. టఫ్ ఫ్లోర్ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. బాగా ఆలసిపోయాను. అప్పుడు పెద్ద మావయ్య చిరంజీవిగారు ఫోన్ చేసి బాగా కష్టపడు..బాగా చేయ్ తేజూ అని నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ మాటలు ఇచ్చిన ఉత్తేజాన్ని మాటల్లో చెప్పలేను.

kai-raja-kai-hero-manas-says-movie-will-impress-all-section-of-people
movie image view

‘కాయ్‌ రాజా కాయ్‌’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది

చిన్న వయసులోనే ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా దాదాపు 10కి పైగా చిత్రాల్లో నటించి బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుని సొంతం చేసుకున్న మానస్‌ ఇప్పుడు హీరోగా నటిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ‘ఝలక్‌, గ్రీన్‌సిగ్నల్‌, నూతిలో కప్పలు’ చిత్రాల్లో యువహీరోగా నటించి ప్రేక్షకుల మనసుల్లో లవర్‌బోయ్‌గా ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యువహీరో నటిస్తున్న చిత్రం ‘కాయ్‌ రాజా కాయ్‌’. మారుతి దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన శివగణేష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మారుతి టాకీస్‌ బ్యానర్‌లో ఫుల్‌మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.సతీష్‌రాజు సమర్పిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 23న విడుదలవుతోన్న సందర్భంగా యువ హీరో మానస్‌ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు.

లవర్‌బోయ్‌గా మంచి పేరొచ్చింది...

చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. మెగాస్టార్‌ చిరంజీవి గారి డ్యాన్స్‌ చూసి ఇన్‌స్పైర్‌ అయ్యేవాడిని. ఆ ఇన్‌స్పిరేషనే నన్ను నటుడిని చేసింది. కమల్‌హాసన్‌, పవన్‌కళ్యాణ్‌, రవితేజ, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లను ఆదర్శంగా తీసుకుంటున్నాను. ‘రaలక్‌, గ్రీన్‌ సిగ్నల్‌, నూతిలో కప్పలు’ చిత్రాల్లో నటించిన నాకు లవర్‌బోయ్‌గా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రంలో మెయిన్‌ లీడ్‌ పాత్రను చేసాను. నాతోపాటు ఇంకో మెయిన్‌లీడ్‌ పాత్రలో రామ్‌ ఖన్నా నటించాడు. ఈ చిత్రం ద్వారా మారుతి గారి శిష్యుడు శివగణేష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రేపు (ఏప్రిల్‌ 23న) ఈ చిత్రం ప్రపంచవాప్తంగా రిలీజ్‌ అవుతోంది.

యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌, లవ్‌, ఫ్రెండ్‌షిప్‌...

కథ డిమాండ్స్‌ మేరకు ఇందులో ఇద్దరు హీరోలు కావాలి. నాతో పాటు మరో హీరోగా రామ్‌ ఖన్నాని తీసుకున్నారు. యాక్షన్‌, కామెడీతో పాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి. జోష్‌ రవి పాత్ర పూర్తి ఎంటర్‌టైనింగ్‌ని కలుగజేస్తుంది.  హీరోయిన్స్‌ శ్రావ్య, షామిలి తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్‌ కష్టపడి నటించారు. దర్శకుడు శివగణేష్‌ మా దగ్గర్నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ‘కాయ్‌ రాజా కాయ్‌’ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ కమర్షియల్‌ మూవీ. యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌, లవ్‌, ఫ్రెండ్‌షిప్‌ ఇలా ఒక కమర్షియల్‌ మూవీకి వుండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో వున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.

మా ముగ్గురి లైఫ్‌ని ఛేంజ్‌ చేసే గేమ్‌...

నాతో పాటు రామ్‌ఖన్నా, జోష్‌ రవి అద్భుతంగా నటించారు. ఇందులో నా పాత్ర పేరు ఆనంద్‌. చాలా రెస్పాన్సిబిలిటీస్‌ వున్న ఒక కుర్రాడి పాత్ర. తన కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం కోసం విలేజ్‌ నుంచి సిటీకి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎంబిఎ, ఎంసిఎ చేసినోళ్లకే సిటీలో జాబ్స్‌ దొరకట్లేదు. డిగ్రీ చదివిన నాకు ఎవరు జాబ్‌ ఇస్తారు.. ఇక్కడ జాబ్‌ దొరకటం కష్టమేనని ఆ కుర్రాడికి అర్ధమైపోతుంది. ఎలాగోలా ఎమ్మెల్యే హౌస్‌లో ఒక జాబ్‌ సంపాదించడం, ఆ తర్వాత ఎమ్మెల్యే కుమర్తెను లవ్‌ చేయడం, ఎమ్మెల్యే గ్యాంగ్‌ మా వెంటపడటం లాంటి సన్నివేశాలు వుంటాయి. నార్మల్‌గా వుండే మా ముగ్గురి లైఫ్‌ని ఛేంజ్‌ చేసిన గేమ్‌ కాయ్‌ రాజా కాయ్‌. అది ఎలాగో ఇప్పుడు చెప్పడం కన్నా సినిమా చూస్తేనే బాగుంటుంది.

మంచి నటుడు అనిపించుకోవాలనేది నా కోరిక...

లవర్‌బోయ్‌గా వుంటూనే మాస్‌ ప్రేక్షకులను కూడా మెప్పించాలనుంది. అందుకు చాలా కష్టపడాలి. కానీ కృషి, పట్టుదల వుంటే ఏదైనా సాధించవచ్చు అంటారు. ఎప్పటికైనా ఇటు క్లాస్‌, అటు మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాను. కథకు ఇంపార్టెన్స్‌ వున్న ఎలాంటి క్యారెక్టర్‌ చేయడానికైనా నేనెప్పుడూ సిద్ధమే. అయితే నేను పోషించే పాత్ర ద్వారా మానస్‌ మంచి నటుడు అనిపించుకోవాలనేది నా కోరిక.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌...

ప్రస్తుతం హీరోగా రెండు చిత్రాలు ఒప్పుకున్నాను. వీటిలో ఒక ప్రాజెక్ట్‌ పెద్ద బ్యానర్‌లో వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అయ్యింది. సాంగ్స్‌ బ్యాలెన్స్‌ వున్నాయి. ఈ నెలాఖరులో సాంగ్స్‌ని చిత్రీకరించాడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇంకా రెండు మూడు చిత్రాలకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు.

 

director-bhanu-kiran-says-aloukika-is-a-different-thriller-concept
movie image view

డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘అలౌకిక’ ప్రేక్షకులను ఆలరిస్తుంది

మీడియా రంగం నుండి సినిమా రంగానికి వచ్చి తన సత్తా చాటుతున్న వారిలో డైరెక్టర్ భానుకిరణ్ చల్లా ఒకరు. తొలి సినిమా ‘పంచముఖి’ అనే డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు చేరువైన ఈ యంగ్ డైరెక్టర్ నుండి వస్తోన్న మరో డిఫరెంట్ మూవీ ‘అలౌకిక’. శ్రీ హయగ్రీవ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘అలౌకిక’. మనోజ్ నందం, మిత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో మాదాల రవి, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. డా.జె.ఆర్.రావ్ నిర్మాత. భానుకిరణ్ చల్లా దర్శకుడు. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రేక్షకులకు కావాల్సింది. మంచి కథ, కథనం అది ఉంటే సినిమాలకు ఆదరణ తగ్గదంటున్న డైరెక్టర్ భానుకిరణ్ తో ఇంటర్వ్యూ.....

నేపథ్యం..?

- నేను బేసిక్ గా మీడియా రంగానికి చెందిన వ్యక్తిని. ఈటీవీ, జెమిని టీవీ, వనిత టీవీల్లో చాలా ప్రాజెక్ట్స్ ను హ్యండిల్ చేశాను. మనసులో దర్శకుడిని కావాలనే కోరిక బలంగా ఉండటంతో సినిమా రంగం వైపు అడుగులు పడ్డాయి. ఇక మీకు తెలిసిన విషయాలే. పంచముఖి అనే సినిమాతో దర్శకుడిగా మారాను.

అలౌకిక సినిమా ఎలా రూపు దాల్సింది..?

-‘పంచముఖి’ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నప్పుడే నిర్మాత జి.ఆర్.రావ్ గారు కథ విన్నారు. కథ ఆయనకి బాగా నచ్చడంతో సినిమా చేద్దామని అన్నారు. ఈ సినిమా విషయంలో నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి సినిమా చేయించుకున్నారు.

అలౌకిక అంటే..?   

-లౌకికం కానిది. అంటే ఈ లోకంతో సంబంధం లేనిదని అర్థం. ఈ లోకానికి సంబందం లేనివి ఆత్మలు మాత్రమే. అందుకే ఈ టైటిల్ ను పెట్టాం. టైటిల్ విన్నవాళ్లు బాగుందని అన్నారు. టైటిల్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి.

సినిమా ఏ జోనర్ కి చెందింది?

-థ్రిల్లర్ సినిమా. హర్రర్ పార్ట్ కొంచెం ఉంటుంది. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఓ పెళ్లికి వెళ్లే దారిలో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే కథాంశం.  

ఆడియో రెస్పాన్స్...?

-ప్రమోద్ కుమార్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో విడుదల కూడా డిఫరెంట్ గా చేశాం. ఆరు పాటలకు మంచి ట్యూన్స్ కుదిరాయి. ఆరు పాటలను ఆరు చోట్ల విడుదల చేశాం. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ సినిమాని తమదిగా భావిస్తారు. మేం ఉహించినట్లే పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఎక్సలెంట్ గా కుదిరింది.

నటీనటులు, టెక్నిషియన్స్ పనితీరు..?

-సినిమా చేయాలనుకోగానే ఏ రోల్ ఎవరు చేస్తే బాగుంటుందని ముందుగా డిసైడ్ చేసుకుని నిర్మాత రావ్ గారితో చెప్పాను. ఆయన కూడా సరేనన్నారు. మనోజ్ నందం, బ్రహ్మాజీ, మాదాల రవి, మిత్ర, తాగుబోతు రమేష్, రాఘవ సహా ప్రతి ఒక్కరూ మంచి నటనను కనపరిచారు. ఇక టెక్నిషియన్స్ విషయానికొస్తే ప్రమోద్ కుమార్ సంగీతం, ప్రకాష్ రావు సినిమాటోగ్రఫీ, నాగిరెడ్డి ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి.

నిర్మాత డా.జె.ఆర్.రావ్ గురించి...?

-ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంచి టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్. సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కథ విషయంలో నాకు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. ఆయన చేసిన సపోర్ట్ కారణంగానే సినిమా చాలా బాగా వచ్చింది.

సినిమా విడుదల ఎప్పుడు ఉంటుంది..?

-ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ జరుపుకోనుంది. సెన్సార్ పూర్తి కాగానే సినిమా విడుదల తేది ప్రకటిస్తాం. పంచముఖి చిత్రంతో నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులను ఈ సినిమాతో మరోసారి తప్పకుండా ఆకట్టుకుంటాను. డిఫరెంట్ థిల్లర్ కాన్సెప్ట్ తో సాగే అలౌకిక తెలుగు ప్రేక్షకులను అలరించడం ఖాయం.

నెక్స్ ట్ ప్రాజెక్ట్...?

-తెలుగులో ఇదే బ్యానర్ లో అఖండిత అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను చేస్తున్నాను. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తాం. అలాగే కన్నడలో ఐ మిస్ యూ రా, తమిళంలో ‘అళగాన రాక్షసి’సినిమాలు చేయబోతున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు నిర్మాత చల్లా భానుకిరణ్...

 

calling-bell-director-panna-rai-about-movie
movie image view

‘కాలింగ్ బెల్’ చిత్రాన్ని సక్సెస్ చేసిన ఆడియెన్స్ కి ధన్యవాదాలు

రవివర్మ, కిషోర్‌, సంకీర్త్‌, వ్రితి ఖన్నా, మమత రహుత్‌ ప్రధాన పాత్రల్లో గోల్డెన్‌ టైమ్‌ పిక్చర్స్‌ పతాకంపై పన్నా రాయల్‌ దర్శకత్వలో అనూద్‌ నిర్మించిన హార్రర్‌ థ్రిల్లర్‌ ‘కాలింగ్‌బెల్‌’. ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా వస్తున్న రెస్పాన్స్‌కి థియేటర్స్‌ కూడా పెంచారు. ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు పన్నా రాయల్‌తో ఇంటర్వ్యూ.

 కాలింగ్‌ బెల్‌’ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

 చాలా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. నేను ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. సినిమాకి ఒక్కరు వచ్చి నెక్స్‌టైమ్‌ పదిమందిని తీసుకెళ్తున్నారు. మాస్‌ ఆడియన్స్‌కి ఈ సినిమా విపరీతంగా నచ్చింది. ఒక చిన్న మూవీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో వర్కవుట్‌ అవుతోందంటే అదే సక్సెస్‌ అని నేను ఫీల్‌ అవుతున్నాను. నైజాం ఏరియాలో మాత్రమే సరైన థియేటర్స్‌ దొరక్క కొంచెం రెస్పాన్స్‌ కాస్త వీక్‌గా వుంది తప్ప ఈస్ట్‌, వెస్ట్‌, వైజాగ్‌, విజయవాడ, గుంటూరు నుంచి చాలా గుడ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నిన్న వైజాగ్‌లో వినాయక్‌గారి విమాక్స్‌ థియేటర్‌లో ఆల్‌ షోస్‌ హౌస్‌ఫుల్స్‌ అయ్యాయి. వైజాగ్‌ డిస్ట్రిబ్యూటర్‌ శంకర్‌ ఫోన్‌ చేసి రెస్పాన్స్‌ చాలా బాగుందని చెప్పారు. ఇంతకుముందు చేసిన మూడు సినిమాల వల్ల తను లాస్‌ అయ్యానని, ఈ సినిమా తనకు మంచి ప్రాఫిట్స్‌ ఇస్తోందని చెప్పారు. ఇప్పుడు తనని అందరూ కాలింగ్‌ బెల్‌ శంకర్‌ అని పిలుస్తున్నారని చెప్పారు. ఇప్పుడున్న సినిమాల్లో ‘కాలింగ్‌ బెల్‌’రెవిన్యూ పరంగా సూపర్‌ సక్సెస్‌ అయిందని చెప్తున్నారు. మాకు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

రెవిన్యూ పరంగా ఎక్కడెక్కడ బాగుంది?

 షేర్‌ వైజ్‌ చూస్తే నెల్లూరు, వైజాగ్‌ టాప్‌లో వుంది. ఈస్ట్‌, వెస్ట్‌లలో కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రెండో వారంలో మరో 12 థియేటర్లు పెంచాం. దీనికి నేను చాలా హ్యాపీగా వున్నాను. 

 మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?

 నేను బేసిక్‌గా విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ని. 10 సంవత్సరాల నుంచి ఫ్రీ లాన్సర్‌గా గ్రాఫిక్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నాను. బాంబేలో కూడా పనిచేశాను. న్యూక్‌ అనే సాఫ్ట్‌వేర్‌లో పది మంది వుండే మా టీమ్‌ డిజిటల్‌ డొమైన్‌ అనే కంపెనీ ద్వారా ఇండియాలోనే ఫస్ట్‌ టైమ్‌ ట్రైన్‌ అయింది. కింగ్‌కాంగ్‌ లాంటి సినిమాలు ఈ సాఫ్ట్‌వేర్‌లో చేశారు. విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా వర్క్‌ చేస్తూ ఒక పెద్ద మూవీ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ ప్రాజెక్ట్‌కి ముందు నీకు ఒక సర్కిల్‌ ఫామ్‌ అవ్వాలి, నీ టాలెంట్‌ని ప్రూవ్‌ చేసే ఒక చిన్న సినిమా చెయ్యమని పెద్దలు సలహా ఇవ్వడంతో ఈ సినిమా చేశాను. 

 ఈ సినిమా చెయ్యడంలో ప్రొడ్యూసర్‌ కోఆపరేషన్‌ ఎలా వుంది?

 ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌ అనూద్‌గారు. మొదట ఒక చిన్న ప్రాజెక్ట్‌గా అనుకున్నాం. షూటింగ్‌ జరిగేటపుడు సీన్స్‌ బాగా రావడం చూసి అనూద్‌గారు చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. మొదట20 కాల్షీట్స్‌లో సినిమాని పూర్తి చేద్దామనుకున్నాం. కానీ, మా ప్రొడ్యూసర్‌ 52 కాల్షీట్స్‌ వరకు తీసుకెళ్ళారు. గ్రాఫిక్స్‌ పరంగా, స్టోరీ పరంగా ఆయనకి బాగా నచ్చి ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా టెక్నికల్‌ సపోర్ట్‌ కూడా బాగా వుండేలా నాకు మంచి సహకారాన్ని అందించారు. 

 థియేటర్‌లో ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా వుంది?

 ఆడియన్స్‌ రెస్పాన్స్‌ అల్టిమేట్‌ అని చెప్పాలి. ఒక చిన్న సినిమాకి ఇలాంటి రెస్పాన్స్‌ కూడా వుంటుందా అని ఆశ్చర్యపోయాను. రిపీటెడ్‌గా థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా వున్నాను. 

 మీరు ఎలాంటి సినిమాలు చెయ్యడానికి ఇష్టపడతారు?

 ఫ్రాంక్‌గా చెప్పాలంటే సోషియో ఫాంటసీ, హార్రర్‌, థ్రిల్లర్‌, సైన్స్‌ ఫిక్షన్‌లలోనే సినిమాలు చేస్తాను. లవ్‌ సినిమా చెయ్యమని చెప్పినా అందులో హార్రర్‌ ఎలిమెంట్‌ మిక్స్‌ చేస్తాను. ఫ్యూచర్‌లో నేను చేసే సినిమాలు ఇవే. కానీ, అడ్వంచరస్‌ మూవీ, ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే సినిమాలు చేస్తాను. వెంట వెంటనే సినిమాలు చెయ్యకుండా సెలెక్టివ్‌గా చేస్తాను. ఖచ్చితంగా థియేటర్‌ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్‌ డిజప్పాయింట్‌ అవకుండా వుండే సినిమాలు చెయ్యాలన్నది నా కోరిక. 

 డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇంతకుముందు ఎవరి దగ్గర పనిచేశారు?

 నేను ఎవ్వరి దగ్గరా పనిచెయ్యలేదు. డైరెక్షన్‌ అంటే ఇలా వుంటుంది అని సెట్‌లోకి కూడా వెళ్ళి చూడలేదు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజింగ్‌ నాకు చాలా హెల్ప్‌ అయింది. ఒక సీన్‌లో ఎలాంటి ఎఫెక్ట్స్‌ వుండాలి అనేది డైరెక్టర్‌ మాకు చెప్తారు. దానికి తగ్గట్టు మేం డిజైన్‌ చేసి చూపిస్తాం. అలా వర్క్‌ చేయడం వల్ల నాకు కొంత నాలెడ్జ్‌ వచ్చింది.

 నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి?

 నా సినిమాలో నటించమని చాలా మంది హీరోలను సంప్రదించగా నేను కొత్తవాడినని, చిన్న బడ్జెట్ సినిమా అని ఎవరు నటించడానికి ముందుకు రాలేదు. కానీ సినిమా విడుదలయ్యాక సినిమా సీక్వెల్ చేస్తే నటిస్తామని ఫోన్స్ చేసారు. రవివర్మ, మమత, వ్రితి ఖన్నా వారి పరిధిలో బాగా నటించారు. సినిమాలో ప్రణతిగారు పాడిన రెండు పాటలు హైలైట్ గా నిలిచాయి.

 నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి?

 ప్రస్తుతానికి నా చేతిలో 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 3 మెయిన్ ప్రాజెక్ట్స్. ఒకటి పెద్ద ప్రాజెక్ట్ ఉంది. కానీ కాలింగ్ బెల్ మూవీ చూసిన వారు సీక్వెల్ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు. నేను కాలింగ్ బెల్ కథను మూడు భాగాలుగా రాసాను. కాలింగ్ బెల్ సీక్వెల్ తోపాటు మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. రెండిటిలో ఒకటి ఫైనల్ చేసి ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు పన్నా రాయల్‌. 

actor-ravivarma-about-calling-bell-success
movie image view

‘కాలింగ్ బెల్’ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్

ఎన్నో చిత్రాల్లో పాజిటివ్, నెగటివ్ రోల్స్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు రవివర్మ. తాజాగా కాలింగ్ బెల్ చిత్రంలో లీడ్ రోల్ లో నటించి మెప్పించాడు. కాలింగ్ బెల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా రవివర్మతో చిట్ చాట్....

చదువు...

చిన్నప్పుడు కథక్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సెయింట్ థెరిసాలో స్కూలింగ్ తర్వాత ఇంజనీరింగ్ సి.బి.ఐ.టి లో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత యాక్టింగ్ కోర్సు చేద్దామని యు.ఎస్. వెళ్లాను. న్యూయార్క్ ఫిలిం ఆకాడమీలో కోర్సు చేశాను. అక్కడ ఉంటున్నప్పుడు నన్ను దేవాకట్టాగారు ‘వెన్నెల’ సినిమా కోసం ఆడిషన్ లో సెలక్ట్ చేసుకున్నారు.

తొలి చిత్రమే మంచి బ్రేక్...

2004నా మొదటి సినిమా ‘వెన్నెల’తో సయ్యద్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. తొలి సినిమాతోనే మంచి బ్రేక్ వచ్చింది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో నాకు వరుసగా ‘సైనికుడు’, ‘రాఖీ’, ‘బొమ్మరిల్లు’, ‘క్లాస్ మేట్స్’ చిత్రాల్లో అవకాశం వచ్చాయి. తర్వాత మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. నువ్వే చిత్రంలో వన్ ఆఫ్ ది లీడ్ గా చేశాను. అలాగే ‘జల్సా’, ‘రెఢీ’ చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాను. ‘విరోధి’లో కూడా చాలా మంచి రోల్ చేశాను. ‘నేనొక్కడినే’, ‘అలా ఎలా’, ‘బూచమ్మబూచోడు’,‘తుంగభద్ర’, ‘వీకెండ్ లవ్’ చిత్రాలు చేశాను.

వారిద్దరే నాకు ఇన్ స్ఫిరేషన్ గా నిలిచారు...

నాకు కమల్ హాసన్, చిరంజీవిగారి డ్యాన్సులు అంటే చాలా ఇష్టం ‘సాగర సంఘమం’, ‘అభిలాష’ చిత్రాలు చూసి డ్యాన్సులు నేర్చుకోవాలనుకుని నేర్చుకున్నాను. ఇప్పటికి వారిద్దరూ నాకు ఇన్ స్పిరేషన్.

కాలింగ్ బెల్ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది...

‘కాలింగ్ బెల్’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. చాలా హ్యపీగా అనిపించింది. ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాను. ప్రేక్షకులు నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ఇప్పటి వరకు దాదాపు 26 చిత్రాలు చేశాను. పాజిటివ్, నెగటివ్ రోల్ చేసినా ప్రతి సినిమాలో నా రోల్ డిఫరెంట్ గా కనపడుతుంది. ఇంత మంచి గుర్తింపు రావడానికి కారణం దర్శకుడు, నిర్మాత, హీరోలే కారణం.

నెక్స్ ట్ ప్రాజెక్ట్....

నారారోహిత్ ‘అసుర’, ‘క్రిమినల్స్’, పివిపి బ్యానర్ ‘క్షణం’, హోప్ దర్శకుడు సతీష్ కాసెట్టి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ఓ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాను. ఏడెనిమిది చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను. ప్రస్తుతం మహేష్ బాబు ‘శ్రీమంతుడు’, ‘దోచేయ్’ చిత్రాల్లో నటిస్తున్నాను.

వారితో చేసిన ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను....

నా ఏమోషనల్ క్యారీ చేసే పాత్రలను చేయడానికి ఇష్టపడతాను. అది పాజిటివ్, నెగటివ్ రోల్స్ అయినా సరే. కాలింగ్ బెల్  ఆఫర్ కూడా అలాగే వచ్చింది. ప్రతి లీడ్ క్యారెక్టర్ తో చేసేటప్పుడు ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నాను. పవన్, మహేష్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది నుండి చాలా విషయాలను నేర్చుకున్నాను.

kamal-hassan-remembers-his-guru-bala-chander
movie image view

ఆయన కాంప్లిమెంటే పెద్ద గిప్ట్ – కమల్ హాసన్

కమల్ హాసన్ ..ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన లెజెండ్రీ యాక్టర్. నటనలో ఆయనకు అసాధ్యమంటూ ఉండదనే రేంజ్ లో ఆయన సినిమాలుంటాయి. భారీ కమర్షియల్ సినిమాల్లో కనిపించే కమల్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోవడానికి ఇష్టపడరు.  పాత్ర చిన్నదా? పెద్దదా అని ఆలోచించకుండా కొత్తదనం కోసం పరితపిస్తుంటారు.  అందుకు ఆయన చెప్పే సింపుల్ రీజన్ కొత్తగా చేయాలనిపించిందనడమే. ఆయన సినిమా ప్రతిదీ డిఫరెంట్ గా ఉండాలని ఆలోచిస్తారు..అదే ఆయన నైజం. అందుకే ఆయన యూనివర్సల్ హీరో అయ్యారు. కమల్ హాసన్ సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని సగటు ప్రేక్షకుడి నుండి ఇండస్ట్రీ వర్గాల వరకు ఆసక్తిగా ఎదరుచూస్తారు. అటువంటి అసామాన్య నటుడి నుండి వస్తోన్న మరో చిత్రమే ‘ఉత్తమవిలన్’.. అసలు విలన్ అంటేనే ప్రతినాయకుడు, అందులో ‘ఉత్తమ విలన్’ ఏంటి అనే విషయం గురించి ఆయన మాటల్లోనే..

ఉత్తమవిలన్ చేయడానికి ప్రధాన కారణం...

ప్రతి సినిమా చేయడానికి ప్రధాన కారణం మనీ..డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులో దాచడానికి ఏమీ లేదు. ఒకవేళ నిజంగా డబ్బులే పరమావధిగా అనుకుంటే ఎలాంటి సినిమా అయినా చేయవచ్చు. కానీ ఒక మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి పాయింట్ అనుకుని దానికి అనుగుణంగా సినిమా చేసిన దర్శకులు బాలచందర్ గారు, దాసరి నారాయణరావుగారు, కె.విశ్వనాథ్ గారు వంటి ఎందరో ఉన్నారు. నేను అటువంటి స్కూల్ కి చెందిన స్టూడెంట్ నే. అలాంటి ఒక డిఫరెంట్ పాయింట్ ఉత్తమ విలన్ చిత్రంలో ఉందనిపించే చేశాను.

ఉత్తమ విలన్ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?

తమిళనాట విల్లు పాట ప్రాచుర్యం చెందిన జానపద కళారూపం. దాన్ని ఈ సినిమాలో ఉపయోగించాం. దాన్ని డిఫరెంట్ గా అందంగా చూపించాం. అలాగే ఉత్తమ విలుకారుడు అని అనవచ్చు.  ఇక ముఖ్యగా ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న స్వభావం. మనల్ని హీరోగానో, విలన్ గానో చేస్తాయి. మన దృష్టిలో వేరే వాళ్లు విలన్ గా కనపడతారు. వేరేవాళ్ల దృష్టిలో మనం విలన్ గా ఉండవచ్చు. ఇక్కడ మనం చూసే దృష్టి, పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. అటువంటి పరిస్థితులను ఎలా కంట్రోల్ చేసి ఉత్తముడిగా నిలవాలనేదే సినిమా.

మీరు దర్శకుడై కూడా రమేష్ అరవింద్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం రీజన్ ఏంటి?

ఈ కథ రాసుకున్నప్పుడే చాలా స్పాన్ ఉందని అర్థమైంది. అలాంటి సమయంలో సినిమాలో యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేయడం కుదరదనిపించింది. అదీ కాక రమేష్ అరవింద్ తో పరిచయం ఇప్పటిది కాదు. నా గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. తనైతే నా ఐడియాలజీని క్యారీ చేస్తాడనిపించింది. అందుకే తనని దర్శకత్వం చేయమన్నాను.

ఈ సినిమాలో కె.బాలచందర్, కె.విశ్వనాథం వంటి దర్శకులతో పనిచేస్తున్నప్పుడు  ఎలా అనిపించింది?

ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ తో గతంలో పనిచేశాను కాబట్టి ఇందులో నేనేం ఇబ్బంది పడలేదు. చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాం.

కె.బాలచందర్ గారితో ఉన్న అనుబంధం?

మా నాన్నగారు లాయర్. అప్పుడప్పుడు వచ్చి నన్ను కలిసేవారు. కానీ పదహారేళ్ల నుండి నాకు బాలచందర్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది. ప్రతి రోజు ఆయన్ని కలిసేవాడిని. ప్రొఫెషనల్ గానే కాకుండా పర్సనల్ గా కూడా మంచి రిలేషన్ ఏర్పడింది. నా కోసం 36 సినిమాలకు స్క్రీన్ ప్లే రాశారు. ఆయన సినిమాలకు పనిచేసేటప్పుడు ఎన్ని రోజుల కాల్షీట్ కావాలని ఎప్పుడూ అడగలేదు. మరో చరిత్రకైతే 108 రోజులు పనిచేశాను. ఆ సినిమాలో నా కోసం భరతనాట్యం బిట్ ను పెట్టారు. ఆర్టిస్టుల కోసం స్క్రిప్ట్ రాసే దర్శకుడాయన. దేవుణ్ణి బంగారు పువ్వులతో పూజించలేని పేదవాడు, మామూలు పువ్వులతో పూజిస్తాడట. నేను కూడా ఆయన్న అలాగే పూజించాను.

సినిమా ఏ జోనర్ కి చెందింది?

సినిమా ఏమోషన్స్ ను క్యారీ చేస్తూ సాగిపోయే సినిమా. అలాగే ఫుల్ కామెడి ఉంటుంది. కథలో భాగంగా వచ్చే ఈ కామెడి ప్రేక్షకుడిని అలరిస్తుంది.

థెయ్యమ్ కళాకారుడి గెటప్ ప్రాధాన్యమేంటి?

ఈ గెటప్ కోసం ప్రతి రోజూ నాలుగు గంటలపాటు మేకప్ కోసమే సమయాన్ని కేటాయించాం. సినిమా సెట్స్ లోకి వెళ్లే ముందు అందుకు తగిన విధంగా స్టడీ చేశాం. పర్టికులర్ పాత్ర ప్రాధాన్యత గురించి చెప్పాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

ఇందులో ఎనిమిదవ శతాబ్దపు కళాకారుడిగా, 21వ శతాబ్దపు కళాకారుడిగా కనిపిస్తున్నారు కదా? ఏదైనా పునర్జన్మకి సంబంధించిన స్టోరియా?

నేను సాధారణంగా పునర్జన్మలను నమ్మను. నేనే నమ్మనప్పుడు నా సినిమాలో వాటిని ఎందుకు చూపిస్తాను. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఉత్తమవిలన్ సినిమాని బాలచందర్ గారు చూశారా?

ఆయన చనిపోయేటప్పటికి ఫస్ట్ కాపీ రెడీ కాలేదు. అయితే డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూసి యంగ్ బాలచందర్ సినిమా చూసినట్టుంది అన్నారు. ఆ కాంప్లిమెంటుతో సినిమా పెద్ద హిట్టయ్యిందని అనుకున్నాను. అదే నాకు పెద్ద గిఫ్ట్.

ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో సందడి చేస్తున్నారు కదా..ఎలా ఉంది?

నాలుగో సినిమాకి కూడా రెడీ అవుతున్నాను. ఇలా చేయడానికి కూడా నా గురువుగారు కె.బాలచందర్ గారే ఆదర్శం. ఆయన దర్శక, నిర్మాత, రైటర్ గా ఏడాది ఐదు సినిమాలు కూడా రిలీజ్ చేశారు. ఆయన స్ఫూర్తితోనే స్పీడ్ పెంచాను.