ఫ్రైడే రిలీజెస్

furious
movie image view

ఊపిరి

మున్నా' సినిమాతో కెరీర్ ప్రారంభించి 'బృందావనం', 'ఎవడు' వంటి చిత్రాలతో స్టైలిష్ మేకర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'ఊపిరి'. నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ పతాకంపై తెరకెక్కుతోంది.

                      ది అన్ టచబుల్ అనే ఫ్రెంచి సినిమాను బేస్ లైన్ గా తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ్ ఇందులో పూర్తిగా వీల్ ఛైర్ కి అంకితమయ్యే పాత్రలో అలరించనున్నాడు. ఇక అతడికి సంరక్షకుడిగా కార్తీ, తమన్నాలు నటించనున్నారు. ట్రైలర్ ను బట్టి ఇదో ఎమోషనల్ ఫీల్ ఉణ్న మూవీ అని తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ శుక్రవారమే విడుదల కానుంది. సోగ్గాడే చిన్నినాయన తర్వాత నాగ్ నుంచి వస్తున్న మరో వైవిధ్య భరితమైన చిత్రం కావటం, పైగా తమిళ నటుడు కార్తీ తొలిసారి స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటించడంతో ఈ మల్టీ స్టారర్ చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి.

furious
movie image view

తుంటరి

టాలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చేవాళ్ల‌లో చాలా మంది హీరోలు మాస్ ఇమేజ్ కోస‌మే ట్రే చేయ‌డంతో పాటు ఫంక్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమానే ఎంచుకుంటారు. అయితే నారా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ మాత్రం పూర్తి విరుద్ధం. బాణం-సోలో – ప్రతినిధి – రౌడీఫెలో – అసుర వీటిని బట్టి చెప్పొచ్చు రోహిత్ ఎంపిక ఎలాంటిదో. మామూలుగా మన హీరోలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో బోర్ కొట్టేసి ఎప్పుడైనా ఓ వైవిధ్యమైన సినిమా చేయాలని చూస్తారు. అయితే నారా రోహిత్ మాత్రం వ‌రుస‌గా డిఫ‌రెంట్ స్టోరీల‌ను ఎంచుకుని సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందుతున్నాడు.

గతంలో ఒక్కడినే అనే చిత్రాన్ని తీసినప్పటికీ అది కాస్త బొర్లాపడింది. అయితే ఈసారి తీసే మాస్ సబ్జెక్టుతో ఖచ్ఛితంగా హిట్ కొడతానంటున్నాడు. తమిళ్ లో హిట్టయిన మాన్ కరాటే చిత్రాన్ని తుంటరిగా తెరకెక్కించాడు గుండెల్లో గోదారి, జోరు దర్శకుడు నాగేంద్ర కుమార్.  సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ స్టోరీ అందించిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ శుక్రవారమే విడుదల కానున్న ఈ చిత్ర ఫలితం ఏంటో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

furious
movie image view

కృష్ణగాడి వీర ప్రేమగాథ

గ‌తేడాది ఎవ‌డే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్ చిత్రాలతో హిట్స్ కొట్టాడు నాని. ముఖ్యంగా భ‌లే భ‌లే మగాడివోయ్ సినిమా ఏకంగా 40 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచేలా ఛేసింది. క్లీన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రం  నాని కెరీర్‌ను ఒక్క‌సారిగా ట‌ర్న్ చేసింది. దీంతో తర్వాత వచ్చే సినిమాపై అందరికీ అంచనాలు పెరిగాయి. ‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడుగా పరిచయమైన హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో  ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో నాని పలకరించనున్నాడు.

సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకొని ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. హీరో నాని బాల‌య్య‌కు అభిమానిగా క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో ఓ సున్నితమైన ప్రేమ‌కథను మేలవించి ఆసక్తిగా తెరకెక్కించాడంట దర్శకుడు హను రాఘవపూడి.

భారీ అంచనాల నడుమ నాని కెరీర్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. మరి బాల‌య్య అభిమానిగా నాని ఎలా మెప్పించాడో తెలియాలంటే రివ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే.

furious
movie image view

సోగ్గాడే చిన్నినాయనా

కొత్త దర్శకులకు అవకాశాలివ్వడంలో ఎప్పుడూ ముందుండే అక్కినేని నాగార్జున.. కళ్యాణ్ కృష్ణ అనే కుర్ర డైరెక్టర్ ను పరిచయం చేస్తూ సొంత బేనర్లో చేసిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. సంక్రాంతి రేసులో చివరగా పండగ రోజు శుక్రవారం విడుదల కానుంది. నాగ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి రేపిన ఈ చిత్రం అంచనాల్ని అందుకుందో లేదో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.

furious
movie image view

డిక్టేటర్

శ్రీవాస్‌ దర్శకత్వంలో నందమూరి బాలయ్య తాజా చిత్రం ‘డిక్టేటర్‌’ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్యం హిట్ తో జోరు మీదున్న శ్రీవాస్ బాలయ్య 99వ చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ పొందాడు. బాలయ్యను ఇంతవరకు ఎవరూ చూపని విధంగా ట్రైలర్ లో స్టైలిష్ గా చూపిన వాస్ ఖచ్ఛితంగా మరో హిట్ కొడతానని చెబుతున్నాడు. కామెడీతోపాటు పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన చిత్ర ఫలితం ఎలా ఉందో తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చేదాకా ఆగాల్సిందే.

furious
movie image view

ఎక్స్ ప్రెస్ రాజా

ప్రత్యేక సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు యువనటుడు శర్వానంద్. మొదటి చిత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టైలిష్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంగా సంక్రాంతి సందర్భంగా ఈ గురువారం ప్రేక్షకుల ముందుక వస్తుంది. మరి దీని ఫలితం ఎలా ఉందో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.