ఇంటర్వ్యూలు

upendra-about-upendra-2-movie-
movie image view

నేను అనే ఫీలింగ్ వదిలేస్తే వచ్చిందే నువ్వు

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర వైవిధ్యానికి చిరునామా. ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం ఉంటుంది. అదే టైంలో సామాజిక అంశాలను కూడా సృశిస్తుంటాడు. ఓం చిత్రం దగ్గర నుంచి సూపర్ దాకా ఆయన చిత్రాలన్నీ సోషల్ మేసేజ్ తో కూడుకున్నవే. అదే సమయంలో ఆయన సినిమాలు విచిత్రంగా ఉంటాయి. ప్రేక్షకులకు నచ్చేందుకు కూడా అదోక కారణం. ఒక్క కన్నడలోనే కాదు తెలుగులోనూ ఆయన అభిమానులను సొంతం చేసుకోగలిగారు. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఉపేంద్ర 2. పదేళ్ల క్రితం ఆయన నటించిన 'ఉపేంద్ర'కు ఇది  సీక్వెల్. ఈ సందర్భంగా ఆయన నీహార్ ఆన్ లైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీకోసం...

 

చాలా గ్యాప్ తర్వాత హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.?

నా అభిమానులకు హ్యపీ, నాక్కూడా హ్యాపీయే. ఆక్చువల్ గా నాకు తెలుగు సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ, నేనేదీ ప్లాన్ చేయను. ఎలా జరిగితే అలా చేసుకుంటూ వెళ్లిపోతాను.

'ఉపేంద్ర 2' ప్ర్యతేకత ఏంటి?

ఉపేంద్ర 'నేను' అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. ఇది మాత్రం 'నువ్వు' అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. తొలి భాగం మొత్తం నాకేది అనిపిస్తే అది చేస్తా. మలి భాగంలో నువ్వు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చేస్తా.

సీక్వెల్ గురించి అప్పుడే అనుకున్నారా?

లేదు. 'నేను' అనే ఫీలింగ్ వదిలేసిన తర్వాత వాడేమవుతాడు? అని 'ఉపేంద్ర'లో నేను చేసిన క్యారెక్టర్ గురించి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అలా వెంటాడుతూ వచ్చింది. అందులోంచి వచ్చినదే ఈ సీక్వెల్.

వాస్తవ జీవితానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందా?

అవును. ఇది అందరి సినిమా, 'నువ్వు' అంటే ప్రతి ఒక్కరూ. అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అనేది చూపించాం.

ఉపేంద్రతో  పోలిక...?

అలా ఏం లేదు. ఆ సినిమా గురించి కనీస అవగాహన లేకపోయినా ఫర్వాలేదు. ఈ చిత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమా దారి ఈ సినిమాది.

'నువ్వు' అంటే ఏంటి?

అంతర్గత స్వేచ్ఛకు సంబంధించిన సినిమా ఇది. ఆ స్వేచ్ఛ గురించి చాలా డీప్ గా డిస్కస్ చేశాం. అది ఆసక్తికరంగా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అవుతంది.

సామాజికపరమైన అంశాలు ఉంటాయా?

లేదు. ఇది ప్యూర్లీ పర్సనల్ గా ఉంటుంది. అంతర్లీనంగా ఓ సందేశం ఉంటుంది.

మీ సినిమాలు మహిళా ప్రేక్షకులు చూడటానికి వెనకాడతారు?

కానీ, చూస్తే ఇష్టపడతారు. ఈ చిత్రం మహిళా ప్రేక్షకులు కూడా చూసే విధంగా ఉంటుంది. వాళ్లకూ నచ్చుతుంది.

ఈ చిత్రానికి ఇన్ స్పిరేషన్ ఏమైనా ఉందా?

లేదు. వేరే సినిమాలు చూసి ఇన్ స్పయిర్ అయ్యి ఈ సినిమా తీయలేదు. థాట్ ప్రాసెస్ లోంచి వచ్చిన పాయింట్ తో తీశాను. అందుకే ఈ సినిమా ఓ కొత్త ప్యాట్రన్ లో ఉంటుంది.

కథ కొత్తగా ఉంటుందా?

నాకు తెలిసి కొత్త కథలు అనేవి ఉండవు. అన్ని కథలు ఆల్ మోస్ట్ అందరికీ తెలిసినవే. కానీ, ఆ కథలు చెప్పే విధానంలో ఒక న్యూ వే ఉంటుంది. ఈ సినిమా ఆ వేలో ఉంటుంది.

డైరక్షన్, యాక్టింగ్ ఈ రెండింటిలో మీకేది సంతృప్తిగా ఉంటుందా?

డైరెక్షన్ లో ఒక ఫుల్ నెస్ ఉంటుంది. ఎందుకంటే, సినిమా మొత్తం నడిపించాలి. కానీ, నటన అంటే జస్ట్ అలా వచ్చి.. ఇలా నటించేసి వెళ్లడం. అంతే. యాక్టింగ్ ఎంజాయబుల్ గా ఉంటుంది. కానీ, ఇక్కడ కష్టం తక్కువ. డైరెక్షన్ కి ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ కష్టపడినప్పుడు ఎంజాయ్ మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా.

నిర్మాత నల్లమలుపు బుజ్జి గురించి...?

నాతో అప్పట్లో 'రా' తీశారు. మా మధ్య మంచి స్నేహం ఉంది. బుజ్జి పెద్ద నిర్మాత అయ్యారు. నేనూ సెటిలయ్యాను. 'ఉపేంద్ర 2'ని చూసి, నచ్చితే తెలుగులో విడుదల చేయమని బుజ్జితో అన్నాను. అప్పుడు తను 'నాకు 'ఉపేంద్ర' అంటే చాలా ఇష్టం. నేను 'ఉపేంద్ర 2'ని విడుదల చేస్తాను' అని కనీసం ఈ సినిమా చూడకుండా తెలుగులో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. బుజ్జి ఈ సినిమా విడుదల చేయడం వల్ల ఇది పెద్ద సినిమా అయ్యింది.

ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లో మీరు తలకిందులుగా ఉన్నారు?

అది పెద్ద టాపిక్ అయ్యింది. మామూలుగా అభిమానులు కటౌట్లకు పాలాభిషేకం చేస్తారు కదా.. ఇప్పుడెలా చేయాలి? అని ఆలోచిస్తున్నారు (నవ్వుతూ).

అలాగే, అఘోరా గెటప్ కూడా కనిపిస్తోంది?

అవును. కథలో భాగంగా ఆ గెటప్ ఉంటుంది. ఈ సినిమాలో నేను ఏ గెటప్ లో కనిపించినా, అది కథానుగుణంగానే ఉంటుంది తప్ప, కథకు సంబంధం లేకుండా ఉండదు.

చివరగా... మీ నుంచి ఎక్కువ తెలుగు సినిమాలు ఆశించవచ్చా?

నేను తెలుగు సినిమాలు చేయడానికి రెడీ. దర్శక, నిర్మాతలు ఆహ్వానిస్తే కాదనను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు కనబరుస్తున్న ప్రేమాభిమానాలను దూరం చేసుకోలేను అంటూ ముగించారు.

Mahesh-babu-interview
movie image view

అవసరమనుకుంటే చొక్కా విప్పుతా...

ఒకప్పుడయితే హీరోలు రిక్షాలు తొక్కుతూనో, మెకానిక్ గా పనిచేస్తూనో... ఓ లారీ డ్రైవరో... ఇలా పేదరికంలోనే తన హీరోయిజాన్ని చూపిస్తూ ఉండే వాళ్ళు ఇప్పుడేమో హీరోలంతా రిచ్ ఫామిలీల నుంచి వచ్చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమా ఏకంగా టైటిలే శ్రీమంతుడు.... ఈ శ్రీమంతుడు ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహేష్ బాబు ఫాన్స్ ఆయన సినిమా కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు. తమ హీరో సినిమాను హిట్ చేయాలని చాలా ఆరాట పడుతున్నారు కూడా.  

ఈ శ్రీమంతుడు విశేషాలను ఇటీవలే 'ఇండియా టుడే’తో మహేష్ బాబు పంచుకుంటూ... శ్రీమంతుడు సినిమా ఇంతకు ముందు సినిమాల్లో లాగా కాకుండా ప్రధానంగా కథా బలం కనిపిస్తుందనీ,  తన పాత్ర కూడా కొత్తగా ఉంటుందని చెప్పారు. సినిమాలో తన రోల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందనీ, చిత్రం ఆడియో కూడా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు. దూకుడు తరువాత సక్సెస్ పాటలంటే ఈ చిత్రంలోనివే అని చెప్పారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మంచి పాటలను ఇచ్చారని చెప్పారు.  సినిమాకు సంబంధం లేని మరికొన్ని ప్రశ్నలకు ఆయన ఇలా స్పందించారు...

ఈ మధ్య కొత్త స్టైల్లో హీరోలు కనిపిస్తున్నారు మరి మీరు?

స్టైల్ విషయంలో గతంలో అయితే కొత్తగా కనిపించాలని ప్రయోగాలు చేస్తుండేవాణ్ణి. కానీ, ఇప్పుడు మాత్రం సింపుల్‌గా ఉండడమే ఇష్టపడుతున్నా. ఇక, అందం, ఆరోగ్యం విషయంలో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొనేందుకు ప్రయత్నిస్తుంటా.

బాడీ మొత్తం కవర్ చేసే ఏకైక హీరో మీరే అనుకుంటా?

చొక్కా విప్పడానికేం అభ్యంతరం లేదు... కానీ స్క్రిప్ట్‌ ను బట్టి దర్శకుడు నా నుంచి కోరుకున్న దాన్ని బట్టి  చేస్తా... నా పాత్రకూ, స్క్రిప్ట్‌ కూ అవసరమని కన్విన్స్ అయితే, బాలీవుడ్‌లో లాగా చొక్కా విప్పేసి నటిస్తా.


సినిమా ఎంచుకోవడంలో ఎవరి సలహా అయినా తీసుకుంటారా?

ఎవరి జోక్యం ఉండదు. సినిమాల ఎంపిక విషయంలో నిర్ణయం పూర్తిగా నాదే. మా నాన్న గారి ప్రమేయం గానీ  నా వైఫ్ జోక్యం కానీ ఏ మాత్రం ఉండదు. నా నిర్ణయాలన్నీ స్క్రిప్ట్‌ ను బట్టే ఉంటాయి. కొన్నిసార్లు అప్పటికప్పుడు ఓ.కె. చెప్పేస్తా. కొన్నిసార్లు కొద్దిగా టైమ్ తీసుకొని నిర్ణయం చెబుతా.

రాజమౌళితో సినిమా చేస్తున్నట్టు వార్తలొచ్చాయి...

'బాహుబలి' రెండో పార్ట్ అయిపోయిన తరువాత నేను, దర్శకుడు రాజమౌళి కలసి ఒక సినిమా చేయనున్నాం. స్క్రిప్టు ఇంకా ఫైనలైజ్ కాలేదు.

మల్టీ స్టారర్ సినిమాలపై మీ అభిప్రాయం?

వెంకటేశ్ గారితో కలసి నేను నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మంచి హిట్. ఆ సినిమా షూటింగ్ టైమ్ బ్రహ్మాండంగా గడిచింది. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాం. సెట్స్ మీదే కాదు... బయట కూడా వెంకటేశ్ గారితో నాకు బ్రహ్మాండమైన స్నేహం ఉంది. అలాంటి మల్టీస్టారర్లు తెలుగులో మరిన్ని రావాలి.

మీమీద కృష్ణగారి ప్రభావం ఎంత వరకుంటుంది?

మా నాన్న గారే నాకు ఆదర్శం. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే చూస్తూ పెరిగా. అందుకే, నా మీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ. నాకు స్ఫూర్తి కూడా ఆయనే. నాన్న గారి నుంచి నేనెంతో నేర్చుకున్నా. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే, ఆయన

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా?

నాకు రాజకీయాల మీద ఏ మాత్రం అవగాహన లేదు. అవి అర్థం కావు కూడా.... కొన్నాళ్ళు మా నాన్న రాజకీయాల్లో పని చేశారు. మా బావ జయదేవ్ గల్లా ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. నేను మాత్రం అందులోకి వచ్చే సమస్యే లేదు.

మీ అభిమానులను నచ్చేలా ఏం శ్రద్ధ తీసుకుంటారు?
మా నాన్న గారి నుంచి అభిమానులూ నాకు వచ్చారు. అది నాకు దక్కిన వరం. కానీ ఇది నా అదృష్టమనాలో దురదృష్టమనాలో? నా ప్రతి సినిమా మీద అభిమానుల అంచనాలు ఎప్పుడూ భారీగా ఉంటాయి. ఇప్పుడు ఈ 'శ్రీమంతుడు' మీద కూడా ఉన్నాయి. ప్రతిసారీ వాళ్ళకు నచ్చేలా ఏదో ఒకటి చేయడానికి కష్టపడుతూనే ఉంటాను.
 

 

 

 

sonal-chauhan-about-dictator-opportunity-interview
movie image view

బాలయ్య బాబు ఓ నైస్ పర్సనాలిటీ

పట్టువదలని విక్రమార్కుని సోదరిలా బాలీవుడ్లో అప్పట్లో అవకాశాల వేట మొదలెట్టింది. అక్కడ ఇమ్రాన్ హష్మి సరసన ఓ సినిమాలో నటించింది. ఆ చిత్రంలో బెడ్రూమ్ సన్నివేశాల్లో ముద్దులవీరుడితో జీవించింది. తెలుగులో 2008లో రెయిన్ బో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అది కాస్త అట్టర్ ప్లాఫ్. తొలిసినిమానే పరాజయం పాలయ్యాక ఇక ఈ అమ్మడికి అవకాశాలిచ్చేదెలా అందుకే టాలీవుడ్ పక్కనబెట్టేసింది. కాని ఇప్పుడు 2015లో బిజీ స్టార్ అయిపోయింది. ఎలాగంటారా? అనూహ్యంగా 'లెజెండ్' కాస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు బోయపాటి కంటికి చిక్కింది. బాలయ్య సరసన సోనాల్ అయితే బావుంటుందని భావించి బోయపాటి వెంటనే ఆఫర్ ఇచ్చాడు. అలా లెజెండ్లో కథానాయిక అయ్యింది. లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ఇక తిరుగు చూసుకునే పనేలేకుండా పోయింది. రామ్ పండగ చేస్కోలో బికినీ లుక్లో అదరగొట్టేసింది. ఇప్పుడు ఏకంగా బాలయ్యతో రెండోసారి జతకట్టబోతోంది. డిక్టేటర్లో నాయికగా నటిస్తోంది. రీ ఎంట్రీలో కెరీర్ గురించి సోనాల్ ముచ్చటిస్తూ..

బాలకృష్ణ లాంటి అగ్రనటుడితో  రెండోసారి అవకాశం దక్కింది... మీరెలా ఫీలవుతున్నారు?

బాలయ్యబాబుతో తొలి అవకాశం రావడం నా అదృష్టం. లెజెండ్ ఘనవిజయం సాధించాక అవకాశాల వెల్లువ మొదలైంది. అయితే వాస్తవానికి నాకు రెండోసారి బాలయ్య సరసన నటించే ఛాన్సొస్తుందని ముందే ఊహించలేదు. కానీ అదృష్టవంతురాలిని. ఇప్పుడు డిక్టేటర్లో  ఆ ఛాన్సొచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నా.

తదుపరి చిత్రంలో మీ రోల్ ఎలా ఉంటుంది?

ఇప్పటివరకూ నేను నటించిన పాత్రలు వేరు. డిక్టేటర్లో నా రోల్ వేరు. శ్రీవాస్ ఈ క్యారెక్టర్లో నటిస్తే అది నా కెరీర్కి కాలింగ్ కార్డ్ అవుతుందని చెప్పాడు. బలమైన ఛాలెంజింగ్ రోల్లో ఛాన్స్ దక్కింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అది.
 

బాలయ్యతో మీ ఎక్స్ పీరియన్స్?


బాలయ్యకు షార్ట్ టెంపర్ కోపం చాలా ఎక్కువ.. అంటూ భయపెట్టేశారు. కానీ ఆన్సెట్స్ ఆయన్ని దగ్గరగా చూశాక ఆ భయమే లేకుండా పోయింది. నేను విన్నది కరెక్టు కాదని తర్వాత అర్థమైంది. సెట్లో స్పాట్బోయ్ నుంచి ప్రతి ఒక్కరినీ ఎంతో కేరింగ్గా చూసుకుంటారు. క్రమశిక్షణతో మెలగుతారు. నా జీవితంలోనే  ఓ నైస్ పర్సనాటిటీని చూశాను.

సీనియర్లతో నటిస్తే అవకాశాలు అంతే అంటారు... అయినా మీకు భయం కలగలేదా?

బాలయ్య అంతటి సీనియర్తో నటిస్తే ఇక కుర్రహీరోలతో ఛాన్సులు రావని బెదిరించారు. కానీ ఆ తర్వాత రామ్ సరసన పండగ చేస్కోలో ఛాన్సొచ్చింది. కళ్యాణ్రామ్తో షేర్లో ఛాన్సొచ్చింది. ఆర్య సరసన సైజ్ జీరోలో అవకాశం వచ్చింది. ఇవన్నీ ఎలా వచ్చినట్టు?

ఈ మధ్య లవ్ వార్తలు వినిపిస్తున్నాయి?

నీల్ నితిన్ తో  ప్రేమాయణం అంటూ పుకార్లొచ్చాయి. కానీ అదేమీ లేదు. నేను ప్రపంచంలో ప్రేమలో పడ్డాను అంటే అది మా మమ్మీతోనే. టైటానిక్ చూశాక లియోనార్డో డికాప్రియోతో ప్రేమలో పడ్డా. అలాగే తెలుగులో నటిస్తున్నా అంటే బాలీవుడ్లో నటించను అని అర్థం కాదు.

 

ప్రస్తుతం ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారు?


ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన 'షేర్'లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆన్సెట్స్ ఉన్నా. ఇది అయిపోయి హైదరాబాద్లో అడుగుపెట్టాక డిక్టేటర్ షూటింగ్లో పాల్గొంటాను. ఆర్య సరసన సైజ్ జీరోలో చేస్తున్నాఅంటూ ముగించింది సోనాల్.

naga-shourya-interview-about-jadoogadu-movie
movie image view

మాస్ ప్ల‌స్ క్లాస్‌ ఎంట‌ర్‌టైన‌రే జాదూగాడు

ఈ నెల 26న జాదూగాడు సినిమాతో తెర‌ముందుకు రాబోతున్నాడు నాగ‌శౌర్య. ఇంత‌కు ముందు ఆయ‌న న‌టించిన ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య‌, ల‌క్ష్మీ రావే మా ఇంటికి డీసెంట్ హిట్స్ అనిపించుకున్నాయి. చింత‌కాయ‌ల ర‌వి ద‌ర్శ‌కుడు యోగేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జాదూగాడు గురించి నాగశౌర్య చెప్పుకొచ్చిన విశేషాలు..
# ఇప్ప‌టిదాకా క్లాస్ సినిమాల్లో చేశారు... జాదూగాడు టైటిల్ వెరైటీగా ఉందే?
- ఇది మాస్ జోన‌ర్ మూవీ. మాస్‌, క్లాస్‌.. అన్ని వ‌ర్గాల‌కూ న‌చ్చుతుంది. ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ సినిమాకు ప్రాణం పోస్తాయి. లౌడ్ సినిమా. ఆడియోకి మంచి స్పంద‌న వ‌స్తోంది.
# ఏడాదికి రెండు మూడు సినిమాల్లో న‌టిస్తున్న‌ట్టున్నారు?
- అవునండీ. ఈ సినిమా స‌క్సెస్ అయితే ఏడాదికి త‌ప్ప‌కుండా రెండు సినిమాల్లో చేస్తాను.
# జాదూగాడులో మీ పాత్ర ఎలా ఉండ‌బోతోంది?
- చాలా బావుంటుంది. నా పాత్ర పేరు కృష్ణ‌. ఐఎస్డీ బ్యాంకులో రిక‌వ‌రీ ఏజెంట్‌గా ప‌నిచేసే పాత్ర‌. రిక‌వ‌రీ ప్రాసెస్‌లో ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.
#క్లాస్ టు మాస్ ట‌ర్న్ కావ‌డానికి స్పెష‌ల్ రీజ‌న్ ఉందా?
- కెరీర్ ప్రారంభంలోనే మాస్ ఎందుక‌ని చాలా మంది అడిగారు. కానీ నాకు ఈ సినిమా క‌థ క‌నెక్ట్ అయింది. జాదూగాడు అంటే మోస‌గాడు అని అర్థం. స్టోరీ కూడా క్లాస్‌, మాస్ తేడా లేకుండా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది.
#మిమ్మ‌ల్ని అంత‌గా ఇంప్రెస్ చేసిన విష‌యాలేంటి?
- ప్రీ క్లైమాక్స్ దాదాపు 40 నిమిషాలు సాగుతుంది. స‌ప్త‌గిరి కామెడీ కూడా హైలైట్ అవుతుంది.
# గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాలో స్పెష‌ల్‌గా ఏమైనా చేశారా?
- డ్యాన్సులు, ఫైట్లు చేశాను. నేను ఫైట్లు చేస్తే చూడ‌రేమో అనే అనుమానం నాలో ఎక్కువ‌గా ఉండేది. అయితే దాన్ని పోగొట్టింది మాత్రం యోగేష్‌గారే. నాతో చాలా బాగా ఫైట్లు చేయించారు.
# చేతిలో ఇంకేం ప్రాజెక్ట్ లున్నాయి?
- నందినిరెడ్డిగారి ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేస్తున్నా. 70 శాతం పూర్త‌యింది. అలాగే ర‌మేష్‌వ‌ర్మ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నా. ఈ సినిమాకు శ్యామ్‌.కె.నాయుడు కెమెరా, ఇళ‌య‌రాజాగారు సంగీతాన్ని అందిస్తున్నారు.

chikati-rajyam-director-rajesh-says-kamal-hassan-boostup-him
movie image view

కమల్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ను మాటల్లో చెప్పలేను

‘దశావతారం’, ‘విశ్వరూపం’, ‘ఉత్తమవిలన్‌’ వంటి అభిరుచి గల చిత్రాలను అందించిన విలక్షణ నటుడు, యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌  హీరోగా రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘చీకటిరాజ్యం’. ప్రకాష్‌రాజ్‌, త్రిష,  కిషోర్‌, సంపత్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. నూతన దర్శకుడు రాజేష్‌ ఎమ్‌.సెల్వ దర్శకత్వంలో ఎన్‌.చంద్రహాసన్‌ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దర్శకుడు రాజేష్‌ ఎమ్‌.సెల్వ తో ఇంటర్వ్యూ...

 

నేపథ్యం....?

- నేను తెలుగు కుర్రాడిని, మా అమ్మమ్మగారిది నెల్లూరు పక్కన చిన్న పల్లెటూరు. అయితే మా అమ్మగారు కాలం నుండి మేం చెన్నైలోనే సెటిల్‌ అయిపోయాం. అందువల్ల తెలుగు అర్థం అవుతుంది కానీ సరిగా మాట్లాడలేను.

సినిమా రంగంలో మీ జర్నీ ఎలా స్టార్టయింది?

-2008లో నేను రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌లో మూడవ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయినయ్యాను. అప్పటి నుండి ఈ జర్నీ ఆయనతో కొనసాగుతుంది. ఇప్పుడు అయన్ను డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు  నా శిక్షణ దశ పూర్తయిందనుకుంటా, కమల్‌గారు నేను డైరెక్ట్‌ చేయడానికి ఓకే అనుకున్నాడో ఏమో ఈ సినిమాకి నన్ను దర్శకుడిగా ఎంచుకున్నారు. ఆయన నుండి ఈ ఏడేళ్లలో ఏమీ నేర్చుకున్నాననే విషయం, నా పై ఆయన ఉంచిన నమ్మకాన్ని ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేసుకుంటాననే నమ్మకం ఉంది.

మీ గురువైన కమల్‌ను డైరెక్ట్‌ చేయడం ఎలా అనిపిస్తుంది?

- ఆ ఫీల్‌ను మాటల్లో చెప్పలేను. రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ పిలిం బ్యానర్‌ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఒక ప్యాషన్‌తో సినిమాలు తీయడం నాకు నచ్చింది. అందుకే ఆ బ్యానర్‌లోనే కొనసాగాను. ఈ సినిమాకి కూడా నేను డైరెక్టర్‌ అవుతానని అనుకోలేదు. కమల్‌హాసన్‌గారు నన్ను పిలిచి డైరెక్షన్‌ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తే నువ్వు డైరెక్ట్‌ చేయ్‌ అన్నారు. నేను చూసిన కమల్‌గారిని డైరెక్టర్‌గా చూశాను. ఇప్పుడు సడెన్‌గా అంతా డిఫరెంట్‌గా ఉంది. ఆయన ఈ సినిమాకి చేస్తున్న సపోర్ట్‌ గురించి మాటల్లో చెబితే తక్కువే అవుతుంది. డైరెక్టర్‌గా నేను ఆయన వద్ద వర్క్‌ చేశాను. ఇప్పుడు నన్ను ఆయన డైరెక్టర్‌ అని సంబోధిస్తుంటే, ఇతరులకు పరిచయం చేస్తున్నారు...ఇదంతా నాకు కలలాగా ఉంది.

 

కమల్‌హాసన్‌ను ఎలా ప్రజెంట్‌ చేస్తున్నారు..?

- ఈ సినిమాలో యాక్షన్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లంగ్‌ మూవెంట్స్‌ అన్నీ ఎలిమెంట్స్‌ కలిసి ఉన్నాయి. కమల్‌గారి ఫ్యాన్స్‌ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను రీచ్‌ అయ్యే సినిమా ఇది. ఈ జోనర్‌లో కమల్‌గారు సినిమా చేసి చాలా కాలమైంది.

 

ఏ లోకేషన్స్ లో షూటింగ్‌ చేస్తున్నారు..?

-  హైదరాబాద్‌లో చాలా లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నాం. టోలీచౌకీలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాం, అలాగే రింగ్‌ రోడ్డులో ఛేజింగ్‌ సీక్వెన్స్‌ చేశాం. ప్రస్తుతం కత్రియాలో షూట్‌ చేస్తున్నాం. ఇక్కడు 70 శాతం పూర్తి చేసిన తర్వాత తమిళ వెర్షన్‌ను షూట్‌ చేయడానికి తమిళనాడుకు వెళతాం.

 

యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎలా ఉండబోతున్నాయి..?

- ఈ సినిమా కోసం ఫ్రాన్స్‌ నుండి వచ్చిన జిల్స్‌, వర్జీనియా, సిల్వ స్పెషల్‌ యాక్షన్‌ టీమ్‌ ఉంది. వారి ఆధ్వర్యంలో ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తున్నాం. రమేష్‌ వారికి సపోర్ట్ గా ఉంటున్నాడు. కమల్‌గారు ఇటువంటి రోల్‌ చేసి చాలా రోజులైంది. ఇందులో సరికొత్త కమల్‌హాసన్‌ను చూస్తారు.

 

త్రిష క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?

- త్రిష చాలా డిఫరెంట్‌ రోల్‌ చేస్తుంది. ఇటువంటి రోల్‌ ఆమె ఎప్పుడూ చేయలేదు.

 

శాను వర్గీస్‌తో పనిచేయడం ఎలా ఉంది?

- నేను గతంలో విశ్వరూపం సినిమాకి తనతో కలిసి పనిచేశాను. అయితే తను బిజీ సినిమాటోగ్రాఫర్‌గా మారిపోయాడు. ఉత్తమవిలన్‌ సినిమాకి కూడా మాకు అందుబాటులో లేడు. ఈ సినిమా విషయానికి వచ్చే సరికి తన కోసం కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సి వచ్చింది.

 

లోకేషన్‌లో కమల్‌ సపోర్ట్‌ ఎలా ఉంది?

- కమల్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన ఫుల్‌ సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఫుల్‌ భరోసా ఉంచారు. ఉదాహరణకి ఆయన స్పాట్‌కి రాగానే నేరుగా వెళ్లి క్యారీ వ్యాన్‌లో కూర్చునేవారు. నాకు తెలిసి ఆయనలా ఎప్పుడూ చేయలేదు. మూడు రోజులు షూట్‌ తర్వాత ఆన్‌ లైన్‌ ఎడిట్‌ చేసుకుని రషెష్‌ను ఆయనకి చూపించాను. ఆయన చూసి కరెక్ట్‌ వే వెళుతున్నావు..గో అ హెడ్‌ అన్నారు. దాంతో నాకు కాన్ఫిడెన్స్‌ పెరిగింది. డైరెక్టర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఆయన అమేజింగ్‌ నటుడు. ఆయన సపోర్ట్‌ మాటల్లో చెప్పలేనిది.

 

ఇందులో కమల్‌ మేకప్‌  మేన్‌గా మారరని అంటున్నారు..?

- నిజం చెప్పాలంటే ఆ విషయంలో నాదే తప్పుంది. ప్రాస్తటిక్‌ మేకప్‌ కోసం ఆర్డర్‌ చేశాం. అయితే మిగతా పాత్రలకు ప్రాస్తటిక్‌ మేకప్‌ కొద్దిగా చేయాల్సి ఉంది. రేపు షూట్‌ ఉందనగా నాకు ఆ విషయం తెలిసింది. మా దగ్గర ఉన్న మేకప్‌ మేన్‌లు ప్రాస్తటిక్‌ మేకప్‌లో అంత ఎఫిషియెంట్‌ కాదు.. వెంటనే కమల్‌హాసన్‌గారి దగ్గరకెళ్లి ఆ విషయం చెప్పాను. ఆయన కూల్‌గా రేపు చూసుకుందాంలే అన్నారు. నిజంగానే సెట్‌కి వచ్చి ప్రకాష్‌రాజ్‌, త్రిషలకు ఆయనే స్వయంగా మేకప్‌ వేశారు. అది ఆయన గొప్పతనం.

 

సినిమా విడుదల ఎప్పుడు ఉంటుంది?

-సినిమా తెలుగు, తమిళంలో రూపొందుతోంది. ప్రస్తుతం తెలుగులో 70శాతం టాకీ పార్ట్ పూర్తయింది. అలాగే తమిళంలో కూడా చిత్రీకరణను పూర్తి చేసి ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం.

 

అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్‌ రాజేష్‌ ఎమ్‌.సెల్వ

 

charmi-says-she-lost-11-kgs-for-jyothilakshmi
movie image view

జ్యోతిల‌క్ష్మీ కోసం 11 కిలోలు త‌గ్గా

ద‌శాబ్దం దాటినా హీరోయిన్‌గా చ‌లామ‌ణి అవుతున్న నేటి త‌రం నాయిక‌ల్లో ఛార్మి ఒక‌రు. ఆమె న‌టిగా ఎంట్రీ ఇచ్చి క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు మాట్లాడ‌టం నేర్చుకుని చంద‌మామ సినిమాలో కాజ‌ల్ కి డ‌బ్బింగ్ కూడా చెప్పింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో ఐట‌మ్ సాంగ్‌ల్లోనూ న‌టించింది. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్ర‌ల్లోనూ న‌టించింది. తాజాగా హీరోయిన్‌గా కొన‌సాగుతూనే... నిర్మాత‌గానూ పాదం మోపింది. ఆమె స‌మ‌ర్పిస్తున్న సినిమా జ్యోతిల‌క్ష్మీ ఈ నెల 12న విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి ఛార్మితో ఇంట‌ర్వ్యూ...

ఎలా ఉండ‌బోతోంది జ్యోతిల‌క్ష్మీ?

- చాలా బావుంటుంది. ఎవ‌రూ ఊహించ‌న‌టువంటి సినిమా.

మీ పాత్ర ఎలా ఉంటుంది?

- ఇందులో వేశ్య‌గా న‌టించాను. అలాగ‌ని వ‌ల్గ‌ర్‌గా క‌నిపించ‌ను. హ్యాపీగా, ఫ‌న్నీగా, నాటీగా ఉండే అమ్మాయి క‌థ‌. రొమాన్స్ ఉంటుంది.

అంటే మీరు రొమాంటిక్ హీరోయిన్ గా క‌నిపిస్తారా?

- రొమాన్స్ ఉంటుంది. అలాగే త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌లపై అమ్మాయి చేసే పోరాటం కూడా ఉంటుంది. రెండిటికీ సంబంధించిన క‌థ ఇది

జ్యోతిలక్ష్మీ ఎలాంటి ఇంపాక్ట్ ని మిగులుస్తుంది?

- జ్యోతిల‌క్ష్మీ అంటే ఇప్ప‌టిదాకా ఏదో ఒక ఒపీనియ‌న్ ఉండ‌వ‌చ్చు. కానీ ఇక‌పై అది వేరేలా ఉంటుంది. ఇలాంటి కూతురు కావాల‌ని ప్ర‌తి మ‌గాడూ కోరుకుంటాడు. ఇలాంటి భార్య కావాల‌ని అనుకునేవారు కూడా ఉంటారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఇక‌పై తెలుగు ఇళ్ల‌ల్లో జ్యోతిల‌క్ష్మీ అనే పేరు వినిపిస్తుంది.

న‌టిగా హ్యాపీనా?  నిర్మాత‌గా హ్యాపీనా?

- నిర్మాత‌నైపోవాల‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో కేజువ‌ల్‌గా అలా కుదిరిందంతే. ఈ సినిమాతో నిర్మాణం గురించి చాలా విష‌యాలు తెలుసుకున్నాను. ప్రీప్రొడ‌క్ష‌న్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, మెయిన్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ తెలిసొచ్చాయి. నిజానికి అది కొంచెం టెన్ష‌న్ జాబ్‌. అయినా ఎంజాయ్ చేశాను. సి.క‌ల్యాణ్‌గారు, పూరి జ‌గ‌న్నాథ్‌గారు నాకు ఫుల్ ఫ్రీడ‌మ్ ఇచ్చారు.

ఇందులో బైక్ రైడ్ చేసిన‌ట్టున్నారు?

- అవునండీ. చిన్న‌ప్ప‌టి నుంచీ నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. మా పేరెంట్స్ మా బ్ర‌ద‌ర్ కి బైక్ కొనిస్తే వాళ్లెవ‌రూ ఇంట్లో లేన‌ప్పుడు నేను ఆ బైక్ ని న‌డిపేదాన్ని. ఈ సినిమాలో బుల్లెట్ న‌డిపే సీన్ ఉంద‌ని పూరిగారు ఫోన్ చేసి చెప్పిన‌ప్పుడు చాలా సంతోషించాను. షూటింగ్ అయిపోయిన త‌ర్వాత కూడా బుల్లెట్ నడుపుతూనే క‌నిపించాను.

ఈ సినిమాలో రెండు వేరియేష‌న్స్ ఉన్న రోల్‌ను చేశార‌ట క‌దా?

- నిజ‌మే. జ్యోతిల‌క్ష్మీ పాత్ర‌కు రెండు షేడ్స్ ఉంటాయి. అందులో పాత్ర కోసం దాదాపు 11 కిలోలు బ‌రువు త‌గ్గాను. తొలి సగంలో వ‌చ్చే పాత్ర‌కు, రెండో స‌గంలో వ‌చ్చే పాత్ర‌కు చాలా తేడా ఉంటుంది.

ఓ నిర్మాత‌గా పూరి జ‌గ‌న్నాథ్ ఎలాంటి ద‌ర్శ‌కుడు అనిపించింది?

- త‌ను యూనిక్ డైర‌క్ట‌ర్‌. స్క్రిప్ట్ కి సంబంధించిన ఏ ప‌నినీ షూటింగ్ మొద‌లుపెట్టాక పెట్టుకోరు. స్క్రిప్ట్ పూర్త‌యితేనే సెట్స్ లోకి వెళ్తారు. ఒక సినిమా చేస్తున్న‌ప్పుడే మ‌రో సినిమా గురించి ఆలోచిస్తారు. అంత యూనిక్ ప‌ర్స‌నాలిటీ ఆయ‌న‌ది.

సీక్వెల్ చేస్తార‌ని వార్త‌లొస్తున్నాయి..

- నిజ‌మే. చేయాల‌నుకుంటున్నాం. కాక‌పోతే ఎప్పుడ‌నేది పూరిగారి తీరిక‌ని బ‌ట్టి ఉంటుంది. స్క్రిప్ట్ సిద్ధంగానే ఉంది. క‌ల్యాణ్‌గారు కూడా ఓకే చెప్పేశారు.

మీ త‌దుప‌రి సినిమాలేంటి?

- ప్ర‌స్తుతం దృష్టి మొత్తం జ్యోతిల‌క్ష్మీ మీద‌నే ఉంది.