టీజర్/ట్రైలర్ రివ్యూ

furious
movie image view

నేను... శైలజా

రొటీన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బ తినేసిన రామ్ ఇప్పుడు ఈ కొత్త సినిమాతో వస్తున్నాడు. అయితే ఈసారి తన పందాను మార్చేసి.. కాస్త కొత్తరకం సినిమాతోనే వస్తున్నా అని చెప్పాడులే. ఈవాళ రిలీజ్ అయిన టీజర్ ఎలా ఉందో ఓమారు చూద్దామా మరి..

నిజానికి రామ్ తన లుక్ వైజ్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా కూడా.. సినిమా కథ వైజ్ దర్శకుడు కిషోర్ తిరుమల కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడని టీజర్ చూస్తే చెప్పొచ్చు. అప్పటికే ఓ నలుగురైదుగురు అమ్మాయిలు హరి అనే మన హీరోను రిజక్ట్ చేస్తారు. అందుకే మనోడు ఏ అమ్మాయి నచ్చినా ఇక మీదట ప్రేమించకూడదని ఫిక్సయిపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు.. హీరోయిన్ శైలజ.. అదేనండీ కీర్తి సురేష్.. స్వయంగా హరిగాడి దగ్గరకొచ్చి ఐ లవ్ యు అనేసింది. కాని నిన్ను లవ్ చేయట్లేదు అనేసింది. ఈ కన్ఫ్యూజన్ లో నే టీజర్ ఎండ్ చేశారు. చూసినంతవరకు బాగానే ఉంది.

కొత్త పంథాలో వెళ్ళి రామ్ ఒక కొత్త తరహా హిట్టు కొడతాడేమో చూడాలి. జనవరి 1న నేను..శైలజ రిలీజ్ కానుంది.

furious
movie image view

భలేమంచి రోజు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండదండలతో వచ్చిన హీరో సుధీర్ బాబు. ప్రేమకథా చిత్రమ్ హిట్ అయినప్పటికీ అది దర్శకుడి అకౌంట్లోకి వెళ్లిపోవటంతో అతనికి పెద్దగా లాభం చేకూరలేకపోయింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వరుస చిత్రాలు తీస్తున్నాడు. అవి వచ్చినట్లే వచ్చి బొక్కా బోర్లాపడుతున్నాయి. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు ఇవే కోవలోకి వస్తాయి. ఇక తాజాగా శ్రీరాం ఆదిత్య డైరెక్షన్‌లో రానున్న ‘భలే మంచిరోజు’ సినిమాని 70 ఎంఎం బ్యానర్‌పై విజయ్‌, శశి నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ఆడియో ఇటీవల మహేష్, రానాల చేతుల మీదుగా జరిగింది. అక్కడే ట్రైలర్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ విషయానికొస్తే... సుధీర్‌‌బాబు సరసన వామిక అనే కొత్తమ్మాయి హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ ఫిల్మ్ స్టోరీ అంతా ఒక్క రోజులో జరిగేదని, ఆసక్తికరమైన సన్నివేశాలతో వినోద భరితంగా వుండబోతుందని టాక్. ఇక సాయికుమార్ ఓల్డ్ స్టయిల్‌లో కనిపించాడు. కన్ఫ్యూజన్ లో హీరోయిన్ కిడ్నాప్ చేయటం వల్ల హీరో ఎదుర్కొనే సమస్యలు ఏంటో ఫన్నీగా చూపాడు దర్శకుడు శ్రీరాం. ముఖ్యంగా సాయి కుమార్ డైలాగులు, మేనరిజం నవ్విస్తాయి.

విజువల్ గా కూడా ట్రైలర్ బావుండటంతో చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పొచ్చు. చూద్దాం సుధీర్ కి లక్ కలిసొచ్చి భలే మంచి హిట్ అందుకుంటాడో లేదో.   

furious
movie image view

లోఫర్

ఫూరీ చేసే సినిమాలన్నింటినీ ఫాస్ట్ ఫుడ్ లా ఫటాఫట్ కానిచ్చేస్తాడు. మొన్నామధ్యే షూటింగ్ ప్రారంభమైన వరుణ్ తేజ్ చిత్రాన్ని అదే స్పీడ్ తో కానిచ్చేశాడు. టైటిళ్ల విషయంలో కాస్త కన్ఫూజ్ క్రియేట్ చేసినప్పటికీ ఎట్టకేలకు లోఫర్ పేరును ఫిక్స్ చేసేశాడు. ముందుగా  ఫస్టులుక్ ని రిలీజ్ చేయగా దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక అదే ఊపులో ట్రైలర్ ను కూడా వదిలాడు. ఫస్టులుక్ పోస్టర్స్ లో మదర్ సెంటిమెంట్ .. లవ్ .. యాక్షన్ అంశాలను ఎంచుకున్న పూరీ, ట్రైలర్ విషయంలోనూ అంతే జాగ్రత్త తీసుకున్నాడు.

ఎలాంటి పరిస్థితుల్లో కథానాయకుడు పుట్టి పెరిగాడు .. అతనిపై తండ్రి ప్రభావం ఎలా పడిందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా స్పష్టం చేశాడు. ''నేను పుట్టిందే నొక్కేయడానికి .. మధ్యలో ఆపేస్తే తొక్కేస్తా'' అంటూ కథానాయకుడు చెప్పే డైలాగ్ .. పూరీ మార్క్ ను గుర్తుచేస్తుంది. కథానాయికను హీరో ఆటపట్టించడం .. హీరో గొడవలకి దిగడం .. అతని మాట తీరు యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. మదర్ సెంటిమెంట్ మోతాదుకు మించినట్లు అనిపిస్తోంది. జాండీస్ కొడుకు చనిపోయాడని అబద్ధం చెప్పి పిల్లాడిని తండ్రి (పోసాని)లోఫర్ గా తయారుచేయటం, ఆ తర్వాత తల్లి కోసం కొడుకు పడే ఆరాటం, బిడ్డపై తల్లి చూపే మమకారం వెరసి సెంటిమెంట్ సిమెంట్ ను గట్టిగా దట్టించాడు పూరీ.  మొత్తం మీద సినిమాలోని భారీతనాన్ని ఈ ట్రైలర్ ద్వారా ఆవిష్కరించడంలో పూరీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.

furious
movie image view

త్రిపుర

త్రిపుర ట్రైలర్ ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో తెగ హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ లుక్ తో కలర్స్ స్వాతి అదరగొట్టేసింది. యాక్షన్ వావ్ అనిపించేలా ఉంది. అంతేకాదు పనిలో పనిగా భయపెట్టేస్తోంది.ప్రస్తుతం హర్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఇదే కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం కూడా ఇదని తెలుస్తోంది. తమిళ  ఈ చిత్రం టైటిల్ 'తిరుపుర సుందరి'గా విడుదల కాబోతుంది.

 'స్వామి రారా', 'కార్తికేయ' వంటి విజయాల తర్వాత స్వాతి నటించిన చిత్రం కావడం 'గీతాంజలి' వంటి సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ మూవీ తర్వాత రాజ కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవైపు హారర్‌తో, నవ్వులు కూడా పుష్కలంగా ఉన్నాయని అర్థమౌతోంది. ముఖ్యంగా సప్తగిరి చేసిన కామెడీ హైలైట్‌గా ఉంది. పిల్లలు, పెద్దలు చూసే విధంగా ఉండే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా త్రిపుర రూపొందింది. నవంబర్ 6న చిత్రం విడుదలయ్యేందుకు సన్నాహాలు పూర్తి చేసింది చిత్ర బృందం. చూద్దాం మరి త్రిపురగా స్వాతి ఎలా ఆకట్టుకుంటుందో.

furious
movie image view

శంకరాభరణం

యంగ్ హీరో నిఖిల్ స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’.. లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత  నటించిన మరో సరికొత్త కథాంశంతో నడిచే సినిమా శంకరాభరణం. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, మాటలు అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తూ చేసిన సినిమా కావడంతో శంకరాభరణం సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ కనిపించింది. బాలీవుడ్ సినిమా పస్‌గయారే ఒబామా మూలకథతో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను అక్టోబర్ 30న పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

ఇప్పటికే టీజర్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందనే విషయాన్ని రుచి చూపించిన ‘శంకరాభరణం’ టీమ్, ట్రైలర్‌తో మరింతగా ఆకట్టుకుంటోంది. ‘బీహార్‌లో ఐదే ఐదు విషయాలు ఫేమస్’ అంటూ ఆసక్తికరంగా మొదలయ్యే ఈ ట్రైలర్ సినిమాలో ఏమేం ఉండనున్నాయనే విషయాన్ని స్పష్టంగా చూపించాయి. నిఖిల్ ఈ సినిమాలో ఓ ఎన్నారైగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఒక ఎన్నారై బీహార్ ప్రాంతంలో చిక్కుకుపోవడమనే అంశం చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందనే విషయాన్ని ట్రైలర్ తెలియజేస్తుంది. నిఖిల్ సరసన క్యూట్ గర్ల్ నందిత హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ అంజలి బందిపోటు దొంగగా కీలక పాత్రలో నటించనుంది.

ఇక ఈ ట్రైలర్‌లో హై క్లాస్ విజువల్స్, డైలాగ్స్, కామెడీ తదితర అంశాలు మేజర్ హైలైట్‌గా కనిపిస్తున్నాయి. అంజలి స్పెషల్ రోల్ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందన్న విషయం ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్‌తో సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి.

furious
movie image view

సైజ్ జీరో

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పుకోదగింది ఒక్క అనుష్క గురించే. అరుంధతితో తెలుగు సినిమాకు తిరిగి లేడీ ఓరియెంటల్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రావచ్చుననే ధైర్యాన్ని ఇచ్చింది. సినిమా సినిమాకి వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకెళ్తున్న ఈ నటి ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ లో సైజ్ జీరో తో మన ముందుకు రాబోతుంది. ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాశ్ రాజ్, ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆడియో నవంబర్ 1 న విడుదలైంది. ఇక ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం.

ట్రైలర్ విషయానికొస్తే... అనుష్క భారీ లుక్ తో కనపడనుంది. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. ఎప్పుడూ తిండి తింటూ లావుగా ఉండే స్వీటి(అనుష్కకి) కి వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెళ్లి చూపులు చూసి వెళ్లిపోతారు. దీంతో తల్లి(ఊర్వశి) కి దిగులుపట్టుకుంటుంది. అలాంటి స్వీటి అభి(ఆర్య)ను మొదటి చూపులోనే ప్రేమిస్తుంది. కానీ, అభి పక్కా డైట్ మనిషి. తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. దీంతో స్వీటిని లైట్ తీస్కుని మరో యువతి(సోనాల్ చౌహాన్) వెంట పడతాడు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని సైజ్ జీరో సత్యానంద్(ప్రకాశ్ రాజ్) జిమ్ లో చేరుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నదే కథగా ట్రైలర్ లో తోస్తుంది. ఇక చివర్లో లావుంటే పెళ్లి చేసుకోవద్దా అనే అనుష్క ఎమోషన్ డైలాగుతో ట్రైలర్ ముగుస్తుంది. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం మరి ఏ మేర ఆకట్టుకుంటుదో తెలీయాలంటే ఈ చిత్ర కథాంశం ప్రకారం. టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాత పీవీపీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.