టీజర్/ట్రైలర్ రివ్యూ

furious
movie image view

లయన్

‘లెజెండ్’ వంటి బాక్సాఫీస్ హిట్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నూతన దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో ఎస్.ఎల్.వి.సినిమా బ్యానర్ పై రుద్రపాటి రమణారావు నిర్మిస్తోన్న చిత్రం లయన్. ఏప్రిల్ 9న ఈ సినిమా ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చక్కర్లు కొడుతుంది. మణిశర్మ అందించిన ఆడియో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. మరి థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉంటుంది, బాలకృష్ణ ఎలాంటి డైలాగ్స్ చెపుతాడోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ ట్రైలర్ రివ్వ్యూ చూద్దాం...

‘ఒకడొచ్చి నేను పులి అంటే కిందా, పైనా మూసుకుని కూర్చొవాలి..అనే డైలాగ్ తో పాటు బాలయ్య స్టయిలిష్ లుక్ తో టీజర్ స్టార్టవుతుంది’…

‘నేను చెయ్యి చాచినప్పుడే షేక్ హ్యాండ్ ఇవ్వు చనువిచ్చాను కదా అని చంకెక్కితే చుట్టాలు చుట్టానికి కూడా స్కెలిటెన్ మిగలదు’..

‘తన మరణ శాసనాన్ని తనే రాసుకున్న కృష్ణుడురా వాడు.. వాడ్ని ప్రాణాలతో తీసుకురండి’...

‘గాడ్సే అయినా వైలెంటే.. బోస్ అయిన వైలెంటే’..

‘ఆటను వేటగా మార్చడానికి నాకు అరసెకను చాలు..దాని అవుట్ పుట్ ఇలానే ఉంటుంది’..

‘ఈ లయన్ ముందు ఎవడైనా గీత దాటితే తలరాత ఆగిపోద్ది..తలకాయ పేలి పొద్ది’

వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో నందమూరి అభిమానులకు కావాల్సిన స్టయిల్ డైలాగ్స్ ను తేనీటి విందులా బాలయ్య రుచి చూపించాడు..

సినిమాలో డైలాగ్స్ రేంజ్, పవర్ చాలానే ఉంటాయని చెప్పకనే చెప్పాడు.

 సినిమాలో బాలకృష్ణ సిబిఐ గెటప్, రగ్ డ్ లుక్ తో కనపించే బోస్ గెటప్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ యాక్షన్ తో నిండి ఉంది. త్రిష, రాధికా అప్టే గ్లామరస్ గా కనిపించారు. మణిశర్మ బ్యాగ్రౌండ్ బావుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ట్రైలర్ లో హింస కూడా ఎక్కువగానే కనపడుతుంది. ప్రదీప్ రావత్ విలన్ గా తెరపై కనపడేలా ఉన్నాడు. మరి బాలయ్య ఫుల్ రోర్ వినాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే...

furious
movie image view

అఖిల్

అక్కినేని తరం నుండి మూడో తరం వారసుడిగా ఎందరో నాయకులు వెండితెరకు పరిచయమైన అఖిల్ ఎంట్రీకి ప్రత్యేకత సంతరించుకుంది. ‘సిసింద్రీ’ చిత్రంతో చిన్నప్పుడే వెండితెరకు పరిచయమైన ఈ చిచ్చరపిడుగు హీరోగా పరిచయమవుతున్న చిత్రంపై ఎన్ని అంచనాలుంటాయో అంచనా వేయవచ్చు.  ఆ అంచనాలను అందుకునేలా ఉండాలని అఖిల్ కూడా తాప్రత్రయపడ్డాడు. అందుకే గ్యాప్ తీసుకుని వినాయక్ వంటి దర్శకుడి డైరెక్షన్ లో అనూప్, థమన్, అమోల్ వంటి స్టార్స్ టీమ్ తో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అల్రెడి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకి సంబంధించిన మేకింగ్ వీడియో ఈ రోజు అఖిల్ పుట్టినరోజు సందర్బంగా విడుదలైంది. అభిమానులు, ప్రేక్షకులు అంచనాలను అందుకునే విధంగా ఈ టీజర్ ఉండటంతో ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.