టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా టాలీవుడ్ ఆడియెన్స్ ఎదరుచూస్తున్న సినిమా బాహుబలి. కేవలం తెలుగు సినిమా రంగమే కాదు. ఇండియన్ సినిమా కూడా బాహుబలి కోసం ఎదురుచూస్తుంది. నిజానికి నిన్న అంటే మే 31న విడుదల కావాల్సిన ఆడియో విడుదల వాయిదా పడింది. అయితే థియేట్రికల్ ట్రైలర్‌ను రాజమౌళి అండ్ టీమ్ ఈరోజున విడుదల చేశారు. ఈరోజు ఉదయం నుండి మల్టీప్లెక్స్‌లతో పాటు కొన్ని థియేటర్స్ లో కూడా ఈ సినిమా ట్రైలర్ విడుదలై హంగామా చేసింది. మరి ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే...
ఆర్కామీడియా బ్యానర్‌పై కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవిని ఈ చిత్రాన్ని నిర్మించగా, రాజమౌళి సినిమాని తెరకెక్కించాడు. టీజర్ కోట, కొండ ప్రాంతాల విజువల్స్ తో స్టార్టవుతుంది. ఒకావిడ చిన్న అబ్బాయికి పైకెళితే దెయ్యలు, భూతాలుంటాయి. అవి మనుషులను పీక్కు తినేస్తాయి అని చెబుతుంది. అయితే ఆ పిల్లవాడు ఆ కొండను ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ నుండి గ్రాండ్ విజువల్స్‌తో ట్రైలర్ సాగుతుంది. నేనెప్పుడూ చూడని కళ్లు నన్ను దేవుడిలా చూస్తున్నాయి. నేనెవర్ని...
మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు..
జై మాహిష్మతి...
ఈ డైలాగ్స్ మాత్రమే మనకు వినపడతాయి. మిగతా ట్రైలర్ అంతా విజువల్ గ్రాండియర్‌తో నిండిపోయింది.
ట్రైలర్‌లో సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, అలాగే కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్‌ట్రార్డినరీ. సినిమా ట్రైలర్ రెండు నిమిషాల ఐదు సెకన్లు. ఎక్కువ భాగం యుద్ధ సన్నివేశాలతో నిండిపోయి ఉంది. రానా లుక్, సత్యరాజ్, అనుష్క, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ ప్రతి ఒక్కరి లుక్ ఆకట్టుకునేలా ఉంది. డాల్బీ అట్మాస్‌లో ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకుడు ఉత్కంఠతకు లోనుకావడం ఖాయం.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న మరో మూవీ ఎటాక్. సి.కళ్యాణ్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. వర్మ ఈ సినిమాని ఫ్యాక్షనా లేక రౌడీయిజం కాన్సెప్ట్ తో తెరకెక్కించాడా అని ఇప్పుడు చెప్పలేం కానీ ట్రైలర్ చూస్తుంటే వర్మ గత చిత్రాలైన గాయం, రక్తచరిత్ర స్టయిల్ లో కనపడుతుంది. మరి ట్రైలర్ ఎలా ఉందో ఓ సారి సమీక్షిస్తే...
చెడ్డవాడిని మంచితనంతో వదిలేయడం మహాపాపం – మహాభారతం ఈ లైన్ తో వర్మ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్టవుతుంది. ధర్మరాజు జూదంలో ఓడాడు కాబట్టి జూదం చెడు కాదు..దుర్యోదనుడు గెలిచాడు కాబట్టి చెడు..
పాండవులు గెలిచారు కాబట్టి యుద్ధం మంచి కాదు..కౌరవులు ఓడారు కాబట్టి మంచిది...
మంచి, చెడు అనేది నిజాలు కావు..నమ్మకాలు. ఆ నమ్మకాలు కాపాడుకోవడానికే మనుషులు ఒకళ్ల మీద ఒకరు ఎటాక్ చేసుకుంటూ ఉంటారు.
ఒక మంచి మనిషి ఎవరి మీదైనా ఎటాక్ చేసేది చట్టం మంచి వాళ్లపై జరిగే ఎటాక్ లను ఆపలేకపోయినప్పుడే..
అలా చెడ్డ మూలాన నేలజారిన మంచిని, మంచితో కలిసిన చెడ్డతనంలో ఎటాక్ చేసి తిరిగి నిలబడేలా చేసిన వ్యక్తి కథే ఎటాక్..
ఇది ట్రైలర్ సింపుల్ సినిమా గురించి వర్మ చెప్పిన సారాంశం. మరి ఇందులో మంచి వ్యక్తులెవరో, చెడువ్యక్తులెవరో, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, మనోజ్, వడ్డే నవీన్ ల రోల్స ఏంటో క్లియర్ గా చూపించలేదు. అయితే ప్రకాష్ రాజ్, జగపతి బాబు, మనోజ్ లు ఓ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులుగా చూపించారు.
ట్రైలర్ లో హింసపాళ్లు ఎక్కువగా కనపడుతుంది. రక్తపు చుక్కలే అక్షింతలై జరుగుతున్న పెళ్లి..అనే బ్యాగ్రౌండ్ సాంగ్ కూడా ఇందులో మనకు వినపడుతుంది. అలాగే చివర్లో మనోజ్ నమ్మకం వచ్చేదే వ్యక్తుల నుండి..అని చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తం మీద వర్మ మరోసారి గాయం తరహా సినిమాని తనదైన స్టయిల్ లో తెరకెక్కించాడని తెలుస్తుంది.
నా పేరు హర్ష..నా దగ్గర లేనిది లేందంటుంటారు. కానీ నాక్కావాల్సింది ఇంకేదో ఉంది. దాని కోసం ఎంత దూరమైనా వెళ్లాలనిపిస్తుంది...
ఊరిని దత్తత తీసుకోవడమంటే జేబులు తీసి రంగులు, రోడ్లు వేసి వెళ్లిపోతాననుకున్నార్రా...వీడ్ని, వాడ్ని, వీళ్లందర్నీ, నిన్ను కూడా దత్తత తీసుకున్నాను. ..
ఇది మహేష్ బాబు తన టీజర్ లో పలికిన డైలాగ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్నసినిమా ‘శ్రీమంతుడు’. ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ లు నిర్మాతలు.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమా టీజర్ విడుదలైంది. టైటిల్ సరిపోయే విధంగా మహేష్ ఇందులో శ్రీమంతుడుగా కనిపిస్తున్నాడు. పెద్ద బిజినెస్ మేన్ అయిన మహేష్ ఏం కావాలనుకుంటున్నాడు. ఎందుకు అనే విషయాలను దర్శకుడు శివ మనకు ప్రశ్నగానే వదిలేశాడు. అదెంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మది సినిమాటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ సంగీతం చాలా బాగా ఉన్నాయి. మహేష్ లుక్స్ ఎక్స్ ట్రార్డినరీ. స్టయిలిష్ గా కనపడుతూనే, యాక్షన్ సన్నివేశాల్లో టోన్డ్ బాడీతో ఆదరగొడుతున్నాడు. ఈ టీజర్ కి ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది.
దిల్ రాజు నిర్మాతగా సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్విని సహా నూతన నటీనటులతో చేసిన సినిమా ‘కేరింత’. సాధారణంగా చిన్న సినిమాలను చేసి పెద్ద సక్సెస్ లను కొట్టే దిల్ రాజు మధ్యలో చిన్న సినిమాలను నిర్మించడం మానుకున్నాడనే చెప్పాలి. అయితే గ్యాప్ తీసుకుని దిల్ రాజు చేసిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీయే కేరింత. సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిక్కి మ్యూజిక్ అందించిన ఆడియో విడుదలైంది. మరి టీజర్ రివ్యూ చూద్దాం. టీజర్ లోకి వెళితే..శ్రీకాకుళం నుండి వచ్చిన నూకరాజు అనే క్యారెక్టర్ తో టీజర్ స్టార్టవుతుంది. సిద్, భావన, జై, దియాతో సహా తనను తాను పరిచయం చేసుకోవడంతో టీజర్ మొదలవుతుంది. ఒక్కొక్కరు వారి ప్రేమను ఎలా గెలుచుకున్నారు? అనే విషయమే కాకుండా ఫ్రెండ్ షిప్ లో చిన్న గొడవలున్నాయంటూ కూడా ఎమోషనల్ పార్ట్ ను చూపించారు. ఎలా కలిశామో గుర్తుకు వస్తే హ్యాపీగా అనిపించాలి కానీ ఎందుకు కలిశామని అనిపిస్తుంది రా అనే డైలాగ్స్ తో అబ్బూరి రవి పెన్ స్టయిల్ తెలుస్తుంది. ఫైవ్ మినిట్స్ ఫేస్ బుక్ లో ఛాట్..గుంట ప్లాట్ అని చివర్లో కూడా నూకరాజు డైలాగ్ తోనే టీజర్ ఎండ్ అవుతుంది. ఈ టీజర్ మొత్తం మీద నూకరాజు క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. టీజర్ చాలా కేర్ ఫుల్ గా కనపడుతుంది. మిక్కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా క్లాస్ గా ఉంది.
విలక్షణ నటుడు సూర్య, విభిన్న కథలతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు వెంకట్ ప్రభు. మరి వీరద్దరి కలయికలో సినిమా అంటే కచ్ఛితంగా ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయి. హర్రర్ థ్రిల్లర్ అండ్ కామెడీ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య దెయ్యం గెటప్ లో కూడా అలరించనున్నాడని ట్రైలర్ లో అర్థం అవుతుంది. అయితే అది కేవలం ఒక పాట కోసమా లేక చిత్రం మొత్తమా అన్నది సస్పెన్సే. ఇందులో నాయికలుగా నయనతార, ప్రణీత లు నటిస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు సోదరుడు ప్రేమ్ జీ మరోసారి కామెడీ తో ఇరగదీసేందుకు సిద్ధమైపోతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ అతను సూర్యకి స్నేహితుడి పాత్రలో అలరిస్తాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందో మే 29 దాకా ఆగాల్సిందే.
తన సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న మరో సినిమా ‘జ్యోతిలక్ష్మీ’. ఛార్మి టైటిల్ రోల్ పోషిస్తుంది. ఛార్మి సమర్పణలో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకాలపై ఈ సినిమా సంయుక్తంగా రూపొందుతోంది. శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు నిర్మాతలు. పూరి ఉమెన్ ఓరియెంటెడ్ మూవీగా జ్యోతిలక్ష్మీ సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేయగానే హీరోయిజాన్ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే పూరి హీరోయినిజాన్ని ఎలా ఎలివేట్ చేస్తాడోనని అందరూ అనుకుంటుండగా యాజ్ యూజువల్ గా పూరి తన స్టయిల్ లో మూవీని త్వరగా కంప్లీట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేశాడు. మల్లాది నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఓ వేశ్య కథ అనిపిస్తుంది. ఇందులో హీరో, జ్యోతిలక్ష్మీ అనే క్యారెక్టర్ ను ఇష్టపడటం, విలన్స్ వెంబడించడం వంటివి ట్రైలర్ లో కనపడుతున్నాయి. బ్రహ్మానందం, సంపూ క్యారెక్టర్స్ కామెడి పండించాలని ప్రయత్నంలో భాగంగా ఉన్నట్టు తెలుస్తుంది. చివర్లో ఛార్మి చాలా ఎమోషనల్ గా కనపడుతుంది. రివేంజ్ తీర్చుకునే స్టయిల్ లో తన క్యారెక్టర్ ను డిజైన్ చేశారనిపిస్తుంది. ట్రైలర్ చివర్లో ఛార్మి బుల్లెట్ డ్రైవ్ చేసే సీన్ బావుంది. అలాగే మీరు అడదాన్ని అర్థం చేసుకోనవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే అని పూరి స్టయిల్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి.