టీజర్/ట్రైలర్ రివ్యూ

furious
movie image view

బెంగాల్ టైగర్

మాస్ రాజా మళ్లీ ఎనర్జిటిక్ ఫర్ ఫార్మెన్స్ చూపేందుకు సిద్ధమైపోతున్నాడు. బెంగాల్ టైగర్ ట్రైలర్ తో మనముందుకు వచ్చాడు.  ఫేమస్ కావడం కోసం ఏదైనా చేసే.. ఎవర్నీ లెక్కచేయని పాత్రలో నటిస్తున్నాడిందులో మాస్ రాజా. నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా అని షాయాజి షిండే అడుగుతుంటే.. ‘కిక్కు కోసం నువ్వు ఏమైనా చేస్తావా’ అన్న డైలాగ్ కొడుతోంది. ఇక కమెడియన్లతో కలిసి రవితేజ చేస్తున్న అల్లరి చూస్తుంటే ‘దరువు’ సినిమా కొడుతోంది. అక్కడక్కడా ‘డాన్ శీను’ ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. పృథ్వీ - బ్రహ్మి - పోసాని పాత్రలతో బాగానే వినోదం పండించే ప్రయత్నం చేశాడు సంపత్ నంది.

ట్రైలర్ మధ్యలో రవితేజ ‘‘నేను సపోర్ట్ తో పైకొచ్చినవాణ్ని కాదు..  సోలోగా పైకొచ్చిన వాణ్ని’’ అంటూ తన గురించి తానే ఓ డైలాగ్ వేసుకోవడం విశేషం. తమన్నా - రాశి ఖన్నా గ్లామర్ డోస్ బాగానే ఇచ్చినట్లున్నారు. ముఖ్యంగా తమ్మూ పిచ్చ హాట్ గా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. కందిరీగ సినిమా తరహాలో అక్ష కూడా ఓ పాత్ర చేసినట్లుగా కనిపిస్తోంది. ‘‘వాడు టైగర్ బెంగాల్ టైగర్.. అది జాతీయ జంతువు వీడు జాతి జంతువు’’.. ‘‘నన్ను చంపే కత్తి కానీ గన్ను కానీ తయారవ్వలేదు మేక్ యాన్ ఆర్డర్’’.. ఇలాంటి పవర్ ఫుల్ డైలాగులతో ట్రైలర్ ముగించారు. దీపావళి కానుకగా నవంబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

furious
movie image view

షేర్

సింహం అస్తమానం వేటాడదు. కానీ వేటకి దిగిందంటే మాత్రం ఇక తిరుగుండదు. ఇక్కడ కూడా ఓ కుర్రాడు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం సింహంలా విజృంభించాడు. ఇది డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కొత్త చిత్రం షేర్ స్టోరీ లైన్.  సోనాల్‌చౌహాన్‌ కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తున్న చిత్రం ఆడియో ఈ మధ్యే విడుదలైంది . గతంలో కళ్యాణ్ రామ్ తో అభిమన్యు, కత్తి వంటి చిత్రాలు తీసిన మల్లికార్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రంలో బ్రహ్మానందం,  ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందించారు. ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉంది. ఈ ట్రైలర్ లో ఎక్కువగా పృథ్వీరాజు ను వాడుకున్నారు. డైలాగుల వరకు వచ్చేసరికి వాయిస్ ఉందిగా అని వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయ్ అనే కళ్యాణ్ రామ్ పంచ్ డైలాగ్.. పోలవరం ప్రాజెక్ట్ వీడి పెళ్ళి జరిగినట్టే ఉంటాయ్ కానీ జరగవ్ చిరాగ్గా అని పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయ్. మొత్తానికి పక్కా యాక్షన్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లు అర్థమౌతుంది.

furious
movie image view

చీకటి రాజ్యం

లోకనాయకుడు కమల్ హాసన్ ఏదీ చేసినా వైవిధ్యమే. పాత్ర పాత్రకు పొంతన లేకుండా సినిమాలు చేసుకుంటూ పోవటం ఆయన నైజం. తాజాగా రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై శిష్యుడు రాజేష్ ఎం. సెల్వని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎన్.చంద్రహాసన్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం తుంగవనం దీనిని తెలుగులో చీకటి రాజ్యం పేరుతో తీశారు. త్రిష హీరోయిన్,  విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, కిషోర్, మధుశాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికొస్తే... హీరో హీరోయిన్లు ఇద్దరు పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే విషయం అర్థమౌతోంది. ఒక్క రాత్రిలో జరిగే చిత్ర కథాంశం ఓ బాలుడి కిడ్నాప్ చుట్టూ అల్లుకున్న కథే చీకటి రాజ్యం. ఈ సినిమాను 40 రోజుల్లో పూర్తిచెయ్యటం, అందులో 80 శాతం చిత్రాన్ని హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుకోవటం విశేషం. ప్రకాశ్ రాజ్ ఇందులో మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు ట్రైలర్ ను చూస్తే తెలిసిపోతుంది. నాలుగు విభిన్నమైన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. గిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం రాకింగ్ గా ఉంది. సాను జాన్ వర్గుసే ఫొటోగ్రఫి విజువల్  ఇంగ్లీష్ సినిమాల స్థాయిలో ఉండటం విశేషం. ఇక తెలుగులో అబ్బూరి రవి డైలాగ్స్ పంచ్ లు పేలాయి. స్టంట్స్ కూడా ఫ్రెంచి నిపుణులతో డూప్ ల సాయం లేకుండా ఆరు పదుల వయసులో కూడా కమల్ చెయ్యటం విశేషం.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలోనూ దీపావళికి విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

furious
movie image view

శివమ్

గత కొద్దికాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్. మూస ధోరణి చిత్రాలతో ఆడియన్స్ ని ఇరిటేట్ చేస్తున్నాడనే ఓ కంప్లైంట్ ఉంది. ఆ క్రమంలోనే చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇక తాజాగా సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ లో ఓ చిత్రాన్ని హీరోగా తెరకెక్కించారు.  ఓ హీరో... అందమైన హీరోయిన్... ఓ ముగ్గురు విలన్లు. చిన్న విలన్ నుండి పెద్ద విలన్ వరకు. రామ్ ను బ్రిలియంట్ అంటూ పొగిడిసే స్నేహితులు. కట్ చేస్తే మార్కెట్లో ఫైట్లు పంచ్ డైలాగులు. మళ్ళీ కట్ చేస్తే ఫారిన్ లో పాటలు. యథావిథిగా మనోడి స్టయిలింగ్. సేమ్ లుక్ , అవే అరుపులు. హీరోయిన్ మాత్రం ఈసారి క్యూట్ గా కుమ్మేసింది. అదే శివమ్ చిత్రం. ఈ సినిమా ఆడియో ఇటీవల అల్లు అరవింద్ చేతుల మీదుగా జరిగింది.

కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డితో స్రవంతి రవికిషోర్ తమ బ్యానర్ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసిని సినిమా ఇది. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. దాదాపు ఈ మధ్యన వస్తున్న హీరో రామ్ సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయ్. ఓ హీరో, ఓ క్యూట్ హీరోయిన్, విలన్లు, ఆమె సమస్యను హీరో నెత్తిన వేసుకోవటం... ఇలా ఏదో పాత సినిమానే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప... ఫ్రెష్ ఫీలింగ్ లేనే లేదు.   ''శివమ్'' సినిమా ట్రైలర్ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. పరమ రొటీన్ గా చూసిన సినిమానే చూస్తున్నట్లుంది.  ఇంత రొటీన్ గా ఉండటంతో కొత్తను కోరుకునే సినిమా లవర్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఇకపోతే రామ్ ఫ్యాన్సు మాత్రం బాగా ఎక్సయిట్ అవుతున్నారు. రామ్ ఎనర్జి చిత్రానికి బాగా ఆకర్షణ అవుతుందని  ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ రామ్.

furious
movie image view

కొరియర్ బాయ్ కళ్యాణ్

ఓ ఏడాది క్రితమే షూటింగ్ మొదలు పెట్టి దాదాపు పూర్తి చేసుకున్న నితిన్ సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సమర్పణలో గురు ఫిలింస్ పతాకంపై మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహించారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇప్పటి వరకూ ఈ సినిమా గురించి పెద్దగా ఆసక్తి చూపించని జనాల్లో ఈ ట్రైలర్ తో మంచి స్పందన వచ్చింది. సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోంది. ఇలాంటి కథలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండడం, ట్రైలర్ కూడా ఆసక్తి రేపుతుండడంతో ఈ సినిమా హిట్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.  2015లో నితిన్ కు ఒక్క సినిమా కూడా లేదు. ఎప్పుడో మొదలు పెట్టిన ఈ సినిమా అయినా విడుదలై ఈ ఇయర్ ఓ నిర్మాతగా, నటుడిగా రెండు హిట్లు కొట్టాలని ఆశిద్దాం. 
ఈ చిత్రానికి కార్తీక్, అనూప్ రూబెన్స్ సంయుక్తంగా సంగీతం అందించారు. సందీప్ చౌతా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సత్య పొన్‌మార్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, నేపథ్య సంగీతం: సందీప్ చౌతా, ఆర్ట్: రాజీవన్, మాటల సహకారం: కోన వెంకట్, హర్షవర్ధన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

 

furious
movie image view

కంచె

వరుణ్ తేజ్ మొదటి సినిమా 'ముకుంద' ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేదు. కానీ ‘కంచె’ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఓ సైనికుడిగా వరున్ తేజ్ బాగున్నాడనిపిస్తుంది. యంగ్ ఏజ్ లో నాగ బాబు ఇలానే ఉండేవారన్నట్టు పోలికలు ఈ గెటప్ లో బాగా కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ ను ఎలా చూపిస్తే బాగుంటాడో క్రిష్ బాగా ఊహించినట్టనిపిస్తుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ ని రాజమౌళి ఈ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విడుదల చేసారు. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రానుంది . అలాగే స్వాతంత్రానికి ముందు జరిగే కథతో రూపొందిన ఈ సినిమాను గాంధీ జయింతి రోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకు ముందు ప్రజ్ఞ జైస్వాల్ అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిచింది.