టీజర్/ట్రైలర్ రివ్యూ

furious
movie image view

సింగం 123

హృదయకాలేయం తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందిన చిత్రం సింగం 123. ఈ సినిమా స్పూఫ్ చిత్రం అని నిర్మాత మంచు విష్ణు ముందే చెప్పేశాడు. సినిమాని కామెడి యాంగిల్ లోనే చూడాలని కూడా చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాలో సంపూ ఎలాంటి వైబ్రేషనల్ కామెడి చేశాడో చూడాలంటే ముందు ట్రైలర్ రివ్యూ చూద్దాం..ఈ సినిమా పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ. రేసుగుర్రంలో బూచాడే..బ్యాగ్రౌండ్ తో ట్రైలర్ స్టార్టవుతుంది. పోకిరి క్లయిమాక్స్ లో నాజర్ డైలాగ్ లా ఉండే డైలాగ్ తో పోలీస్ బిల్డప్ తో సంపూ ఎంట్రీ స్టార్టవుతుంది. అలాగే తాజ్ మహాల్, సింగాన్ని చూసే కొద్ది చూడాలనిపిస్తుంది, ఏయ్ పిల్లా నేను నచ్చానా, నా గన్ నచ్చిందా వంటి డైలాగ్స్ తో హీరోయన్ సనమ్ తో సంపూ రొమాంటిక్ యాంగిల్ చూపించే ప్రయత్నం. నీకు మెంటల్ రావాలేమో నాకు 365 డేస్ ఆన్ లోనే ఉంటుంది. యముడికి రెస్ట్ ఉండదని ఎన్ కౌంటర్స్ ఆపేశా రీస్టార్ట్ చేయనీయద్దు. ప్రెషర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెషర్ కుక్కర్ లో పప్పుని కాదు. గ్యాస్ స్టౌవ్ పైనా నిప్పుని. బ్రతకండ్రా బతక్రండా అని బతిమలాడితే వినరేంట్రా..కోత మొదలైంది. మీరె వెళ్లేది ఐసియుల్లోకి కాదు. ఐస్ బాక్సుల్లోకే..ఆడవాళ్లకి ఆపదొస్తే అరగంట ఆలస్యంగా అయిన వస్తాను కానీ మగవాళ్లకి ఆపదొస్తే అరక్షణం కూడా ఆగను..ఐ షో దేమ్ హెల్. అంటూ వచ్చే డైలాగ్స్ తో డిఫరెంట్ హీరోస్ ను ఇమిటేట్ చేశాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే స్పూఫ్ డోస్ తెలుస్తుంది. మొత్తం మీద స్పూఫ్ తో పాటు యాక్షన్ డోస్ కూడా ఎక్కువగా కనపడుతుంది. మరి ఈ సినిమాలో ఏ రేంజ్ కామెడి ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

furious
movie image view

కిక్ 2

రవితేజ్ కెరీర్ లో ‘కిక్’ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. దాదాపు ఆరేళ్ల తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కిక్ 2’ రూపొందింది. కిక్కు కోసం అంటూ సందడి చేసిన మాస్ మహారాజా రవితేజ ఈ సారి ఎలా కనపడతాడోనని అనుకున్న అభిమానులకు ఫస్ట్ లుక్ నుండి అంచనాలు పెరుగుతూ వచ్చాయి.థమన్ ఎనిమిదోసారి రవితేజ సినిమాకి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ రివ్యూ చూద్దాం...

‘కిక్’ లో ‘కిక్కు’ కోసం ఏమైనా చేసిన రవితేజ ఈ సినిమాలో కంఫర్ట్ కోసం ఏదైనా చేసేలా కనపడుతున్నాడు. అంతే కాకుండా స్టార్టింగ్ డైలాగ్ నేను పుట్టాక మీకు ప్రాబ్లెమ్స్ స్టార్టయింది. కానీ వీడు పుట్టకముందు నుండి నా ప్రాబ్లెమ్స్ స్టార్టయింది అనడం, వీడు కిక్ కొడుకు అని ఆశిష్ విద్యార్థి చెప్పే డైలాగ్ తో ఇందులో రవితేజ తండ్రి కొడుకులుగా నటించారని తెలుస్తుంది. యాజ్ యూజువల్ గా రవితేజ, బ్రహ్మానందం కామెడి రిపీట్ అయ్యేలా కనపడుతుంది. ‘కిక్’ లో హల్వా రాజ్ లా నవ్వించిన బ్రహ్మీ ఈ చిత్రంలో పండిట్ రవిశంకర్ గా అలరించడానికి రెడీ అయిపోయాడు. అలాగే యాక్షన్ పార్ట్ విషయంలో ఎక్కడా తగ్గనని సురేందర్ రెడ్డి మరోసారి ప్రూవ్ చేయడానికి రెడీ అయపోతున్నాడు. సినిమా రాజస్థాన్ లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో రేసుగుర్రం విలన్ రవికిషన్ సాల్మన్ సింగ్ ఠాగూర్ గా కనిపించనున్నాడు. ఒక్క ఠాగూర్ కి భయపడే పిరికితనం మనదైతే వందమంది ఠాగూర్ లను పరెగెత్తించే ధైర్యంవాడు అంటూ వచ్చే డైలాగ్ తో అసలు ఠాగూర్ కి, రాబిన్ హుడ్ పాత్రలో కంఫర్ట్ కోసం ప్రయత్నించిన రవితేజకి అసలు లింకేంటో సినిమాలోనే చూడాల్సింది. మొత్తం మీద ట్రైలర్ ఎంటర్ టైనింగ్ గా ఉంది.

furious
movie image view

పండగ చేస్కో

పద్దెనిమిది నెలలు గ్యాప్ తీసుకుని హీరో రామ్ ప్రేక్షకుల ముందకు తీసుకొస్తున్న చిత్రం పండచేస్కో. హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ ఈ చిత్రంపై చాలా ఆశలనే పెట్టుకున్నాడని చెప్పాలి. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుని గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేశాడని, రెడీ, కందరీగ చిత్రాల తర్వాత ఈ సినిమా రామ్ కెరీర్ లో మరో పెద్ద హిట్టవుతుంది చిత్రయూనిట్ ధీమాను వ్యక్తం చేస్తుంది. సినిమాపై మంచి అంచాలే ఉన్నాయనడంలో సందేహం లేదు. అందులో భాగంగా ఆడియో, థియేట్రికల్ ట్రైలర్స్ విడుదలయ్యాయి. ఇక థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ విషయానికొస్తే...

ట్రైలర్ రామ్ స్టైలిష్ లుక్ ఎంట్రీతోనే స్టార్టవుతుంది. పండగచేస్కో టైటిల్ సాంగ్ , ఓ మై బేబి..అనే సాంగ్స్  ట్రైలర్ అంతా వినపడుతున్నాయి. సంపత్ రాజ్, సాయికుమార్ రోల్స్ ఆసక్తిని గొలిపే విధంగా ఉన్నాయి. వీడు ఇంత కసిగా కొడుతున్నాడంటే కచ్చితంగా దివ్యను ప్రేమించినవాడే అయ్యుంటాడని సంపత్ రాజ్ చెప్పడంతో హీరోయిన్ రకుల్ పేరు దివ్య అని తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ క్యూట్ గాక కనపడుతుంటే సోనాల్ చౌహాన్ చాలా గ్లామర్ గా కనపడుతుంది. ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటుంది, ప్యామిలీ లో ఉంటుంది, గుండెల్లో నుండి వచ్చే దమ్ములో ఉంటుందని సొల్లు చెప్పడం ఇష్టం ఉండదురా... అని చెప్పే డైలాగ్ తో హీరో ఈజ్ తో సాగే క్యారెక్టర్ అని అర్థమవుతుంది. ప్రతి ఫ్రేమ్  చాలా రిచ్ గా కనపడుతుంది. గోపిచంద్ భారీతారాగణంతో ప్రతి సీన్ ను తెరకెక్కించాడు. బ్రహ్మానందం యాజ్ యూజువల్ గా కోనవెంకట్ కామెడి పండించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద థియేట్రికల్ ట్రైలర్ కలర్ ఫుల్ గా, క్లాస్ గా కనపడుతుంది.

furious
movie image view

మోసగాళ్లకు మోసగాడు

స్వామిరారా వంటి క్రైమ్ కామెడి చిత్రంతో బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్ రూపొందించిన సీక్వెల్ చిత్రమే మోసగాళ్లకు మోసగాడు. సుధీర్ బాబు హీరోగా నటించాడు. టైటిల్ కూడా సూపర్ హిట్ టైటిల్ ను ఎంచుకోవడంతో సినిమా ఎలా ఉంటుందనే అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఏప్రిల్ 26న ఆడియో వేడుకలో భాగంగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ లో సినిమా ఎలా ఉంటుందనే దాని గురించి ఒక అంచనా ఏర్పడే అవకాశ ఉంది కాబట్టి అందులో భాగంగా ట్రైలర్ రివ్యూ...

స్వామిరారా చిత్రం ఒక విగ్రహం చుట్టూ తిరుగుతుంది. అలాగే మోసగాళ్లకు మోసగాడు చిత్రం కూడా 12వ శతాబ్దంలో విక్రమాదిత్య మహారాజు చేయించిన శ్రీరాముని విగ్రహం చుట్టూ తిరుగుతుందని తెలిసిపోయింది. ఆ విగ్రహాన్ని విలన్ గ్యాంగ్ అయిన రుద్ర, జయప్రకాష్ రెడ్డి గ్యాంగ్ చోరి చేస్తుందని దాని చుట్టూనే సినిమా కథ నడుస్తుందనే కాన్సెప్ట్ రివీల్ అయింది. అయితే ఈ చిత్రంలో సుధీర్ చాలా గుడ్ లుకింగ్ తో కనపడుతున్నాడు. పోలీస్, పొలిటీషియన్ గెటప్స్ కనపడుతున్నాడు. చిన్న చిన్న మోసాలు చేసుకుని బతికేస్తుంటానని హీరో అనడంతో హీరో దొంగ, మోసగాడు అనే క్యారెక్టర్ చేస్తున్నాడని అర్థమవుతంది. ట్రైలర్ ఓహో సుందరి మాట వినవే ఓ సుందరి...అనే సాంగ్ లో హీరోయిన్ కనపడుతుంది. హీరోయిన్ ఓకే. మణికాంత్ కద్రి ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ఉమ్మాడి సింగు సాయిప్రకాష్ సినమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి సీన్ రిచ్ గా కనపడుతుంది. మరి పూర్తి సినిమా కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది కానీ సినిమా రన్నింగ్, మేకింగ్ తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

furious
movie image view

జాదుగాడు

క్లాస్ మూవీస్ చేస్తున్న నాగశౌర్య మాస్ ఇమేజ్ కోసం చేస్తున్న ప్రయత్నమే ‘జాదూగాడు’. చింతకాయల రవి చిత్రాన్ని తెరకెక్కించిన యోగేష్ దర్శకుడు. సత్య ఎంటర్ టైన్సెంట్స్ బ్యానర్ పై వి.వి.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి నాగశౌర్యకి మాస్ లుక్ ఎలా ఉంటుందో, సూటవుతుందో లేదోనని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. మరి నాగశౌర్య ప్రేక్షకులను ఏ మేర మెప్పించాడో తెలుసుకోవాలంటే ట్రైటర్ రివ్యూ చూడాల్సిందే...

ఇక్కడ గెలుపే ముఖ్యం. గెలవాలంటే దేనికైనా ప్రేపేర్ అవ్వాలి. అయితే సాధించాలి లేకపోతే చావాలి అనే నాగశౌర్య డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

 ట్రైలర్ లో నాగశౌర్య లుక్ చాలా బావుంది. తను ఇప్పటి వరకు చేసిన సినిమాల తరహాలో కాకుండా కొద్దిగా రగ్ డ్ లుక్ లో కనపడే ప్రయత్నం చేశాడు.

ఈ సిటీలో ప్రేమగా పలకరిస్తారు..పర్సులు కాజేస్తారు అనే శ్రీనివాసరెడ్డి డైలాగ్..ఒరేయ్ చంపడం నీకొక వింత నాకు వెంట్రుకంతా అని సప్తగిరి చెప్పే డైలాగ్ కామెడిని పుట్టిస్తుంది.

నువ్వు లక్కీనే పిల్లా కలిసిని మూడు సార్లకే మూడు ముద్దులు కొట్టేశావ్ ..అంటూ హీరో హీరోయిన్ తో చెప్పే డైలాగ్...

చిన్నోడితో పెట్టుకో పెద్దోడితో పెట్టుకో నాలాంటి చిచోరాగాడితో పెట్టుకోకు... హీరో డైలాగ్..

ఇక్కడ ఎవడి చేతిలో గన్ ఉంటే వాడే బాస్ రా ..అని అజయ్ చెప్పే డైలాగ్  

ట్రైలర్ లో హీరోతో ఎక్కువ డైలాగ్స్ చెప్సించారు.

గోల చేద్దామే ఓ పిల్లా ..అనే సాంగ్...

మాస్ గాడే వీడు... అనే సాంగ్

అనే రెండు ఫాస్ట్ బీట్ సాంగ్స్

వీటి కలయితో ట్రైలర్  యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. హింస కూడా ఎక్కువగా ఉండచ్చునేమోనని భావన ప్రేక్షకుడికి కలిగే అవకాశం. మరి సినిమాలో నాగశౌర్య క్యారెక్టర్ ఎలా ఎలివేట్ అవుతుందో చూడాలి...

furious
movie image view

దోచెయ్

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకుంటూ మచిం విజయాలను సాధిస్తున్న యంగ్ హీరో నాగచైతన్య ఒక లైలా కోసం వంటి లవ్ స్టోరి తర్వాత చేస్తున్న సినిమాయే ‘దోచేయ్’.‘స్వామిరారా’తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సుధీర్ వర్మ ఈ సినిమాని మరో డిఫరెంట్ క్రైం సబ్జెక్ట్ తో తెరకెక్కిస్తున్నాడు. ‘స్వామిరారా’, ‘ఉయ్యాల జంపాల’, ‘రౌడీ ఫెలో’ చిత్రాలకు సంగీతానందించిన సన్నీ ఎం.ఆర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఈ ట్రైలర్ లో సాంగ్స్ లో సన్నీ తన స్టయిల్ ను చూపించాడు. అల్రెడి నాలుగు సాంగ్స్ ను విడుదల చేసిన యూనిట్ ఇప్పుడు మిగిలిన పాటల్ని విడుదల చేశారు. దొరికింది దోచేయ్ దోచేయ్ అని బ్యాక్ డ్రాప్ లో సాగే సాంగ్  బావుంది.

ట్రైలర్ బ్రహ్మానందంతో స్టార్టవుతుంది. నాగార్జునకి ‘శివ’, పవన్ కి ‘ఖుషీ’, మహేష్ కి ‘పోకిరి’తరహాలో ఈ సినిమా మీకు హిట్ మూవీగా నిలుస్తుంది సార్... అని చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్టవుతుంది. అంటే ఈ సినిమాలో బ్రహ్మానందం హీరో రోల్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం పేరు బుల్లెట్ బాబు. నాగచైతన్య డిఫరెంట్ గా రగ్ డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మంచితనం చెప్పడానికి, వినడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది.. అనే డైలాగ్ తో నాగచైతన్య టోన్ వినపడుతుంది. అంటే ఇక్కడ చైతు రోల్ ను ఓ మోసగాడిలా ఉంటుందని డైరెక్టర్ ఇన్ డైరెక్ట్ గా రివీల్ చేశాడు. పోసాని బాడీ లాంగ్వేజ్ కూడా కామెడి పండించే విలన్ గా కనపడుతుంది. పోసాని తన స్టయిల్ లో డైలాగ్స్ చెబుతూనే విలనీజం చూపించనున్నాడు. మొన్న ప్రేమిస్తానన్నావ్...నిన్నమో మోసగాడినన్నావ్..ఈరోజు కలిసి మోసంచేద్దామంటున్నావ్ అంటూ కృతిసనన్ చెప్పే డైలాగ్ తో హీరో హీరోయిన్స్ కలిసి ఓ క్రైమ్ చేస్తారని, సినిమా అంతా ఆ పాయింట్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.