టీజర్/ట్రైలర్ రివ్యూ

furious
movie image view

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.   రెజీనా , అదాశర్మ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.  ఈ చిత్ర ఆడియో పంక్షన్ ఇటీవలె జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పై నెగెటివ్ టాక్ రావడంతో…. అసలైన ఎంటర్టైన్ ను పంచుతూ పూర్తి స్థాయి ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.  ఇక ట్రైలర్ లో  సాయి ధరమ్ తేజ్ పంచ్  డైలాగ్ లతో అదరగొట్టాడు.

‘అమెరికా వచ్చింది ప్రతి సెకండూ డాలర్లు సంపాదించి , ఇండియా వెళ్లి కాలర్ ఎగిరేయడానికి... కొంత మంది లెక్కలు రాసుకుంటారు, నేను మాత్రం లెక్కలు తేల్చుకుంటాను. నేను మాటలతో మాయ చేయగలను, సంచుల కొద్ది పంచులేయగలను, కానీ నా టార్గెల్ పంచేయడం కాదు, పని చేయడం’ అంటూ కాన్సెప్ట్ ను మూడు డైలాగుల్లో కానిచ్చేశాడు. హీరోయిన్ రెజీనా సీత క్యారెక్టర్ లో నటించినట్లు అర్థమౌతుంది. సాఫ్ట్ కార్న్ ఉన్న పాత్రలో ఆమె నటంచినట్లు తెలుస్తుంది. పిల్లా నువ్వు లేని జీవితంతో హిట్ కొట్టిన ఈ జంట మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైపోతుంది. ట్రైలర్ ఇద్దరి మధ్య రొమాన్స్ పాలు కూడా ఎక్కువగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఓ వైపు యాక్షన్ ఎపిసోడ్స్ తోపాటు మరోవైపు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రెడీ తెరకెక్కినట్లు అర్థమౌతోంది. మిక్కీజేమేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు, సుమన్, బ్రహ్మానందంలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.  సెప్టెంబర్ రెండో వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ ప్రయత్నాలు ప్రారంభించింది.

furious
movie image view

భలే భలే మగాడివోయ్

యూత్ ఫుల్ చిత్రాలను అందించే దర్శకుడు మారుతి దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం భలే భలే మగాడివోయ్. టాలెంటెడ్ నటుడు నాని, క్యూట్ గర్ల్ లావణ్య త్రిపాఠిలు జంటగా ఈ చిత్రం తెరకెక్కింది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ -2 మరియు యువీ క్రియేషన్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. ఇందులో మతిమరుపు మారాజుగా నాని నటన ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. లావణ్య త్రిపాఠి ఓ కూచిపూడి నృత్యకారిణిగా కనిపించింది. ఇక కామెడీ మార్క్ చిత్రంగా ఇది తెరకెక్కిందని మాత్రం అర్థం అవుతుంది. అయితే మారుతి మార్క్ అడల్ట్ కామెడీ ఇందులో తక్కువ ఉండొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. అంతే కాదు క్యూట్ లవ్ స్టోరీ దీనికి అదనపు బోనస్.  వినోదం అంటే ఇది  కేవలం కామెడీ కోసమే తీసిన సినిమా కాదనీ ఈ సినిమాని ఓ కాన్సెప్ట్ తో తెరకెక్కించాననీ అందుకు అనుగుణంగానే కామెడీని జోడించామని దర్శకుడు మారుతి ఇదివరకే స్పష్టం చేశాడు. యాక్షన్ పార్ట్ పై కూడా మారుతి ఈసారి దృష్టిసారించినట్లు తెలుస్తుంది.  మొత్తానికి మారుతి మరో ఢిపరెంట్ జోనర్ ఉన్న సినిమాతో మన ముందుకు రాబోతున్నాడని అర్థమవుతోంది.  

furious
movie image view

శ్రీమంతుడు

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు, మిర్చి తో బ్లాక్ బస్టర్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఇక ఈ చిత్ర ఆడియో శనివారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.  ట్రైల‌ర్‌లో  మహేష్ బాబు చూడ‌డానికి క్లాస్‌గా క‌నిపించినా మాస్ డైలాగ్‌తో కేక పుట్టించాడు. ముందుగా జగపతి బాబు మహేష్ బాబు తండ్రిగా కొన్ని డైలాగులు కొడతాడు... దానికి ప్రతిగా మహేష్ నన్ను నచ్చే పని చెయ్యనిండని అని అడగటం బట్టి చిత్రం ఫారిన్ నుంచి ఇండియాకు షిప్టవుతుంది. అక్కడ ముంబై కి చేరుకున్న హీరో హీరోయిన్ తో ప్రేమలో పడి ఆమె ఊరికి చేరతాడు. అక్కడ ఊరిని దత్తత తీసుకోవటంతోపాటు ఆ ఊరి సమస్యలను కూడా పరిష్కరించటం చిత్రకథ అని అర్థమవుతోంది.  ఇక మరో డైలాగ్ లో ముకేష్ రుషితో  ‘ఏ ఎదవ పనిచేసినా వాడిని కాపాడటానికి వెనకాల ఒక బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్తాడంట… మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా నాలాంటి బ్యాడ్ సన్ ఒకడున్నాడు! బ్యాడ్ అంటే నీలా కాదు… అదో రకం’ అంటూ పేల్చాడు  మహేష్. ఇక శృతిహాసన్… “మా ఊరు నాకు చాలా ఇచ్చింది, ఎంతోకొంత తిరిగి ఇచ్చెయ్యకపోతే లావెక్కిపోతాను” అని చెప్పే విషయాన్ని సరదాగా చెప్పినా ఆ విషయంలో చాలా విషయం ఉంది. ట్రైలర్ చివర్లో సంపత్ అండ్ గ్యాంగ్ కు హీరో ఇదే డైలాగ్ తో కౌంటర్ ఇవ్వటంతో ఆ ఒక్క లైనే సినిమాని నడిపిస్తుందన్న విషయం అర్ధం అవుతుంది. ఇంకో డైలాగ్ లో మహేష్… రౌడీలను చితక్కొట్టి ఎప్పుడు చూసినా ఇదే పనారా… కొంచెం కూడా బోర్ కొట్టదా  అంటూ పేల్చిన డైలాగ్ తో యాక్షన్ పాలు ఓ రేంజ్ లో ఉంటుందని అర్థమవుతుంది. బ్యాగ్రౌండ్ మిర్చి తరహాలో దున్నిపాడేశాడు దేవీ. ట్రైలర్ చూస్తేంటే చిత్రం మాములు పంధాలో సాగినప్పటికీ డైరక్టర్ ఎమోషనల్ మలిచినట్లు తెలుస్తోంది.

furious
movie image view

డైనమెట్

గతేడాది నాలుగు సినిమాలతో అలరి౦చిన మ౦చు విష్ణు ఈ సంవత్సరంలో  కూడా వరుస సినిమాలతో హోరెత్తి౦చనున్నాడు. అ౦దులొ భాగ౦గా మొదట డైనమెట్ గా మన ము౦దుకు రాబోతున్నాడు. వెన్నల, ప్రస్థాన౦, ఆటోనగర్ సూర్య, వ౦టి డిఫెరె౦ట్ సినిమాలు తీసిన దేవకట్టా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మ౦చు విష్ణు డైనమెట్ లా౦టి క్యారెక్టర్ తో రాబోతున్నాదట. ఈ సినిమాలో విష్ణుకు జోడీగా అత్తరి౦టికి దారేదిలో నటి౦చిన ప్రణిత ఆడిపాడబోతు౦ది. తమిళ్ లో విక్రమ్ ప్రభు-ప్రియా ఆన౦ద్ కా౦బినేషన్ లో వచ్చి మ౦చి విజయ౦ సాధి౦చిన ‘అరిమ న౦బి’ సినిమాకు తెలుగు రీమేకే ఈ డైనమెట్. దర్శకుడు దేవా కట్టాకి ఆటోనగర్ సూర్య, విష్ణుకి ఎర్రబస్సు ఫ్లాఫ్ లతో వస్తున్న ఈ సినిమా మీద మ౦చి అ౦చనాలే పెట్టుకున్నారు దర్శక హీరోలు. మరి వారి ఆశలను డైనమెట్ ఏ మేరకు నెరవేరుస్తు౦దో చూడాలి. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ట్రైలర్ చూస్తే మాత్రం పక్కా యాక్షన్ ప్యాక్ మూవీ అని తెలుస్తోంది.

furious
movie image view

సినిమా చూపిస్త మావ

ఉయ్యాల జంపాల తర్వాత రాజ్ తరుణ్, అవికాగోర్ కలిసి నటిస్తున్న చిత్రం. అందులో బావా మరదళ్లుగా అలరించిన ఈ హిట్ పెయిర్ మరోసారి అదే వరుసతో వస్తోందని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. మామ రావు రమేష్ ను ముప్పు తిప్పలు పెట్టే క్యారెక్టర్ లో రాజ్ తరుణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రం తో మరోసారి వీళ్లిద్దరూ హిట్ సొంతం చేసుకుంటారా? ఆగష్టు రెండో వారంలో తెలుస్తోంది.

furious
movie image view

మలుపు

ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి తొలిసారి నిర్మాతగా చేసిన చిత్రం మలుపు. ఆయన ఇద్దరు తనయుల్లో పెద్ద వాడైన సత్యప్రభాస్ తొలిసారిగా ఈ చిత్రంతో మెగాఫోన్ చేపట్టాడు. తమ్ముడు ఆది పినిశెట్టి హీరోగా డైరెక్షన్ చేశాడు. స్నేహితులతో సరాదాగా గడిపే ఓ వైజాగ్ కుర్రాడికి, ముంబై అండర్ వరల్డ్ డాన్ మొదలియార్ కి ఉన్న వైరం గురించే నడిచే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది

స్నేహమంటే నమ్మకం..ఆ నమ్మకం వమ్మైనప్పుడు..

ఈ లోకం అన్నికంటే గొప్ప రిలేషన్ షిప్ స్నేహమే...

నా పేరు సగా..వైజాగ్ లో ఫైనల్ బి.కాం చదువుతున్నాను...నా మిడిల్ క్లాస్ లైఫ్ లో నాకు అందని ఎన్నో ఆనందాలను నా ఫ్రెండ్స్ నాకు అందించారు..ఆరోజు నా అమ్మ నాన్నల కంటే నాకు నా ఫ్రెండ్సే ఎక్కువనిపించారు..

వాళ్లతో కలిసి నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నానని నాన్న ఎప్పుడూ అంటుండేవారు..అయినా మాట నేనెప్పుడూ వినలేదు..వినుంటే బాగుండేదని ఇప్పుడనిపిస్తుంది. వినుంటే ఇలా భాష రాని ఊర్లో ఏ తోడు లేకుండా మొదలియార్ కోసం రావాల్సిన అవసరం ఉండేది కాదు..

ఇలాంటి డైలాగ్స్ తో ట్రైలర్ సాగుతుంది. మిథున్ చక్రవర్తి ముంబై అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ గా మంచి లుక్ తో కనపడుతున్నాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేపుతూ సాగుతుంది..

వాడు వీడు ప్రతివాడు నోరు జారారంటే చెడతాడు..ఆచి తూచి మాట్లాడు..నీ మాటే నిన్నెప్పుడు కాపాడు..అనే స్లోగన్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. ఆది నటన, సత్రప్రభాస్ టేకింగ్, షణ్ముగ సుందరం టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్ లో రిచ్ గా కనపడుతున్నాయి. మొత్తం మీద సినిమా అండర్ వరల్డ్ మాఫియాను శాసించే మొదలియార్ అనే వ్యక్తికి, ఓ కాలేజ్ యువకుడికి మధ్య సాగుతుందని, అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనన్నట్లు ఉంది..