మోసగాళ్ళకు మోసగాడు

April 29, 2015 | 03:18 PM | 96 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
మోసగాళ్ళకు మోసగాడు
Movie Name :
మోసగాళ్ళకు మోసగాడు
Audio Release Date :
April 26, 2015
Music Director :
మణికాంత్ కద్రి
Lyricist:
శ్రీమణి, కృష్ణకాంత్

Songs :

సూపర్ స్టార్ కృష్ణ సినిమా మోసగాళ్ళకు మోసగాడు ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ మూవీనే కాకుండా తెలుగులో మొదటి కౌ బాయ్ సినిమాగా పేరు పొందింది.  ఇలాంటి హిట్ టైటిల్ ను కృష్ణ చిన్న అల్లుడు సుదీర్ బాబు తన సినిమా టైటిల్ గా వాడుకున్నాడు. ఇది కూడా అలాంటి స్టోరీ లైన్ తో నడిచే సినిమా అని టీజపర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆ సినిమాలో బంగారపు నిధుల కోసం దొంగలు పోటీ పడితే ఇందులో 12వ శతాబ్ధపు విగ్రహాల దోపిడీ లా కథ నడుస్తుంది. ఇక ఇప్పటి ఈ సినిమా పాటల్లోకి వెళితే... ఇందులో ఏడు పాటల్లో రెండు కథ పరంగా రీ మిక్స్ అయినవి.

  1. మోసగాళ్ళకు మోసగాడు.... మాయగాళ్ళకు భాయి వీడు... అంటూ ఓ మాస్ సాంగ్ బాబా సెహెగల్ ఆయన స్టయిల్లోనే ఈ సినిమాలోనూ మరో హిట్ అందించారు...
  2. నా వాడై ఉంటాడా... నమ్మలేనే ఓ మనసా... ఇది చక్కని మెలోడీ తో సాగే సాంగ్... ఈ పాటను చిన్మయ్, నకుల్... చాలా శ్రావ్యంగా పాడారు.
  3. హలో హలో... ఏం షాకిచ్చావే తల్లి.. ఇక సాపింగ్ చేద్దాం... ఇది ఓ లవ్ సాంగ్ లా ఉంది... కార్తీక్ పాడారు ఈ పాటను.
  4.  ఓహో సుందరీ... మాటవినవే ఓ సుందరీ... రూటు మార్చవే ఓ జాంగిరీ... ఇది ఓ టీజింగ్ కం అమ్మాయి వెంట పడే పాటలా ఉంది... సూరజ్ సంతోష్ పాడాడు ఈ పాటను.
  5. రామాయ రామ భద్రాయ... రామ చంద్రాయ.... ఇది భక్తి రసం పుష్కలంగా అందించిన పాట... ఈ పాటను సూరజ్ పాడారు.

శ్రీమణి, కృష్ణ కాంత్ లిరిక్స్ ఇవ్వగా... మణికాంత్ కద్రి సంగీతాన్ని అందించారు. అన్ని పాటలూ బాగున్నాయి. మ్యూజికల్ గా హిట్ లిస్టులో చేరిపోయే పాటలివి.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు