Movie Name :
జాదూగాడు
Audio Release Date :
April 21, 2015
Music Director :
సాగర్ మహతి
Lyricist:
విశ్వ, శ్రీమణి
Songs :
జాదూగాడు సినిమాలోని ఐదు పాటలూ ఆకట్టుకునేలా ఉన్నాయి.
సాగర్ మహతి మాస్ కు నచ్చే విధంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు.
- జాదూగాడూ... టైటిల్ సాంగ్... సీన్స్ కు బ్యాక్ డ్రాప్ గా వస్తుంది..
- ఎబిసి ఎబిసి నేర్పించవె నీ ఒళ్లో... లిరిక్స్ వింటేనే ఇదో లవ్ సాంగ్ అని అర్థమై పోతుంది. దీన్ని హీరో నాగశౌర్య, సోనారికా మీద చిత్రీకరించారు. సోనారికా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందమంతా ఒలక బోసింది...
- ఏ పార్వతి... గోల చేద్దామే పిల్ల... ఇది కూడా యుగళ గీతం...హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించారు... కాకపోతే... ఈ హీరోయిన్ మొదటి హిందీ సీరియల్ లో పార్వతిగా నటించింది. మరి ఈ సినిమాలో ఈమె పేరు పార్వతి అని పెట్టారేమో... పార్వతిగా ఎంతగౌరవం కలుగుతుందో... సినిమాలో మాత్రం అలాంటి భావం ఏ మాత్రం కలగదనుకోండి... ఆ పార్వతేనాఅనుకునేలాఉంది.
- కథ ముదిరెగా... ఇది కూడా కథను అనుసరించే సీన్స్ తో సాగే ఓ బ్యాక్ డ్రాప్ సాంగ్...
- తొడగొట్టేవాడికి... ఎదురౌతాడు ఎవ్వరూ... అంటూ ఓ క్లబ్ లో ఐటమ్ సాంగ్ గా ఇచ్చారు... కానీ... ఇందులో నాగశౌర్య హీరోయిజం చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది.. మొత్తానికి సీన్స్... పాటలు చూస్తున్నంత సేపు... మహేష్ బాబు సినిమాలు పోకిరీ... బిజినెస్ మాన్... దూకుడు... ఒక్కడు సినిమాలోని కొన్ని సీన్లు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
Post Your Comment