అసెంబ్లీ ఫలితాలపై మోదీ హర్షం

May 19, 2016 | 04:24 PM | 4 Views
ప్రింట్ కామెంట్
modi_happy_over_assam_win_niharonline

కాసేపటి క్రితం విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తిరిగి పగ్గాలు చేపట్టబోతున్న జయలలిత, మమతాబెనర్జీ లకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కమిషన్ అధికారికంగా ఇంకా ఫలితాలు వెల్లడించనప్పటికీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. జయలలితతో తాను ఫోనులో మాట్లాడానని, అన్నాడీఎంకే విజయం సాధిస్తున్నందుకు శుభాకాంక్షలు చెప్పానని ట్విట్టర్‌ పోస్ట్‌లో మోదీ పేర్కొన్నారు. అలాగే, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీకి కూడా ఆయన ఫోను చేశారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రానున్న దీదీకి అభినందనలు తెలిపినట్టు ట్వీట్‌ చేశారు.

                        ఇక పదిహేనేళ్ల తరుణ్‌ గొగోయ్ పాలనకు ఉద్వాసన పలుకుతూ అసోం ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. అసోం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని శక్తియుక్తులూ ఒడ్డుతుందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కొత్త పుంతలు తొక్కిస్తామని స్పష్టం చేశారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ