హాట్ గా చూపిస్తుంటే ఆ కిక్కే వేరు

May 20, 2016 | 11:36 AM | 32 Views
ప్రింట్ కామెంట్
shruthi-hassan-about-GQ-photoshoot-niharonline

కెరీర్ ముందు నుంచే గ్లామర్ రోల్స్ తో ఆకట్టుకుంటూ వస్తోంది బ్యూటీ శృతీహాసన్. కమల్ తనయగా వచ్చి, ఆపై సౌత్, నార్త్ లో కూడా తనకంటూ ఓ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది ఈ కుందనపు బొమ్మ. నాజూకు తనానికి ప్రతిబింబంలా ఉంటూనే కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా జీక్యూ మ్యాగజైన్ కోసం హాట్ హాట్ గా ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్టిల్స్  చూసిన వారు 'ఔరా'! అనుకోవడమే కాదు శృతి మించిపోతుందని అనుకున్నారు. టాప్ కథానాయికగా ఉన్న పొజిషన్ లో ఇంతగా అందాలను ప్రదర్శించడం అవసరమా అని ఫ్యాన్స్ సైతం తిట్టకున్నారు. దీనిపై వివరణ ఇచ్చుకుంది శృతి ఇప్పుడు. సహజంగానే తాను హాట్ గా ఉండటం వలన అలా కనిపిస్తుందట. సెక్సీగా కనిపించడమంటే గ్లామర్ ను ఒలకబోయడం మాత్రమే కాదనీ, అందాల ప్రదర్శన విషయంలో తన హద్దులు తనకి తెలుసని అంటోంది. మోడ్రన్ గా కనిపించడం కూడా తన లైఫ్ స్టైల్ లో ఒకటిగా భావిస్తానంటున్న శృతి,  ఎవరైనా తనను హాట్ అంటే పిచ్చ హ్యాపీగా అనిపిస్తుందని చెబుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ