అలాంటి పాత్రలు చేయటం చాలా కష్టం

December 16, 2015 | 03:48 PM | 8 Views
temper
Artist Name :
సమంత
Interviewed By :
నీహార్ ఆన్ లైన్
Interview Date :
December 16, 2015

Interview Details :

పాత్రల ఎంపిక విషయంలో సౌత్ బ్యూటీ సమంతకు పెద్దకు పట్టింపులు ఉండవు. పెళ్లైన యువతి కేరక్టర్లే కాదు.. ఏకంగా నాగార్జున అమ్మగా కూడా చేసి మెప్పించేయగల కెపాసిటీ ఆమె సొంతం. ప్రస్తుతం ధనుష్ తో నవ మన్మధుడు (తంగమగన్) మూవీలో గృహిణి పాత్ర పోషిస్తోంది ముద్దుగుమ్మ. ఎల్లుండే(శుక్రవారం) ఈ సినిమా రిలీజ్. మరి కేరక్టర్ల విషయంలో ఆమె తీసుకునే జాగ్రత్తలేంటి ?  ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ కి ఆమె ఇచ్చి ఇంటర్వ్యూ...

కేరక్టర్స్ ఎంపికలో సమంత స్పెషాలిటీ ఏంటి ?

నేను విభిన్నమైన రోల్స్ ని ప్రిఫర్ చేస్తాను. తంగమగన్ లో చేసిన రోల్ కూడా అలాంటిదే. -

నవమన్మథుడు లో పాత్ర ఎలా ఉంటుంది? 

ఇదో పరిణతి చెందిన మధ్య తరగతి గృహిణి పాత్ర. ఇలాంటి రోల్స్ చేయగం కొంచెం కష్టమైన విషయమే. ఈ పాత్రకు న్యాయం చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

ధనుష్ తో మొదటిసారి నటిస్తున్నారు కదా ?

ధనుష్ లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్ తో చేయడం చాలా సంతోషం కలిగించే విషయం. వరుసగా అతనితో మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాను. వేట్రిమారన్ తీస్తున్న వాడా చెన్నై రెండు భాగాలుగా రానుంది. ఈ రెండింటిలోనూ నేను నటిస్తున్నాను.

అమీ జాక్సన్ తో కలిసి నటించడంపై? 

ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. నిజానికి విజయ్ తో కలిసి తెరి లోనూ ఇద్దరం కలిసి నటిస్తున్నాం. తను చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. అమీ ఒకే షాట్ లో డైలాగ్స్ అన్నీ చెప్పేస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది.

మరో హీరోయిన్ తో స్క్రీన్ పంచుకోవడం ఇబ్బంది కాదా ?

ఈ మూవీస్ లో మా ఇద్దరి కేరక్టర్స్ చాలా విభిన్నమైనవి. మేమిద్దరం కలిసి పని చేస్తుంన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. తను నన్ను నేను తనని ఎంతో గౌరవిస్తాం.

డైరెక్టర్ వేల్ రాజ్ గురించి చెప్పండి ?

వేల్ రాజ్ చాలా ప్రతిభ ఉన్న దర్శకుడు. రికార్డ్ టైంలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఇలాంటి మూవీని ఇంతమంది యాక్టర్స్ తో 44 రోజుల్లో షూట్ చేయడం మామూలు విషయం కాదు.

ధనుష్ తో కాకుండా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ? 

విక్రమన్ దర్శకత్వంలో సూర్యతో కలిసి 24, అట్లీ దర్శకత్వంలో  విజయ్ తో తెరి చేస్తున్నాను. ఇక తెలుగులో నితిన్ తో అ..ఆ.. తో పాటు సూపర్ స్టార్ మహేష్ సరసన బ్రహ్మోత్సవంలో నటిస్తున్నా అంటూ ముగించింది సమంత.

goldnsilver

తాజా వార్తలు