ఆడియో రివ్యూ

అసుర
movie image view

అసుర

నారారోహిత్, ప్రియాబెనర్జి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అసుర’. నారారోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై శ్యామ్ దేవభక్తుని, కృష్ణవిజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపి వ్యవసాయశాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు, ఏపి ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు విచ్చేసారు. ఆడియో సిడీలను పత్తిపాటి పుల్లారావు విడుదల చేసి, తొలి సిడీని నారా రోహిత్ కు అందజేసారు. థియేటర్ ట్రైలర్ ను కామినేని శ్రీనివాస్ విడుదల చేసారు.

పోటెత్తిన తూరుపు సురీడే... హోరెత్తిన సంద్రపు స్నేహితుడే.. కసికత్తులు దూసిన గుణమితడే.. అసురసుర... సాయికార్తీక్, కారుణ్య పాడారీ పాటను

పేరు తెలియని అల్లరి ప్రేమ దేనా... హేమచందర్, దివిజి కార్తీక్ పాడారు

యుద్ధం చేయరా... రణరంగం నీదేరా.... అసుర... అసుర... వేటాడే వాడు అసుర.... కార్తీకేయన్ పాడారు.

నీ తలపే వెంటాడిందా.. నీ జ్నాపకం దురవుతుందా... సాయి చరణ్ పాడారు.

టు రావె  సుకుమార.... నీ చూపే ప్యారీ ప్యారీ... సుకుమార... తనివితీరా... శ్రావణ భార్గవి, లోకేష్ పాడారు.

కిక్ 2
movie image view

కిక్ 2

మాస్‌ మహారాజా రవితేజ పాటలంటేనే ఒంట్లో ఎనర్జీ పుట్టుకొస్తుందేమో అన్నట్టుంటాయి. అయితే కిక్ 2 లో అంతటి క్రేజ్ పెంచే పాటలు లేవనే అనిపిస్తోంది. సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'కిక్‌' ఎంతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మళ్ళీ కిక్‌ టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన చిత్రం 'కిక్‌-2'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ మే 9న హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది.  కిక్‌ చిత్రంలోని పాటల రేంజ్లో ఈ పాటలు పేలలేదు. యస్‌.యస్‌.థమన్‌ అందించిన ఈ పాటలు ఆవరేజ్ అని చెప్పాలి.  

 

 1. మైనేమ్ ఈజ్ రాబిన్ హుడ్ – మై మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదనీ... ఇది రవి తేజకు సూటబుల్ అయ్యే పాటలా ఉంది... పాడిన వారు బోలే.
 2. ఈ తేనె కళ్ళదీ... నీ ప్రేమలోన పడ్డది... నువ్వే నువ్వే ప్రాణం... ప్రపంచం... నువ్వే నువ్వే ధ్యానం... ఈ పాటను పాడింది జోనిట గాంధీ, తమన్.
 3. జెండాపై కపిరాజు... ఈ పాటను పాడిన వారు దివ్య కుమార్, జోనిటా గాంధీ, రాహుల్ నంబియార్, దీపక్ నివాస్, హనుమంత్ రావు
 4. మస్తానీ... మస్తానీ.... ఈ డ్యూయెట్ పాటను దీపక్, మాన్సీ పాడారు.
 5. టెంపుల్ సాంగ్.... నివాస్, రాహుల్ నంబియార్, దీపక్, సంజన, మోనీష పాడారు.
 6. కిక్... టైటిల్ సాంగ్ ను సింహ, స్ఫూర్తి పాడారు.

 

ఆంధ్రా పోరి
movie image view

ఆంధ్రా పోరి

ఆంధ్ర పోరీ పాటలన్నీ సూపర్బ్... సూపర్బ్... సూపర్బ్

ఇందులో ఆరు పాటలలున్నాయి. అన్నీ ఒకదానికి మించి ఒకటి అన్నట్టుగా చాలా బాగున్నాయి. లిరిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. క్లాస్, మాస్ కు నచ్చే విధంగా  క్లాసికల్,.. మెలొడీ...జానపదం... అన్నీ మిళితమైనట్టున్నాయి పాటలు.

 1. దేత్తడి... దేత్తడీ... సున్నకు సున్న... అల్లికి... అల్లి... ఫుల్ మాస్ సాంగ్ తెలంగాణా పదాలు బాగా పడ్డాయి పాటలో... ఇక ఈ పాట అన్ని పార్టీల్లోనూ... మారుమోగి పోతుందనడంలో అతిశయోక్తి లేదు... రైటర్ సుద్దాల అశోక్ తేజ చక్కటి పదాలు జోడించారు... స్వీకార్ అగాశి కూడా చాలా బాగా పాడారు.
 2. ఏ కవికీ అందని భావం నా మదిలో మెదిలే గీతం... ఈ పాట చాలా వినసొంపుగా ఉంది. చక్కటి మెలొడీ అందించారు ఈ పాటలో... క్రుష్ణ మదినేని రాశారు, హేమచంద్ర, ప్రణవి గాత్రం అందించారు.
 3. నీవేనా నా కొలువొక పంజరమని తెలిపినది... నీవేనా.... దేత్తడీ...గుండెల్లో గుట్టుగా... చక్కటి  క్లాసికల్ గా మొదలైన ఈ రాగం స్లో పాటేమో అనుకుంటాం... కానీ తరువాత  ఫాస్ట్ బీట్ లోకి వెళ్ళిపోతుంది... కల్పన గాత్ర దానం చేశారు ఈ పాటకు. తనదైన క్లాసికల్ బీట్ తో పాటు ఫాస్ట్ బీట్ కూడా అందించారు. కిట్టు విస్సప్రగడ రాశారు ఈ పాటను
 4. వేసావె పాగా... పదాల్లో పదంగా...ఆంధ్రా పోరీ... లిరిక్స్ చూస్తే మాస్ పాటేమో అనుకుంటాం కానీ ఇది మెలొడియస్ గా సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, అమ్రుతవర్శిని, సాయికిరణ్ పాడారు.
 5. ఏ చరిత్ర చూసినా తే కదా... సాక్ష్యం సమాధులే ప్రనేమకూ... ఏకథను చూసినా ఏం మారదా.... ఈ పాట ట్రాజెడీ పాటలా ఉంది. లిరిక్స్ చాలా బాగున్నాయి. చక్రవర్తుల ఈ పాటను రాశారు. హేమచంద్ర పాడారు.
 6.  గట్టుమీద సెట్టు నవ్వీనాది... గోదారి పొంగినాదే.. అలుగు తుంకే చేపపిల్లా తుళ్ళినాది...అల్లరి చేసినదే... సంబరమొచ్చే సోపాతిలో సోయి దప్పి పోతున్నదే.. ఎండైనా వానైనా పండగ తీరుగుంటాదీ దోస్తీ... దోస్తీ... ఈ పాట నది ఒడ్డునో,... పడవలోనూ... పడుతున్నట్టుంది... పల్లె యాసలో ఉంది... చాలా హాయిగా ఉంది పాట వింటుంటే... నందకిషోర్ రాశారీ పాటను బాలాజీ పాడారు.
దాన వీర శూర కర్ణ
movie image view

దాన వీర శూర కర్ణ

పౌరాణిక చిత్రాలు తీయడమంటేనే ఓ పెద్ద సాహసం చేసినట్టే... అది కూడా బాలలతో తీయడమంటే ఎంతో ధైర్యం ఉండాలి.నందమూరి వారు చేసిన ఈ సాహసాన్ని పైనున్న సీనియర్ ఎన్టీఆర్ చాలా అభినందిస్తారు. ఈ చిత్రానికి జే.వి.ఆర్ దర్శకులు కాగా, సి.హెచ్ వెంకటేశ్వరరావు, జె.బాలరాజులు నిర్మాతలుగా వ్యవహరించారు. స్వర్గీయ నందమూరి జానకీరామ్ కుమారులు మాస్టర్ నందమూరి తారక రామారావు, సౌమిత్రి ఈ చిత్రం ద్వారా బాల నటులుగా పరిచయం అయ్యారు. ఈ బాల నటుడు నందమూరి మూడో తరం వారసుడుగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి కౌసల్య , వందేమాతరం శ్రీనివాస్, సాబు సంగీతం అందించారు. చైతన్య ప్రసాద్, గంగోత్రి విశ్వనాథ్ లు పాటలు రాశారు. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు శ్రావ్యంగా ఉన్నప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ సినిమా పాటలకు మాత్రం పోటీ రావు.

1. రారా మాధవ మురళీ లోల – క్రుష్ణ క్రుష్ణ లహరి అనే పాటను రమ్య బేపూర్, కశ్యప్ కొంపల్లి పాడారు

2. అమ్మకోరికే ఆశీస్సులవ్వును – ఈ పాటను వందే మాతరం శ్రీనివాస్ పాడారు

3. ఎన్ని పూజల పుణ్య ఫలము – ఈ పాటను కౌసల్య పాడారు...

4. ఏనాడు చేశానో... ఇది కూడా కౌసల్య పాడారు

5.  చిలకను రా... ఈ పాటను  ప్రణవి, రోహిత్ పాడారు

6. భీష్మ ధాటికి తాళలేక... శ్రీకాంత్ పాడారు

7. కురు రాజ సింహమా... ఈ పాటను ప్రణవి పాడారు

పండగ చేస్కో
movie image view

పండగ చేస్కో

రామ్ హీరో గా నటించిన 'పండగ చేస్కో' పాటలు పండగ చేసుకునేలాగే ఉన్నాయి. తమన్ మాస్ బీట్స్ యూత్ ను తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. పరుచూరి కిరీటి నిర్మాత. ఈ సినిమా పాటల వేడుక మే 1న హైదరాబాద్ ఘనంగా జరిగింది. ఇరువురు హీరోయిన్లతో తెలుగు హీరోల్లో అందగాడి లిస్టులో చేరిపోయిన రామ్ కలర్ ఫుల్ గా ఆడియో పండగ చేశాడు. ఈ స్టోరీకి తగిన పాటలను రచయిత భాస్కరభట్ల అందించారు. తమన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.  తమన్ అందించిన ఐదు పాటలు సక్సెస్ అనే చెప్పాలి.
1. డం డం డిగ డిగ డిగ చేద్దాం హల్ చల్ చల్... అంతే తెలియని సంతోషాలకు నువ్వొక ఎగ్జాంపుల్... లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్... జస్ట్ బ్యూటిఫుల్ (దీపక్, రూడ్, ఎ.కె)- మంచి మ్యూజిక్ బీట్ ఉన్న సాంగ్, యూత్ కు బాగా నచ్చుతుంది.
2. తొలిసారి కలవరమేంటో... చలిజ్వరమేంటో.... ఈ గొడవేంటో... దొరికాడే దొరికాడే... మేఘా సోలోగా పడిన ఈ పాటలో చక్కటి మెలొడీ అందించారు తమన్.
3. ఓ పిల్లా,... పిల్లా. నా పిప్పమెంట్ పిల్లా... ఈ పాటను తమన్ పాడారు... 
4. సూడసక్కగున్నవే... సూపరుగున్నావే... సుప్పనాతి మరదలా... ఈ పాట కూడా తమన్, ఎం.ఎం.మాన్సితో కలిసి పాడారు... జానపద బాణీలో మాంచి మాస్ బీట్ అందించారు.
5. జాంపేటకాడ కన్నుకొట్టేసానే... నీ జాంపండు లాంటిబుగ్గ నొక్కేసానె... పండగ చేస్కో బావయ్యో వెచ్చని వయసుని దిండుగ చేస్కో.... ఇది కూడా మాస్ బీట్ సాంగ్ మాంచి స్టెప్పులున్నాయనిపిస్తుంది పడడతాయనిపిస్తుంది పాట వింటుంటే. ఈ పాటను సింహ, గీతా మాధురి, అంజు పాడారు.

 

మోసగాళ్ళకు మోసగాడు
movie image view

మోసగాళ్ళకు మోసగాడు

సూపర్ స్టార్ కృష్ణ సినిమా మోసగాళ్ళకు మోసగాడు ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ మూవీనే కాకుండా తెలుగులో మొదటి కౌ బాయ్ సినిమాగా పేరు పొందింది.  ఇలాంటి హిట్ టైటిల్ ను కృష్ణ చిన్న అల్లుడు సుదీర్ బాబు తన సినిమా టైటిల్ గా వాడుకున్నాడు. ఇది కూడా అలాంటి స్టోరీ లైన్ తో నడిచే సినిమా అని టీజపర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆ సినిమాలో బంగారపు నిధుల కోసం దొంగలు పోటీ పడితే ఇందులో 12వ శతాబ్ధపు విగ్రహాల దోపిడీ లా కథ నడుస్తుంది. ఇక ఇప్పటి ఈ సినిమా పాటల్లోకి వెళితే... ఇందులో ఏడు పాటల్లో రెండు కథ పరంగా రీ మిక్స్ అయినవి.

 1. మోసగాళ్ళకు మోసగాడు.... మాయగాళ్ళకు భాయి వీడు... అంటూ ఓ మాస్ సాంగ్ బాబా సెహెగల్ ఆయన స్టయిల్లోనే ఈ సినిమాలోనూ మరో హిట్ అందించారు...
 2. నా వాడై ఉంటాడా... నమ్మలేనే ఓ మనసా... ఇది చక్కని మెలోడీ తో సాగే సాంగ్... ఈ పాటను చిన్మయ్, నకుల్... చాలా శ్రావ్యంగా పాడారు.
 3. హలో హలో... ఏం షాకిచ్చావే తల్లి.. ఇక సాపింగ్ చేద్దాం... ఇది ఓ లవ్ సాంగ్ లా ఉంది... కార్తీక్ పాడారు ఈ పాటను.
 4.  ఓహో సుందరీ... మాటవినవే ఓ సుందరీ... రూటు మార్చవే ఓ జాంగిరీ... ఇది ఓ టీజింగ్ కం అమ్మాయి వెంట పడే పాటలా ఉంది... సూరజ్ సంతోష్ పాడాడు ఈ పాటను.
 5. రామాయ రామ భద్రాయ... రామ చంద్రాయ.... ఇది భక్తి రసం పుష్కలంగా అందించిన పాట... ఈ పాటను సూరజ్ పాడారు.

శ్రీమణి, కృష్ణ కాంత్ లిరిక్స్ ఇవ్వగా... మణికాంత్ కద్రి సంగీతాన్ని అందించారు. అన్ని పాటలూ బాగున్నాయి. మ్యూజికల్ గా హిట్ లిస్టులో చేరిపోయే పాటలివి.