ఆంధ్రా పోరి

May 08, 2015 | 01:02 PM | 103 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
ఆంధ్రా పోరి
Movie Name :
ఆంధ్రా పోరి
Audio Release Date :
May 07, 2015
Music Director :
జోస్యభట్ల
Lyricist:
సుద్దాల అశోక్ తేజ, క్రుష్ణమదినేని, కిట్టువిస్సప్రగడ, రామజోగయ్య శాస్త్రి, చక్రవర్తుల, నందకిషోర్

Songs :

ఆంధ్ర పోరీ పాటలన్నీ సూపర్బ్... సూపర్బ్... సూపర్బ్

ఇందులో ఆరు పాటలలున్నాయి. అన్నీ ఒకదానికి మించి ఒకటి అన్నట్టుగా చాలా బాగున్నాయి. లిరిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. క్లాస్, మాస్ కు నచ్చే విధంగా  క్లాసికల్,.. మెలొడీ...జానపదం... అన్నీ మిళితమైనట్టున్నాయి పాటలు.

  1. దేత్తడి... దేత్తడీ... సున్నకు సున్న... అల్లికి... అల్లి... ఫుల్ మాస్ సాంగ్ తెలంగాణా పదాలు బాగా పడ్డాయి పాటలో... ఇక ఈ పాట అన్ని పార్టీల్లోనూ... మారుమోగి పోతుందనడంలో అతిశయోక్తి లేదు... రైటర్ సుద్దాల అశోక్ తేజ చక్కటి పదాలు జోడించారు... స్వీకార్ అగాశి కూడా చాలా బాగా పాడారు.
  2. ఏ కవికీ అందని భావం నా మదిలో మెదిలే గీతం... ఈ పాట చాలా వినసొంపుగా ఉంది. చక్కటి మెలొడీ అందించారు ఈ పాటలో... క్రుష్ణ మదినేని రాశారు, హేమచంద్ర, ప్రణవి గాత్రం అందించారు.
  3. నీవేనా నా కొలువొక పంజరమని తెలిపినది... నీవేనా.... దేత్తడీ...గుండెల్లో గుట్టుగా... చక్కటి  క్లాసికల్ గా మొదలైన ఈ రాగం స్లో పాటేమో అనుకుంటాం... కానీ తరువాత  ఫాస్ట్ బీట్ లోకి వెళ్ళిపోతుంది... కల్పన గాత్ర దానం చేశారు ఈ పాటకు. తనదైన క్లాసికల్ బీట్ తో పాటు ఫాస్ట్ బీట్ కూడా అందించారు. కిట్టు విస్సప్రగడ రాశారు ఈ పాటను
  4. వేసావె పాగా... పదాల్లో పదంగా...ఆంధ్రా పోరీ... లిరిక్స్ చూస్తే మాస్ పాటేమో అనుకుంటాం కానీ ఇది మెలొడియస్ గా సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, అమ్రుతవర్శిని, సాయికిరణ్ పాడారు.
  5. ఏ చరిత్ర చూసినా తే కదా... సాక్ష్యం సమాధులే ప్రనేమకూ... ఏకథను చూసినా ఏం మారదా.... ఈ పాట ట్రాజెడీ పాటలా ఉంది. లిరిక్స్ చాలా బాగున్నాయి. చక్రవర్తుల ఈ పాటను రాశారు. హేమచంద్ర పాడారు.
  6.  గట్టుమీద సెట్టు నవ్వీనాది... గోదారి పొంగినాదే.. అలుగు తుంకే చేపపిల్లా తుళ్ళినాది...అల్లరి చేసినదే... సంబరమొచ్చే సోపాతిలో సోయి దప్పి పోతున్నదే.. ఎండైనా వానైనా పండగ తీరుగుంటాదీ దోస్తీ... దోస్తీ... ఈ పాట నది ఒడ్డునో,... పడవలోనూ... పడుతున్నట్టుంది... పల్లె యాసలో ఉంది... చాలా హాయిగా ఉంది పాట వింటుంటే... నందకిషోర్ రాశారీ పాటను బాలాజీ పాడారు.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు