అసుర

May 15, 2015 | 04:59 PM | 95 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
అసుర
Movie Name :
అసుర
Audio Release Date :
May 14, 2015
Music Director :
సాయి కార్తీక్
Lyricist:
వసిష్ట శర్మ, సుబ్బరాయ శర్మ, కృష్ణకాంత్

Songs :

నారారోహిత్, ప్రియాబెనర్జి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అసుర’. నారారోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై శ్యామ్ దేవభక్తుని, కృష్ణవిజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపి వ్యవసాయశాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు, ఏపి ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు విచ్చేసారు. ఆడియో సిడీలను పత్తిపాటి పుల్లారావు విడుదల చేసి, తొలి సిడీని నారా రోహిత్ కు అందజేసారు. థియేటర్ ట్రైలర్ ను కామినేని శ్రీనివాస్ విడుదల చేసారు.

పోటెత్తిన తూరుపు సురీడే... హోరెత్తిన సంద్రపు స్నేహితుడే.. కసికత్తులు దూసిన గుణమితడే.. అసురసుర... సాయికార్తీక్, కారుణ్య పాడారీ పాటను

పేరు తెలియని అల్లరి ప్రేమ దేనా... హేమచందర్, దివిజి కార్తీక్ పాడారు

యుద్ధం చేయరా... రణరంగం నీదేరా.... అసుర... అసుర... వేటాడే వాడు అసుర.... కార్తీకేయన్ పాడారు.

నీ తలపే వెంటాడిందా.. నీ జ్నాపకం దురవుతుందా... సాయి చరణ్ పాడారు.

టు రావె  సుకుమార.... నీ చూపే ప్యారీ ప్యారీ... సుకుమార... తనివితీరా... శ్రావణ భార్గవి, లోకేష్ పాడారు.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు