పండగ చేస్కో

May 02, 2015 | 01:15 PM | 76 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
పండగ చేస్కో
Movie Name :
పండగ చేస్కో
Audio Release Date :
May 01, 2015
Music Director :
ఎస్.ఎస్.తమన్
Lyricist:
భాస్కర బట్ల

Songs :

రామ్ హీరో గా నటించిన 'పండగ చేస్కో' పాటలు పండగ చేసుకునేలాగే ఉన్నాయి. తమన్ మాస్ బీట్స్ యూత్ ను తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. పరుచూరి కిరీటి నిర్మాత. ఈ సినిమా పాటల వేడుక మే 1న హైదరాబాద్ ఘనంగా జరిగింది. ఇరువురు హీరోయిన్లతో తెలుగు హీరోల్లో అందగాడి లిస్టులో చేరిపోయిన రామ్ కలర్ ఫుల్ గా ఆడియో పండగ చేశాడు. ఈ స్టోరీకి తగిన పాటలను రచయిత భాస్కరభట్ల అందించారు. తమన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.  తమన్ అందించిన ఐదు పాటలు సక్సెస్ అనే చెప్పాలి.
1. డం డం డిగ డిగ డిగ చేద్దాం హల్ చల్ చల్... అంతే తెలియని సంతోషాలకు నువ్వొక ఎగ్జాంపుల్... లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్... జస్ట్ బ్యూటిఫుల్ (దీపక్, రూడ్, ఎ.కె)- మంచి మ్యూజిక్ బీట్ ఉన్న సాంగ్, యూత్ కు బాగా నచ్చుతుంది.
2. తొలిసారి కలవరమేంటో... చలిజ్వరమేంటో.... ఈ గొడవేంటో... దొరికాడే దొరికాడే... మేఘా సోలోగా పడిన ఈ పాటలో చక్కటి మెలొడీ అందించారు తమన్.
3. ఓ పిల్లా,... పిల్లా. నా పిప్పమెంట్ పిల్లా... ఈ పాటను తమన్ పాడారు... 
4. సూడసక్కగున్నవే... సూపరుగున్నావే... సుప్పనాతి మరదలా... ఈ పాట కూడా తమన్, ఎం.ఎం.మాన్సితో కలిసి పాడారు... జానపద బాణీలో మాంచి మాస్ బీట్ అందించారు.
5. జాంపేటకాడ కన్నుకొట్టేసానే... నీ జాంపండు లాంటిబుగ్గ నొక్కేసానె... పండగ చేస్కో బావయ్యో వెచ్చని వయసుని దిండుగ చేస్కో.... ఇది కూడా మాస్ బీట్ సాంగ్ మాంచి స్టెప్పులున్నాయనిపిస్తుంది పడడతాయనిపిస్తుంది పాట వింటుంటే. ఈ పాటను సింహ, గీతా మాధురి, అంజు పాడారు.

 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు