యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ రిలయన్స్ సంస్థ తో కలిసి నిర్మించిన చిత్రం ''నాన్నకు ప్రేమతో ''. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు . దేవిశ్రీ ప్రసాద్ ,భాస్కర భట్ల , చంద్రబోస్ లు రాసిన పాటలు ఎన్టీఆర్ అభిమానులను అలరించేలా ఉన్నాయా లేదా అన్నది తెలియాలంటే పాటల విశ్లేషణ లోకి వెళ్ళాల్సిందే .
మొదటి పాట ; ఫాలో ...... ఫాలో అంటూ సాగే పాట ఈ ఆల్బం లో మొదటి పాట కాగా ఈ పాటని సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ రాయడం విశేషం ,ఇక ఈ పాటని ఎన్టీఆర్ పాడటం మరో విశేషం . దేవిశ్రీ ఎంత కసిగా ఈ పాట రాసాసో అంతే కసిగా ఎన్టీఆర్ కూడా పాడిన ఈ పాట నాన్నకు ప్రేమతో ఆల్బం కే హైలెట్ .
రెండవ పాట : నా మనసు నీలో అంటూ సాగే ఈ పాటని భాస్కర భట్ల రాయగా డిఎస్పీ ,షర్మిల ఆలపించారు . రొమాంటిక్ గా సాగే ఈ పాట మెలోడీ ప్రధానంగా సాగింది .
మూడవ పాట : చంద్రబోస్ రాసిన ఈ పాట ఎన్టీఆర్ అభిమానులను విపరీతంగా అలరించడం ఖాయం ఎందుకంటే గతకొంత కాలంగా ఎన్టీఆర్ ని కొంతమంది కావాలనే దూరం పెడుతున్నారు దాంతో ఎన్టీఆర్ ని పక్కన పెట్టడం జరగోచ్చేమో కానీ తొక్కడం మాత్రం ఎవరి వల్లా కాదని ఎంత తొక్కితే బంతి లాగ అంత పైకి వచ్చే శక్తి ఉందని చాటి చెప్పి మనోస్తైర్యం నింపే పాట ఇది . ఇక ఎన్టీఆర్ కు కూడా బాగా నచ్చి ఉండొచ్చు . డోంట్ స్టాప్ అంటూ సాగే ఈ పాటని రఘు దీక్షిత్ ఆలపించాడు .
నాల్గవ పాట : లవ్ మీ ఎగైన్ అంటూ సాగే ఈ పాటని చంద్రబోస్ రాయగా సూరజ్ సంతోష్ ఆలపించాడు . ప్రేమ లోని మాధుర్యాన్ని వర్ణించే ఈ పాట ఫ్యాన్స్ ని అలరించడం ఖాయం .
ఇక ఆల్బం లో చివరి పాట ''లవ్ దెబ్బ '' అంటూ వచ్చే ఈ పాటని చంద్రబోస్ రాయగా దీపక్ ,శ్రావణ భార్గవి ఆలపించారు . ఈ పాట యుత్ ని విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం .
విశ్లేషణ : మొత్తం 5 పాటలున్న ఈ ఆల్బం లో రెండు పాటలు మాత్రం హైలెట్ అని చెప్పవచ్చు . మొదటి పాట ,చివరి పాట విపరీతంగా అలరించే పాటలు కాగా మిగతావి కూడా వినగా వినగా ఆకట్టుకునే పాటలు . దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం నాన్నకు ప్రేమతో మరింత ప్లస్ కానుంది అని చెప్పవచ్చు .
అనుష్క ఈ సినిమా కోసం 25 కేజీలు బరువు పెరగడం ఏ హీరోయిన్ చేయని సాహసం. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘సైజ్ జీరో’ లో అనుష్క, ఆర్య జంటగా నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామెడీతో మెసేజ్ కలగలిపి తెరకెక్కించారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించారు. ఈ ఆడియో విభిన్న రీతిలో జరిగింది. వచ్చిన ప్రతి అతిధి బరువు చూసి మరీ వేదిక మీదికి ఆహ్వానించారు.
1. సైజ్ జీరో... చిటికెలో సన్నబడు... సన్నజాజిలా.... నీతి మోహన్, రమ్య బెహరా, మౌనిమా, మోహన్ భోగరాజు, నోయల్ సీన్, రాహుల్, ప్రకాష్ రాజ్ పాడారు. అనంత శ్రీరామ్ రాశారు. ఇది టైటిల్ సాంగ్ లిరిక్స్ చాలా బాగున్నాయి…
2. మెల్ల మెల్లగా... అర్జున్ ఆడపల్లి పాడారు. అనంత శ్రీరామ్ రాశారు.
3. సైకిల్... రంజిత, ఆదిత్య పాడారు. అనంత శ్రీరామ్ రాశారు.
4. మెల్ల మెల్లగా కల్లు... స్వేతా పండిట్ పాడారు. అనంత శ్రీరాం రాశారు.
5. సైజ్ సెక్సీ... మోహన్ బోగరాజు పాడారు. శ్రీమణి రాశారు.
6. ఇన్నావా... ఇన్నావా... మధుమిత, రమ్య బెహరా, పాలక్ ముచ్చల్ పాడారు.
కోన వెంకట్ కథ అందించి నిరిమంచిన సినిమా ‘శంకరాభరణం’ ఈ ట్రైలర్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల అనిపిస్తోంది. నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించారు ఈ చిత్రాన్ని. శంకరాభరణం ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ ఆడియో సిడిలను విడుదల చేసి తొలికాపీని హీరోయిన్ సమంతకు అందజేశారు. ఈ చిత్రానికి ప్రవీణ్ సంగీతం అందించారు. 'హిందీలో వచ్చిన 'ఫన్ గయా రే ఒబామా' చిత్రం ఆధారంగా వచ్చిన ఒక ఐడియాతో ఈ కథ రాసినట్లు కోన వెంకట్ చెప్పారు.
1. రాక్ యువర్ బాడీ... ఎస్ ఎస్ తమన్ కోరస్ లిప్సిక, నూతనతో పాడారు. శ్రీజో పదాలు సమకూర్చారు. రాక్ సాంగ్... బాగుంది...
2. పనిసమాగ... గమపని.. పనిస... హే గుడియే కనులు కలిపాకా... సంగీత్…. నొంబియార్, లిప్సిక పాడారు. శ్రీజో పాటను రాశారు. హిందీ, తెలుగు కలిపి ఉన్నాయి లిరక్స్... ఫాస్ట్ గ్రూప్ సాంగ్...
3. బన్నో రాని... కుందనపు గాజులై చేరెనే... రాహుల్ సిప్లింగంజ్, అనురాగ్ కులకర్ని, కోరస్: లిప్పిక, హనీ పాడారు. శ్రీజో పాటను రాశారు. చాలా బాగుంది... మంచి మెలోడీ సాంగ్...
4. తోడాసా... దారూ పీలే బ్రో... బాబా సెహెగల్ పాడారు. సిరశ్రీ పాటను రాశారు.
5. ఘంట...ఘంట... ఘంట బజా తేరీ... ఉమ నేహ పాడారు... శ్రీజో పాట రాశారు. మాస్ పాటలా ఐటమ్ సాంగ్ లా ఉంది...
6. తూరుపే...చూడని... సింథూరం... కార్తీక్, రమ్య బెహ్రా పాడారు. శ్రీజో రాశారు. మంచి మెలోడీ పాట... బాగుంది...
7. డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్..... హేమచంద్ర, నూతన పాడారు. పాటను శ్రీజో రాశారు... ఫాస్ట్ సాంగ్ మామూలుగా ఉంది...
కుమారి 21 ఎఫ్ పోస్టర్లు విడుదలైన నాటి నుంచి ఇందులో ఏదో స్పెషాలిటీ ఉందనిపిస్తుంది. అనుకున్నట్టుగానే... ఇప్పటి యూత్ ప్రేమించిన అమ్మాయి కుమారినా కాదా... అనే డౌట్ లో హీరో పడడంతో పాటు మరేదో సస్పెన్స్ సినిమాలా అనిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ డైరెక్షన్ బాధ్యతల్ని సూర్య ప్రతాప్ కు అప్పగించారు. పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరి సంయుక్తంగా నిర్మించారు. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా నటించారు.
1. మ్యూజిక్ ఓ... కే.....డిస్కో... ఓ.....కే......... నాటి నాటి మేమంతా చాలా నాటి.... లిరిక్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ రాశారు. దేవీశ్రీప్రసాద్ రనినారెడ్డి, రీటా పాడారు. దేవిశ్రీ స్టైల్ పాటలాగే ఉంది.... రాక్... కామెడీ... యూత్ సాంగ్….. బాగుంది.
2. మేఘాలు లే..కున్నా నాపైన ఈ వాన... రాగాలు తీసే నీవల్లేనా... శ్రీమణి, అనంత శ్రీరామ్ కలిసి రాశారు. యాజిన్ నిజార్ పాడారు.... క్లాసికల్ టచ్ ఇచ్చిన మెలోడీ సాంగ్... చాలా బాగుంది...
3. నేమ్ కుమారి... ఏజ్ 21... సెక్స్ ఫిమేల్....బార్ కెళుతుంది... బీరు కొడుతుంది... లవ్ చెయ్యాలా వద్దా... రామాంజనేయులు పాడారు. నరేంద్ర పాడారు. ఇది కూడా యూత్ ట్రెండ్... పాట బాగుంది.
4. బేబి.... బేబి.... నీతో తిరిగిన అడుగే... యూటర్న్ తీసుకుందే... కృష్ణకాంత్ రాశారు. సాగర్ పాడారు. యూత్ సాంగ్ బాగుంది
5. టంకు టక్ టౌ.... అంబర్ పేట సెంటరు నుంచి అమీర్ పేటకు పోయేటప్పుడు.... అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్పు.... చంద్రబోస్ రాశారు. ఎం.ఎం.మానసి పాడారు. మాస్ అండ్ యూత్ సాంగ్ ఫన్నీగా అనిపిస్తోంది.
కిక్ 2 తరువాత రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఆ సినిమా ఫ్లాప్ తో ఈ సినిమాను ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్నాడు రవి తేజ. బెంగాల్ టైగర్ లో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తుండగా బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ 2 చేయి జారడంతో సంపత్ నంది కూడా ఈ సినిమాను ప్రిస్టేజియస్ గా చేస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నమూడవ చిత్రం 'బెంగాల్ టైగర్'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రానికి బీమ్స్ సంగీతం అందించారు.
1. కొడితే సపరేట్ లాంగ్వేజుందిరో... వీడో మెంటలోడు... వీడో తుంటరోడు బెంగాల్ టైగర్ ... శంకర్ మహదేవన్, భార్గవి పిల్లయ్ పాడగా రామజోగయ్య శాస్త్రి రాశారు. అంతా రవి తేజ గురించి రాసినట్టుంది పాట... బాగానే ఉంది...
2. చలో... చలో... మై గాడి చలో... హమేషా వలపుల... ఆసియా....ఖండంలో నీలాంటి గుంట లేదే... నకాష్ అజీజ్, నూతన, భార్గవి పిల్లయ్ పాడగా సంపత్ నంది పాట రాశారు. ఫరవాలేదు...
3. చూపులతో...దీపాలా... దేహముతో చూపాలా... నన్ను చంపెయ్యకే... నవ్వులతో చెరశాల... నడుములో మధుశాల... నన్ను చంపెయ్యకే... విజయ ప్రకాష్ పాడారు... శ్రీమణి రాశారు... మెలొడీగా ఉంది.
4. బాంచనీ కాల్మొక్తనే..... అద్నన్ సామి, భీమ్స్ సిసిరిలియో పాడారు భాస్కర భట్న దేవ్ పవర్ రాశారు. లిరిక్స్ క్లియర్ గా అనిపించడం లేదు... పాట కూడా మామూలుగా ఉంది...
5. పొద్దుకాడ లేవగానే గుళ్ళొ గంట కొట్టినట్టు.... యాడనుండి వచ్చినావురో... రాయె రాయె సిన్నీ... ఇటు రాయె రాయె సిన్నీ... మమతా శర్మ, ఉమా నేహ, సింహ పాడగా సుద్దాల అశోక్ తేజ రాశారు. ఆవరేజ్ గా ఉంది.
అక్కినేని ఫ్యామిలీ నుండి వస్తున్న మూడో తరం హీరో అక్కినేని అఖిల్ గ్రాండ్ ఎంట్రీ ఫిల్మ్ 'అఖిల్' ఆడియోను హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అథిదిగా వచ్చిన ఈ ఆడియో వేడుకను అక్కినేని అభిమానులంతా సూపర్ సక్సెస్ చేశారు. ఆడియో వేడుకలో థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ ఇండస్ట్రీకి మరో పెద్ద హీరో దొరికాడని అన్నారు.
అఖిల్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెంటేషన్ కలిగి ఉన్నాడని అన్నాడు ప్రిన్స్. ఈ సినిమా దర్శకుడు వినాయక్, ప్రొడ్యూసర్ నితిన్ లకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి సినిమా పరిశ్రమకు మరో పెద్ద స్టార్ దొరికాడని కొనియాడాడు.
1. నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్... మన ఈడు... అక్కినేని అక్కినేని... బాగుంది... దివ్య కుమార్, భార్గవి, ఉమ నేహ, మోహన్ పాడారు. కృష్ణ చైతన్య రాశారు ఈ పాటను.
2. హే అఖిల్... రాహుల్ పాండే, అనూప్ రూబెన్స్ పాడారు. కృష్ణ చైతన్య రాశారు.
3. పడేసావే.... పడేసావె నీ మాయలోన నన్ను పడేశావె... కార్తీక్, ఎం.ఎం.మానసి పాడారు. భాస్కరభట్ల రవికుమార్ రాశారు. బాగుంది....
4. జర జర నవ్వరాదె... జరా నవ్వరాదె... దివ్య కుమార్, మోహన భోగరాజు, రాహుల్ శిప్లిగంజ్, ఉమ నేహ పాడారు. భాస్కరభట్ల రవికుమార్ రాశారు.
5. నేనెక్కడుంటే... రంజిత్, శరణ్య, భార్కవి పిల్ల పాడారు. కృష్ణ చైతన్య రాశారు.
పాటలన్నీ లిరిక్స్ క్లారిటీగా అనిపించలేదు. మ్యూజిక్ డామినేట్ చేసినట్టు అనిపించింది.