హోరా హోరీ

July 30, 2015 | 03:51 PM | 8 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
హోరా హోరీ
Movie Name :
హోరా హోరీ
Audio Release Date :
July 29, 2015
Music Director :
కోడూరి కళ్యాణ్
Lyricist:
పెద్దాడ మూర్తి

Songs :

తేజ సినిమాలన్నీ మ్యూజికల్ గా చాలా హిట్టయినవి. రాను రానంటూనే పిల్లదో....  గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా... ఇలా అన్ని సినిమాల్లోనూ ఓ జానపద హిట్ ఇచ్చి చక్కని మెలోడీ సాంగ్స్ అందించారు. ఇంతకు ముందు ఆయన సినిమాలకు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ ఇచ్చారు. హోరా హోరీ సినిమాకు మాత్రం కోడూరి కళ్యాన్ సంగీతం అందించారు. ఆయన అన్ని సినిమాలకు లాగానే ఇది కూడా ఓ ప్రేమ కథ. ఇంతకు ముందు కనిపించని ఓ కొత్త జంట. సినిమా కథా కథనం ఎలా ఉన్నా పాటలు మాత్రం ఆవరేజ్ గా ఉన్నాయి. ఇందులోనూ జానపద బాణీలో ఓ మాస్ సాంగ్ ఉంది.

  1. నీ... ఆహాహా... ఓ హోహో... చాలులే... – పాడినవారు దినకర్-సునీత... మంచి మెలోడీ సాంగ్... బాగుంది...
  2. ముందేలే ముందేలే... అందమెప్పుడూ ముందేలే... ఇందుమతీ అందమంటే నీదేలే... ఎనకాలే మేమేలే... – పాడిన వారు కోడూరి కళ్యాణ్, మోహన్, తేజ... కొద్దిగా ఫన్నీగా...ఉన్న లిరిక్స్ తో ఫాస్ట్ బీట్ సాంగ్ బాగుంది.
  3. చచ్చిపోవాలనుంది నీ కోసం... నీకోసం... నీకోసం... నిన్ను గెలుచుకోవాలని ఉంది నీకోసం నా కోసం మనకోసం... – పాడినవారు దినకర్, శ్రవంతి...ఇది కూడా మెలొడీ సాంగ్
  4. నా గుండె చప్పుడేంటో పిచ్చి పిచ్చిగా కొంపముంచింది ఇప్పుడింత కొత్తగా.. – తేజ, గౌరీప్రియ పాడారు.
  5. ఈ గాలినీ ... నీరునీ... నిప్పునీ... చెప్పనీ... ప్రేమంటే తీపిరా... – కోడూరి కళ్యాన్, నిరంజన పాడారు. వెరైటీగా ఉంది. లిరిక్స్ బాగున్నాయి.
  6. ఒరేయ్ ఒరేయ్... నావాడు నువ్వనీ- తేజా హైమత్ పాడారు... లవ్ సాంగ్ ఫాస్ట్ బీట్ తో నడుస్తుంది...
  7. అటు ఇటు కానొక వయసుంది... వయసును పోలిన మనసుంది... –
  8. నీ సంగతి తెలుసు నాకు అప్పలరాజు – రేవంత్ పాడాడు ఈ పాటను తేజ మార్క్ సాంగ్ ఇది... 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు