బాహుబలి

June 16, 2015 | 01:58 PM | 130 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
బాహుబలి
Movie Name :
బాహుబలి
Audio Release Date :
June 13, 2015
Music Director :
ఎం.ఎం.కీరవాణి
Lyricist:
రామజోగయ్య శాస్త్రి, శివశక్తి దత్త

Songs :

రాజమౌళి సినిమాలే కాదు... సినిమాలోని పాటలూ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే.... తమ్ముడుగారి దర్శకత్వం... అన్నగారు కీరవాణి సంగీతం... రెండూ కలిపితే ఓ దృశ్యకావ్యం... బాహుబలి సినిమాకోసం నిరీక్షణ ఒక ఎత్తు... ఈ సినిమా ఆడియో వేడుక కోసం నిరీక్షించడం ఒక ఎత్తయ్యింది.  ఎట్టకేలకు తిరుపతిలోని వేంకటేశుని సన్నిధిలో పాటలు విడుదల (జూన్ 13) చేశారు. అన్ని పాటలు సందర్భానికి తగినట్టు రాసినవిగా తెలుస్తోంది.... రామజోగయ్య, శివశక్తి దత్త మంచి పదాలను జోడించి... అర్థవంతంగా రాశారు పాటలను. పాటలు అన్నీ కాదు గానీ... యవ్వడంట యవవ్వడం... నిప్పులే శ్వాసగా... అనే రెండు పాటలు ఉద్వేగభరితంగా ఉన్నాయి.  దీవరా... మనోహరా... మమతల తల్లీ... చాలా వినసొంపుగా శ్రావ్యంగా అనిపిస్తున్నాయి....

  1. మమతల తల్లీ... బాహుబలి... లాలల తేలి... సూర్య-యామిని పాడారు. ఇది బ్యాక్ గ్రౌండ్ పాటలా అనిపిస్తుంది. బాగుంది.
  2. బంగారు కలల్ని... గుండెలోతు గాయాల్ని... కడుపులో దాచుకున్న జీవనదీ....గీతా మాధురి పాడింది ఈ పాటను. చాలా హార్ట్ టచింగ్ గా ఉంది...
  3. అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా...... దీవర... దరికి చేర రార... చెలి నీదేరా... దీపు-రమ్య బెహరా పాడారు ఈ పాటను....చాలా మెలొడియస్ గా అనిపించింది.
  4. యవ్వడంట యవ్వడంట... నిన్ను ఎత్తుకుంది... ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది... ఎవ్వరూ కనంది... ఎక్కడా వినంది... శివుని ఆన అయ్యిందేమో... గంగదరికి లింగమే కదిలొస్తానంది... కీరవాణి పాడిన ఈ పాట చాలా చాలా బాగుంది... లిరిక్స్ కూడా చాలా బాగా రాశారు...
  5. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా... జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చకుంటా దొరా...కార్తీక్-దామిని పాడారీ పాటను. ప్రాస బాగా కుదిరి వినసొంపుగా అనిపిస్తుంది.
  6. ఇరుక్కుపో.... హత్తుకొని వీరా... వీరా... కొరుక్కుపో... నీ తనివి తీరా తీరా...తొణక్క బెణక్క... ఉలక్క పలక్క... దుడుక్కు పని చెయ్ రా మనోహరా... మనోహరా... మోహన భోగరాజు-రేవంత్ పాడారు... ఇందులో కూడా ప్రాస ఎక్కువగా ఉంది... రాజనర్తకి పాటేమో ఇది అనిపిస్తోంది....
  7. నిప్పులే శ్వాసగా... గుండెలో ఆశగా తరాల ఎదురు చూపులో ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు.. రాజ్యమాఉలికి పడు... కీరవాణి పాడిన ఈ పాట ఉద్వేగభరితంగా అనిపిస్తోంది...
  8. దీవర... (ఇంగ్లీష్ వర్షన్)... రమ్య బెహరా, ఆదిత్య పాడారు. 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు