Songs :
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1942 ఏప్రిల్ 6న విశాఖపట్నంలోని రెండువేల టన్నుల మందుగుండు సామాగ్రితో వెళ్తున్న నౌకను లక్ష్యంగా చేసుకొని జపాన్ వాళ్లు ఆ బాంబును సంధించారు. అయితే.. అదృష్టవశాత్తూ అది పేలలేదు. లేదంటే చరిత్ర మర్చిపోలేని చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిన సంఘటన జరిగేది. ఆ బాంబు చూశాక క్రిష్ లో రేకెత్తిన ఆలోచన ఈ కంచె సినిమా. 'వేదం'ను తమిళంలో 'వానం' పేరుతో తెరకెక్కిస్తున్నప్పుడు లొకేషన్లకోసం కారైకూడి వెళ్ళినప్పుడు అక్కడ ఓ చెట్టియార్ ఇంట్లో సైనికులకు సంబంధించిన చిత్రపటాలు చూసి కూడా కంచె సినిమాకు ఓ రూపు తీసుకు వచ్చాడు క్రిష్. ఇంక ఇందులో పాటల విషయానికి వస్తే...
1. తోం తోం తోం తనతోం... ఇటు ఇటు ఇటు అని చిటికెటుల ఎవ్వరివో... పాట చాలా మెలొడియస్ గా ఉంది.
2. ఊరు ఏరయింది, ఏరు హోరెత్తింది... అందరూ కలిసి పాడుకునే హుషారైన పాట చాలా బాగుంది.
3. కనుపాపలోని ఈ కలలు కంటి... శాడ్ సాంగ్ కు క్లాసికల్ టచ్ ఇచ్చారు చాలా బాగుంది.
4. భగ భగ మని ఎగసిన... ధగ ధగ మని మెరిసిన ... ఎమోషనల్ సాంగ్ పోరాట నేపథ్యం కనిపిస్తుంది.
5. విద్వేశం పాలించె ... యుద్ధ నేపథ్యంలో సాగుతున్నట్టుంది
6. మట్టితోటి చుట్టరికం... ఏ కళ్యాణం కోసం... ఇది కూడా శాడ్ సాంగ్ సాహిత్య పరంగా చాలా బాగుంది.
Post Your Comment