కేరింత

May 26, 2015 | 04:39 PM | 63 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
కేరింత
Movie Name :
కేరింత
Audio Release Date :
May 25, 2015
Music Director :
మిక్కీ జె మేయర్
Lyricist:
రామ జోగయ్య శాస్త్రి

Songs :

శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందించారు. సాయి కిరణ్ అడవి దర్శకుడు.. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం (మే 25న) హైదరాబాద్ లో జరిగింది. సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్విలతోపాటు మరికొందరు కొత్త నటీనటులతో దిల్ రాజు తీసిన యూత్ మెచ్చే చిత్రం కేరింత. ఇందులోని పాటలు బాగున్నాయి. కానీ ఇంతకు ముందు ఇలాంటి పాటలు విన్నట్టుగా అనిపిస్తున్నాయి....

1. రైట్ నౌ మొదలైంది నా కథ... కేరింత... (టైటిల్ సాంగ్) పాడిన వారు హరి చరణ్... ఒక మాదిరిగా ఉంది.
2.  వెన్నెల... వెన్నెల... తొలకరి వానలా...త లపులు నీకలా... తడిపెను మిలమిల... మిల మిల... మెరుపుల... పాడిన వారు కార్తీక్... మాధుర్య ప్రధానమైన పాట ఇది బాగుంది...
3. జగేదేక   వీర... ధీర... జాలేస్తుంది నీపైనా... పనిమాల వెనకాలొస్తే. పడిపోతానా నేనైనా...నన్ను వదిలేట్టు చేస్తా... అంజనా సౌమ్య పాడారు.. ఇది వెంట పడుతున్న అబ్బాయిని అమ్మాయి టీజ్ చేస్తున్నట్టుగా ఉంది.... పాట బాగుంది...

4. ఓహో...ఓహో... గెట్ రెడీ టచ్ చేద్దాం నింగి నక్ష్రతాన్ని... ఫుల్ టూ పండుగే పండుగ.. దిల్ సేబోల్.... థ్యాంక్స్ టూ జిందగీ.... రాహుల్ నంబియార్, దీపు, శిల్ప పాడారు... లైఫ్ ను ఎంజాయ్ చేసే కుర్రకారు పాడుకున్న పాటలా ఉంది... ఫరవాలేదు...

5. తలచినచో జరుగుననీ... కలనిజమై దొరకునని అరెరెరె... అనుకలేదే ఎపుడూ...పలికెనులే నాలో సుమగంధాల తేలింది గాలంత... వాన విల్లల్లే మారింది నేలంతా...మౌనరాగాలు పాడింది.. మనసంతా... నమ్మనా నేనీ వింత... కార్తీక్ పాడారు ఈ పాటను... ఇది బాగా విన్న పాటలా అనిపిస్తోంది... (హాపీడేస్ పాట) బాగుంది.... కానీ కొత్తదనం లేదుగా....

6. ఏ కథ టు పరుగెడుతుందో తెలియదే... ఏ క్షణం పుడేం చేస్తుందో...జోనితా గాంధీ పాడారు. ఇది కూడా విన్న పాటలా ఉంది....లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్ లాగా....

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు