Songs :
కుమారి 21 ఎఫ్ పోస్టర్లు విడుదలైన నాటి నుంచి ఇందులో ఏదో స్పెషాలిటీ ఉందనిపిస్తుంది. అనుకున్నట్టుగానే... ఇప్పటి యూత్ ప్రేమించిన అమ్మాయి కుమారినా కాదా... అనే డౌట్ లో హీరో పడడంతో పాటు మరేదో సస్పెన్స్ సినిమాలా అనిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ డైరెక్షన్ బాధ్యతల్ని సూర్య ప్రతాప్ కు అప్పగించారు. పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరి సంయుక్తంగా నిర్మించారు. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా నటించారు.
1. మ్యూజిక్ ఓ... కే.....డిస్కో... ఓ.....కే......... నాటి నాటి మేమంతా చాలా నాటి.... లిరిక్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ రాశారు. దేవీశ్రీప్రసాద్ రనినారెడ్డి, రీటా పాడారు. దేవిశ్రీ స్టైల్ పాటలాగే ఉంది.... రాక్... కామెడీ... యూత్ సాంగ్….. బాగుంది.
2. మేఘాలు లే..కున్నా నాపైన ఈ వాన... రాగాలు తీసే నీవల్లేనా... శ్రీమణి, అనంత శ్రీరామ్ కలిసి రాశారు. యాజిన్ నిజార్ పాడారు.... క్లాసికల్ టచ్ ఇచ్చిన మెలోడీ సాంగ్... చాలా బాగుంది...
3. నేమ్ కుమారి... ఏజ్ 21... సెక్స్ ఫిమేల్....బార్ కెళుతుంది... బీరు కొడుతుంది... లవ్ చెయ్యాలా వద్దా... రామాంజనేయులు పాడారు. నరేంద్ర పాడారు. ఇది కూడా యూత్ ట్రెండ్... పాట బాగుంది.
4. బేబి.... బేబి.... నీతో తిరిగిన అడుగే... యూటర్న్ తీసుకుందే... కృష్ణకాంత్ రాశారు. సాగర్ పాడారు. యూత్ సాంగ్ బాగుంది
5. టంకు టక్ టౌ.... అంబర్ పేట సెంటరు నుంచి అమీర్ పేటకు పోయేటప్పుడు.... అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్పు.... చంద్రబోస్ రాశారు. ఎం.ఎం.మానసి పాడారు. మాస్ అండ్ యూత్ సాంగ్ ఫన్నీగా అనిపిస్తోంది.
Post Your Comment