నాన్నకు ప్రేమతో...

December 29, 2015 | 05:36 PM | 9 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
నాన్నకు ప్రేమతో...
Movie Name :
నాన్నకు ప్రేమతో...
Audio Release Date :
December 27, 2015
Music Director :
devi sri prasad
Lyricist:
దేవిశ్రీ ప్రసాద్ ,భాస్కర భట్ల , చంద్రబోస్

Songs :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ రిలయన్స్ సంస్థ తో కలిసి నిర్మించిన చిత్రం ''నాన్నకు ప్రేమతో ''. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు . దేవిశ్రీ ప్రసాద్ ,భాస్కర భట్ల , చంద్రబోస్ లు రాసిన పాటలు ఎన్టీఆర్ అభిమానులను అలరించేలా ఉన్నాయా లేదా అన్నది తెలియాలంటే పాటల విశ్లేషణ లోకి వెళ్ళాల్సిందే .

మొదటి పాట ; ఫాలో ...... ఫాలో అంటూ సాగే పాట ఈ ఆల్బం లో మొదటి పాట కాగా ఈ పాటని సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ రాయడం విశేషం ,ఇక ఈ పాటని ఎన్టీఆర్ పాడటం మరో విశేషం . దేవిశ్రీ ఎంత కసిగా ఈ పాట రాసాసో అంతే కసిగా ఎన్టీఆర్ కూడా పాడిన ఈ పాట నాన్నకు ప్రేమతో ఆల్బం కే హైలెట్ .

రెండవ పాట : నా మనసు నీలో అంటూ సాగే ఈ పాటని భాస్కర భట్ల రాయగా డిఎస్పీ ,షర్మిల ఆలపించారు . రొమాంటిక్ గా సాగే ఈ పాట మెలోడీ ప్రధానంగా సాగింది .

మూడవ పాట : చంద్రబోస్ రాసిన ఈ పాట ఎన్టీఆర్ అభిమానులను విపరీతంగా అలరించడం ఖాయం ఎందుకంటే గతకొంత కాలంగా ఎన్టీఆర్ ని కొంతమంది కావాలనే దూరం పెడుతున్నారు దాంతో ఎన్టీఆర్ ని పక్కన పెట్టడం జరగోచ్చేమో కానీ తొక్కడం మాత్రం ఎవరి వల్లా కాదని ఎంత తొక్కితే బంతి లాగ అంత పైకి వచ్చే శక్తి ఉందని చాటి చెప్పి మనోస్తైర్యం నింపే పాట ఇది . ఇక ఎన్టీఆర్ కు కూడా బాగా నచ్చి ఉండొచ్చు . డోంట్ స్టాప్ అంటూ సాగే ఈ పాటని రఘు దీక్షిత్ ఆలపించాడు .

నాల్గవ పాట : లవ్ మీ ఎగైన్ అంటూ సాగే ఈ పాటని చంద్రబోస్ రాయగా సూరజ్ సంతోష్ ఆలపించాడు . ప్రేమ లోని మాధుర్యాన్ని వర్ణించే ఈ పాట ఫ్యాన్స్ ని అలరించడం ఖాయం .

ఇక ఆల్బం లో చివరి పాట ''లవ్ దెబ్బ '' అంటూ వచ్చే ఈ పాటని చంద్రబోస్ రాయగా దీపక్ ,శ్రావణ భార్గవి ఆలపించారు . ఈ పాట యుత్ ని విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం .

విశ్లేషణ : మొత్తం 5 పాటలున్న ఈ ఆల్బం లో రెండు పాటలు మాత్రం హైలెట్ అని చెప్పవచ్చు . మొదటి పాట ,చివరి పాట విపరీతంగా అలరించే పాటలు కాగా మిగతావి కూడా వినగా వినగా ఆకట్టుకునే పాటలు . దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం నాన్నకు ప్రేమతో మరింత ప్లస్ కానుంది అని చెప్పవచ్చు .

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు