కృష్ణగాడి వీర ప్రేమగాథ

February 11, 2016 | 02:47 PM | 2 Views
కృష్ణగాడి వీర ప్రేమగాథ
Movie Facebook Page :
Movie Name :
కృష్ణగాడి వీర ప్రేమగాథ
Friday Release Date :
2016-02-12
Actors/Actress/Director :

నాని, మెహ్రీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, బేబి మోక్ష తదితరులు

సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

Synopsis :

గ‌తేడాది ఎవ‌డే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్ చిత్రాలతో హిట్స్ కొట్టాడు నాని. ముఖ్యంగా భ‌లే భ‌లే మగాడివోయ్ సినిమా ఏకంగా 40 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచేలా ఛేసింది. క్లీన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రం  నాని కెరీర్‌ను ఒక్క‌సారిగా ట‌ర్న్ చేసింది. దీంతో తర్వాత వచ్చే సినిమాపై అందరికీ అంచనాలు పెరిగాయి. ‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడుగా పరిచయమైన హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో  ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో నాని పలకరించనున్నాడు.

సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకొని ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. హీరో నాని బాల‌య్య‌కు అభిమానిగా క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో ఓ సున్నితమైన ప్రేమ‌కథను మేలవించి ఆసక్తిగా తెరకెక్కించాడంట దర్శకుడు హను రాఘవపూడి.

భారీ అంచనాల నడుమ నాని కెరీర్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. మరి బాల‌య్య అభిమానిగా నాని ఎలా మెప్పించాడో తెలియాలంటే రివ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు