నారా రోహిత్, లతా హెగ్డే, కబీర్ సింగ్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సుదర్శన్, అలీ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్, కథ: ఎ.ఆర్.మురుగదాస్, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
టాలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చేవాళ్లలో చాలా మంది హీరోలు మాస్ ఇమేజ్ కోసమే ట్రే చేయడంతో పాటు ఫంక్తు కమర్షియల్ సినిమానే ఎంచుకుంటారు. అయితే నారా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ మాత్రం పూర్తి విరుద్ధం. బాణం-సోలో – ప్రతినిధి – రౌడీఫెలో – అసుర వీటిని బట్టి చెప్పొచ్చు రోహిత్ ఎంపిక ఎలాంటిదో. మామూలుగా మన హీరోలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో బోర్ కొట్టేసి ఎప్పుడైనా ఓ వైవిధ్యమైన సినిమా చేయాలని చూస్తారు. అయితే నారా రోహిత్ మాత్రం వరుసగా డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతున్నాడు.
గతంలో ఒక్కడినే అనే చిత్రాన్ని తీసినప్పటికీ అది కాస్త బొర్లాపడింది. అయితే ఈసారి తీసే మాస్ సబ్జెక్టుతో ఖచ్ఛితంగా హిట్ కొడతానంటున్నాడు. తమిళ్ లో హిట్టయిన మాన్ కరాటే చిత్రాన్ని తుంటరిగా తెరకెక్కించాడు గుండెల్లో గోదారి, జోరు దర్శకుడు నాగేంద్ర కుమార్. సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ స్టోరీ అందించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ శుక్రవారమే విడుదల కానున్న ఈ చిత్ర ఫలితం ఏంటో మరికొద్ది గంటల్లో తెలియనుంది.
Post Your Comment