నటిగా నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తా

November 04, 2015 | 02:18 PM | 2 Views
temper
Artist Name :
అలియా భట్
Interviewed By :
నీహార్ ఆన్ లైన్
Interview Date :
November 04, 2015

Interview Details :

మొదటి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో కుర్రాళ్ల మతులు చెదరగొట్టింది కుర్ర హీరోయిన్ అలియభట్. ఆ చిత్రంలో ఒక్క బికినీ ఆమే ఫేట్ నే మార్చేసింది. బికినీ అందాలతో పిచ్చెక్కిచ్చింది. తర్వాత రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన హైవే సినిమాతో మరో విజయం దక్కించుకుంది. 2 స్టేట్స్ - హంప్టీ శర్మాకి దుల్హానియా సినిమాలతో మెప్పించింది. ఇటీవల విడుదలైన షాందార్ లో పింక్ కల్ ర్ టూ పీస్ వేసి మళ్లీ రచ్చ చేసింది. ప్రస్తుతం సొగసరి నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంది. అవి మీకోసం...

మీ గ్లామర్ సీక్రెట్?

నేను  చాలా క్యూట్ గా  యాక్టివ్ గా ఉంటానని అందరూ అంటుంటారు. కానీ  నాకు బద్దకం ఎంత ఎక్కువో వాళ్లకు తెలీదు పాపం. నిద్రపోవడానికి  నేనిచే ఇంపార్టెన్స్ మరొకరెవ్వరు ఇవ్వరేమో. సినిమా  షూటింగ్ లేనప్పుడు  పదిహేను గంటలు ఏక ధాటిగా నిద్రపోతుంటాను. తినడం పడుకోవడమే పనిగా పెట్టుకుంటాను. గ్లామర్ కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటాను.  గ్లామర్ పెరగడానికి నిద్ర కూడా చాలా అవసరం. బహుషా నా అందం రహస్యం అదే అయి ఉండొచ్చు.

మీ యాక్టింగ్ లో మైనస్ లు మీకు తెలుస్తాయా?

బాగా నటిస్తానని చాలామంది మెచ్చుకుంటుంటారు. అయితే నాకు ఏడవడం సరిగ్గా రాదు.  నా ఏడుపు నాకే ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ పరిణీతి చోప్రా ట్రాజెడీ సీన్ లలో ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో. అందుకే ‘ఇషక్ జాదే’ సినిమా చూశాక తన దగ్గరకు వెళ్లి... ‘నాకు నీ అంత బాగా ఏడవడం నేర్పించు’ అని అడిగాను.

బాయ్ ఫ్రెండ్ గురించి ఏమైనా కలలు?

అందరూ తన లవర్  అందంగా ఉండాలి అర్థం చేసుకునేవాడై ఉండాలి అని చెబుతుంటారు కదా! నాకు మాత్రం నా లవర్ ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. మంచి వాసన నన్ను వెంటనే అట్రాక్ట్ చేస్తుంది. అబ్బాయిల విషయంలో కూడా నేను త్వరగా పడిపోయేది దానికే. ఇంకో సీక్రెట్ చెప్పనా? నేను ఎప్పుడూ మగాళ్ల పర్ ఫ్యూమ్సే వాడతాను. పైగా నెలకొకటి మారుస్తుంటాను!

మీకు బాగా గుర్తుండి పోయే సంఘటన?

నాకు గుర్తులేదు. కానీ, ఆ ఘటన నన్ను ఇప్పటికీ భయపెడుతూ ఉంటుంది. నాకు మూడేళ్లున్నప్పుడు నాన్న గారు (దర్శకుడు మహేష్ భట్) తన సినిమా ఒకటి సేషెల్స్ లో తీయాలని ప్లాన్ చేశారు. తాను ఎలాగూ వెళ్తున్నాను కదా అని ఫ్యామిలీని కూడా వెంట తీసుకెళ్లారు. అప్పుడు నేను తప్పిపోయానట. హోటల్ రూమ్ నుంచి నడచుకుంటూ అలా అలా బయటికి వెళ్లిపోయానట. కంగారుపడి వెతికితే ఓచోట రోడ్డుమీద నడుస్తూ కనిపించానట. అప్పుడు వాళ్లకి దొరక్కపోయి ఉంటే ఇప్పుడు నేనెక్కడుండేదాన్నో.

మీ ఫేవరెట్ ఫుడ్?

జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పడి చస్తాను. రోజులో ఎన్నిసార్లు తినమన్నా ఎన్ని తినమన్నా తినేస్తాను. అయితే నేనేదీ వేడిగా ఉంటే తినలేను. కాఫీ దగ్గర్నుంచి ప్రతి ఫుడ్ నీ చల్లారబెట్టుకునే తింటాను. పైగా ఏం తిన్నా అందులో పెరుగు కలుపుకోవడం ఇష్టం నాకు. చైనీస్ - ఇటాలియన్ - మెక్సికన్... తినేది ఏదైనా అందులో పెరుగు కలిపేస్తా. నేనలా చేస్తుంటే నా ఫ్రెండ్సంతా ముఖాలు అదోలా పెడతారు. అయినా నేను మానను.

ఇంట్లో వాళ్లకి మీలో నచ్చనిది?

బయటి నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే నేను చేసే మొదటి పని ఏంటో తెలుసా? కాళ్లు కడుక్కోవడం. ఆ పని చేశాకే ఏ పనైనా చేస్తా. దీంతో ఇంట్లో వాళ్లు కాస్త అతి చేస్తూన్నానని తిడతారు.

మీకు బాగా ఇష్టమైనది?

నాకు విమాన ప్రయాణాలంటే కూడా యమా ఇష్టం. గాలిలో తేలేటప్పుడు మనసు కూడా ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది. అదో గొప్ప అనుభూతి. ఆ అనుభూతి కోసం ఎప్పుడూ అలా విమానాల్లో ప్రయాణిస్తూనే ఉండిపొమ్మన్నా ఓకే నాకు ఇష్టమే.

మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?

నేను హిందీ చాలా బాగా మాట్లాడతానని కొందరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. వాళ్లకు అలా ఎందుకనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే... నాకు హిందీ అంత బాగా ఏమీ రాదు. స్కూల్లో హిందీ వక్తృత్వ పోటీల్లో ఎప్పుడూ ఓడిపోయేదాన్ని. మరి నా హిందీ బాగోవడమేమిటో. నా లైఫ్ లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ హైవే లో నా నటన చూసి నాన్నగారు మెచ్చుకోవటం.

యూత్ ఐకాన్ గా మీరూ ఉన్నారు... మీ కామెంట్

నేను అస్తమానం నా స్టయిల్ ను మార్చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఒకేలా ఉండటం నాకు నచ్చదు. ఏ కొత్త స్టయిల్ కనిపిస్తే దాన్ని ఫాలో అయిపోతుంటా. ఒక్కోసారి అది నప్పక నాకు నేనే విచిత్రంగా కనిపిస్తాను. దాంతో దెబ్బకి దాన్ని మార్చేసి మరో కొత్త స్టయిల్ మొదలుపెడతాను. అలాగే పుస్తకాలు కూడా బాగా చదువుతా. మార్కెట్ లోకి వచ్చే కొత్త పుస్తకాలన్ని సేకరిస్తా. అయితే ఏ రోజు కూర్చుని చదివిన సందర్భాలు లేవు. అలాగే నటిగా నన్ను నలుగురు గుర్తించాలి అన్న ఆరాటం ఉండటం సహజం. అది నాకు కాస్త అతిగానే ఉంది. అందుకోసం ఎంతకైనా తెగిస్తా అంటూ సెలవు తీసుకుంది అందాల అలియా.

goldnsilver

తాజా వార్తలు