జ్యోతిల‌క్ష్మీ కోసం 11 కిలోలు త‌గ్గా

June 09, 2015 | 04:23 PM | 10 Views
temper
Artist Name :
ఛార్మీ
Interviewed By :
మోహన్
Interview Date :
June 09, 2015

Interview Details :

ద‌శాబ్దం దాటినా హీరోయిన్‌గా చ‌లామ‌ణి అవుతున్న నేటి త‌రం నాయిక‌ల్లో ఛార్మి ఒక‌రు. ఆమె న‌టిగా ఎంట్రీ ఇచ్చి క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు మాట్లాడ‌టం నేర్చుకుని చంద‌మామ సినిమాలో కాజ‌ల్ కి డ‌బ్బింగ్ కూడా చెప్పింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో ఐట‌మ్ సాంగ్‌ల్లోనూ న‌టించింది. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్ర‌ల్లోనూ న‌టించింది. తాజాగా హీరోయిన్‌గా కొన‌సాగుతూనే... నిర్మాత‌గానూ పాదం మోపింది. ఆమె స‌మ‌ర్పిస్తున్న సినిమా జ్యోతిల‌క్ష్మీ ఈ నెల 12న విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి ఛార్మితో ఇంట‌ర్వ్యూ...

ఎలా ఉండ‌బోతోంది జ్యోతిల‌క్ష్మీ?

- చాలా బావుంటుంది. ఎవ‌రూ ఊహించ‌న‌టువంటి సినిమా.

మీ పాత్ర ఎలా ఉంటుంది?

- ఇందులో వేశ్య‌గా న‌టించాను. అలాగ‌ని వ‌ల్గ‌ర్‌గా క‌నిపించ‌ను. హ్యాపీగా, ఫ‌న్నీగా, నాటీగా ఉండే అమ్మాయి క‌థ‌. రొమాన్స్ ఉంటుంది.

అంటే మీరు రొమాంటిక్ హీరోయిన్ గా క‌నిపిస్తారా?

- రొమాన్స్ ఉంటుంది. అలాగే త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌లపై అమ్మాయి చేసే పోరాటం కూడా ఉంటుంది. రెండిటికీ సంబంధించిన క‌థ ఇది

జ్యోతిలక్ష్మీ ఎలాంటి ఇంపాక్ట్ ని మిగులుస్తుంది?

- జ్యోతిల‌క్ష్మీ అంటే ఇప్ప‌టిదాకా ఏదో ఒక ఒపీనియ‌న్ ఉండ‌వ‌చ్చు. కానీ ఇక‌పై అది వేరేలా ఉంటుంది. ఇలాంటి కూతురు కావాల‌ని ప్ర‌తి మ‌గాడూ కోరుకుంటాడు. ఇలాంటి భార్య కావాల‌ని అనుకునేవారు కూడా ఉంటారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఇక‌పై తెలుగు ఇళ్ల‌ల్లో జ్యోతిల‌క్ష్మీ అనే పేరు వినిపిస్తుంది.

న‌టిగా హ్యాపీనా?  నిర్మాత‌గా హ్యాపీనా?

- నిర్మాత‌నైపోవాల‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో కేజువ‌ల్‌గా అలా కుదిరిందంతే. ఈ సినిమాతో నిర్మాణం గురించి చాలా విష‌యాలు తెలుసుకున్నాను. ప్రీప్రొడ‌క్ష‌న్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, మెయిన్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ తెలిసొచ్చాయి. నిజానికి అది కొంచెం టెన్ష‌న్ జాబ్‌. అయినా ఎంజాయ్ చేశాను. సి.క‌ల్యాణ్‌గారు, పూరి జ‌గ‌న్నాథ్‌గారు నాకు ఫుల్ ఫ్రీడ‌మ్ ఇచ్చారు.

ఇందులో బైక్ రైడ్ చేసిన‌ట్టున్నారు?

- అవునండీ. చిన్న‌ప్ప‌టి నుంచీ నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. మా పేరెంట్స్ మా బ్ర‌ద‌ర్ కి బైక్ కొనిస్తే వాళ్లెవ‌రూ ఇంట్లో లేన‌ప్పుడు నేను ఆ బైక్ ని న‌డిపేదాన్ని. ఈ సినిమాలో బుల్లెట్ న‌డిపే సీన్ ఉంద‌ని పూరిగారు ఫోన్ చేసి చెప్పిన‌ప్పుడు చాలా సంతోషించాను. షూటింగ్ అయిపోయిన త‌ర్వాత కూడా బుల్లెట్ నడుపుతూనే క‌నిపించాను.

ఈ సినిమాలో రెండు వేరియేష‌న్స్ ఉన్న రోల్‌ను చేశార‌ట క‌దా?

- నిజ‌మే. జ్యోతిల‌క్ష్మీ పాత్ర‌కు రెండు షేడ్స్ ఉంటాయి. అందులో పాత్ర కోసం దాదాపు 11 కిలోలు బ‌రువు త‌గ్గాను. తొలి సగంలో వ‌చ్చే పాత్ర‌కు, రెండో స‌గంలో వ‌చ్చే పాత్ర‌కు చాలా తేడా ఉంటుంది.

ఓ నిర్మాత‌గా పూరి జ‌గ‌న్నాథ్ ఎలాంటి ద‌ర్శ‌కుడు అనిపించింది?

- త‌ను యూనిక్ డైర‌క్ట‌ర్‌. స్క్రిప్ట్ కి సంబంధించిన ఏ ప‌నినీ షూటింగ్ మొద‌లుపెట్టాక పెట్టుకోరు. స్క్రిప్ట్ పూర్త‌యితేనే సెట్స్ లోకి వెళ్తారు. ఒక సినిమా చేస్తున్న‌ప్పుడే మ‌రో సినిమా గురించి ఆలోచిస్తారు. అంత యూనిక్ ప‌ర్స‌నాలిటీ ఆయ‌న‌ది.

సీక్వెల్ చేస్తార‌ని వార్త‌లొస్తున్నాయి..

- నిజ‌మే. చేయాల‌నుకుంటున్నాం. కాక‌పోతే ఎప్పుడ‌నేది పూరిగారి తీరిక‌ని బ‌ట్టి ఉంటుంది. స్క్రిప్ట్ సిద్ధంగానే ఉంది. క‌ల్యాణ్‌గారు కూడా ఓకే చెప్పేశారు.

మీ త‌దుప‌రి సినిమాలేంటి?

- ప్ర‌స్తుతం దృష్టి మొత్తం జ్యోతిల‌క్ష్మీ మీద‌నే ఉంది.

goldnsilver

తాజా వార్తలు