డైనమెట్ ను ఆయన్ని దృష్టిలో పెట్టుకునే తీశాను

September 03, 2015 | 09:46 AM | 7 Views
temper
Artist Name :
దేవా కట్ట
Interviewed By :
నీహార్ ఆన్ లైన్
Interview Date :
September 02, 2015

Interview Details :

వెన్నెలతో యువ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్థానంతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న చైతూ ను ఆటోనగర్ సూర్య గా ఓ మాస్ ఇమేజ్ ఉన్న హీరోగా చూపించాడు. విలక్షణమైన తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు దర్శకుడు దేవాకట్టా. డైలాగుల్లో ఉండే ఎమోషన్, వాటిల్లో ఉండే డెప్త్ అతడి ఆయుధాలు. ఇప్పుడు మంచు విష్ణు హీరోగా డైనమెట్ చిత్రంతో రేపు (సెప్టెంబర్ 4)న  మన ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ కి దేవా కట్టా చెప్పిన విషయాలు...

డైనమెట్ కథ ఏంటి?

సమకాలీన సమస్యని ప్రతిబింబించే కథాంశమిది. డైనమైట్ కి తమిళ మాతృకతో పోలికే ఉండదు. ఒక అమ్మాయి సమస్యని తన సమస్యగా భావించి హీరో ఏం చేశాడన్నదే సినిమా. ఎనిమీ ఆఫ్ ది స్టేట్ మిషన్ ఇంపాజిబుల్ తరహా చిత్రమిది. అద్భుతమైన రన్ తో ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రను ఎంతో ప్రేమతో తీర్చిదిద్దా. జేడీ అవ్వడం వల్లే అలా చేశానేమో! విష్ణుకి జేడీకి మధ్య మైండ్ గేమ్ తరహా సన్నివేశాలు సినిమాకే హైలైట్.

రీమేక్ చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?

ఆటోనగర్ సూర్య తర్వాత కొత్తగా కథలు రాసుకుంటున్న టైమ్ లో అరిమానంబి రీమేక్ చేద్దాం.. చూడు అన్నారు విష్ణు. అందులో క్యారెక్టరైజేషన్ నచ్చింది. అయితే అందులోని ఎలిమెంట్స్ ఉపయోగించుకుని నేను కొత్తగా రాసుకున్నా. అవసరమైనంత స్వేచ్ఛనిచ్చాడు విష్ణు. పక్కా స్క్రిప్టు ప్రణాళికతో 56రోజుల్లో పూర్తి చేశాను. మనసుకు చేరువైన చిత్రమిది. వాస్తవానికి రీమేక్ చేయాలనుకోను. కానీ ఇది నచ్చి చేసిన సినిమా.

విష్ణుని కొత్త కోణంలో చూపిస్తున్నట్లున్నారు?

అవును.. కాలేజీ చదువులు పూర్తయ్యాక ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రాలు స్నేహితులతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే ఓ కుర్రాడి జీవితంలో మలుపులే సినిమా.

హీరోయిన్ క్యారెక్టర్ గురించి?

హీరోయిన్ ఒరియంటల్ చిత్రం కావటంతో కష్టపడి వెతికాం. ఆటైంలో విష్ణు ప్రణీత పేరు సజెస్ట్ చేశాడు.  తెలుగమ్మాయి కాకపోయినా సినిమా కోసం బాగా కష్టపడింది. ఇంతకు ముందు సినిమాలకంటే ఇందులో పరిణితి చెందిన నటన కనబరుస్తుందని ఖచ్ఛితంగా చెబుతున్నా.

విలన్ గా జేడీ చక్రవర్తి ఎంపిక చేయడంలో ఉద్ధేశం?

నాకు కథ లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నప్పుడు మదిలో మెదిలిన రూపం జేడీయే. బహుశా ఆయన కోసమే ఈ చిత్రం నా చేతికొచ్చిందేమో అనిపించింది. షూటింగ్ టైంలో కూడా నా కాంసంట్రేషన్ మొత్తం ఆయనపైనే ఉంది. పవర్ ఫుల్ గా ఆయన క్యారెక్టర్ ని తీర్చి దిద్దాను.

మొత్తం చిన్న సినిమాలే చేస్తున్నారే?

పెద్ద హీరోతో పెద్ద సినిమాల విషయంలో దర్శకుడు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటే తప్ప సినిమాలకు పరాజయాలు ఉండవు. కానీ చిన్న సినిమాకి అలా కాదు. ప్రతి క్షణం ఆత్రుతగా పనిచేయాలి. నాకు అలా కష్టపడటం ఇష్టం.

మరి ఆటోనగర్ సూర్య టైంలో మీపై వచ్చిన ఆరోపణలు?

ఆటోనగర్ సూర్యకి కేవలం 9కోట్లు మాత్రమే ఖర్చయ్యింది. కానీ 25కోట్లు ఖర్చయ్యిందని ప్రచారం చేసి దర్శకుడినైన నా సామర్థ్యాన్ని లూటీ చేశారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేయడమే నా సామర్థ్యం.

బాహుబలికి డైలాగ్ లు రాశారు కదా?

బాహుబలికి ఒకే ఒక్క సన్నివేశానికి మాటలు రాశా. కానీ రాజమౌళి పెద్ద క్రెడిట్ ఇచ్చారు. నా ప్రస్థానం నచ్చి ఆయన మెచ్చుకున్నారు. ఆటోనగర్ సూర్య టీజర్ లో డైలాగ్ ని మెచ్చుకున్నారు.

అప్ కమింగ్ చిత్రాల గురించి?

ప్రస్తుతం నాలుగు కథలున్నాయి. వాటికి ఎవరు సరిపడితే వారినే ఎంపిక చేసుకుంటాను అంటూ సెలవు తీసుకున్నారు.

goldnsilver

తాజా వార్తలు