డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘అలౌకిక’ ప్రేక్షకులను ఆలరిస్తుంది

April 16, 2015 | 05:33 PM | 26 Views
temper
Artist Name :
దర్శకుడు చల్లా భానుకిరణ్
Interviewed By :
మోహన్
Interview Date :
April 16, 2015

Interview Details :

మీడియా రంగం నుండి సినిమా రంగానికి వచ్చి తన సత్తా చాటుతున్న వారిలో డైరెక్టర్ భానుకిరణ్ చల్లా ఒకరు. తొలి సినిమా ‘పంచముఖి’ అనే డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు చేరువైన ఈ యంగ్ డైరెక్టర్ నుండి వస్తోన్న మరో డిఫరెంట్ మూవీ ‘అలౌకిక’. శ్రీ హయగ్రీవ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘అలౌకిక’. మనోజ్ నందం, మిత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో మాదాల రవి, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. డా.జె.ఆర్.రావ్ నిర్మాత. భానుకిరణ్ చల్లా దర్శకుడు. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రేక్షకులకు కావాల్సింది. మంచి కథ, కథనం అది ఉంటే సినిమాలకు ఆదరణ తగ్గదంటున్న డైరెక్టర్ భానుకిరణ్ తో ఇంటర్వ్యూ.....

నేపథ్యం..?

- నేను బేసిక్ గా మీడియా రంగానికి చెందిన వ్యక్తిని. ఈటీవీ, జెమిని టీవీ, వనిత టీవీల్లో చాలా ప్రాజెక్ట్స్ ను హ్యండిల్ చేశాను. మనసులో దర్శకుడిని కావాలనే కోరిక బలంగా ఉండటంతో సినిమా రంగం వైపు అడుగులు పడ్డాయి. ఇక మీకు తెలిసిన విషయాలే. పంచముఖి అనే సినిమాతో దర్శకుడిగా మారాను.

అలౌకిక సినిమా ఎలా రూపు దాల్సింది..?

-‘పంచముఖి’ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నప్పుడే నిర్మాత జి.ఆర్.రావ్ గారు కథ విన్నారు. కథ ఆయనకి బాగా నచ్చడంతో సినిమా చేద్దామని అన్నారు. ఈ సినిమా విషయంలో నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి సినిమా చేయించుకున్నారు.

అలౌకిక అంటే..?   

-లౌకికం కానిది. అంటే ఈ లోకంతో సంబంధం లేనిదని అర్థం. ఈ లోకానికి సంబందం లేనివి ఆత్మలు మాత్రమే. అందుకే ఈ టైటిల్ ను పెట్టాం. టైటిల్ విన్నవాళ్లు బాగుందని అన్నారు. టైటిల్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి.

సినిమా ఏ జోనర్ కి చెందింది?

-థ్రిల్లర్ సినిమా. హర్రర్ పార్ట్ కొంచెం ఉంటుంది. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఓ పెళ్లికి వెళ్లే దారిలో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే కథాంశం.  

ఆడియో రెస్పాన్స్...?

-ప్రమోద్ కుమార్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో విడుదల కూడా డిఫరెంట్ గా చేశాం. ఆరు పాటలకు మంచి ట్యూన్స్ కుదిరాయి. ఆరు పాటలను ఆరు చోట్ల విడుదల చేశాం. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ సినిమాని తమదిగా భావిస్తారు. మేం ఉహించినట్లే పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఎక్సలెంట్ గా కుదిరింది.

నటీనటులు, టెక్నిషియన్స్ పనితీరు..?

-సినిమా చేయాలనుకోగానే ఏ రోల్ ఎవరు చేస్తే బాగుంటుందని ముందుగా డిసైడ్ చేసుకుని నిర్మాత రావ్ గారితో చెప్పాను. ఆయన కూడా సరేనన్నారు. మనోజ్ నందం, బ్రహ్మాజీ, మాదాల రవి, మిత్ర, తాగుబోతు రమేష్, రాఘవ సహా ప్రతి ఒక్కరూ మంచి నటనను కనపరిచారు. ఇక టెక్నిషియన్స్ విషయానికొస్తే ప్రమోద్ కుమార్ సంగీతం, ప్రకాష్ రావు సినిమాటోగ్రఫీ, నాగిరెడ్డి ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి.

నిర్మాత డా.జె.ఆర్.రావ్ గురించి...?

-ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంచి టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్. సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కథ విషయంలో నాకు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. ఆయన చేసిన సపోర్ట్ కారణంగానే సినిమా చాలా బాగా వచ్చింది.

సినిమా విడుదల ఎప్పుడు ఉంటుంది..?

-ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ జరుపుకోనుంది. సెన్సార్ పూర్తి కాగానే సినిమా విడుదల తేది ప్రకటిస్తాం. పంచముఖి చిత్రంతో నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులను ఈ సినిమాతో మరోసారి తప్పకుండా ఆకట్టుకుంటాను. డిఫరెంట్ థిల్లర్ కాన్సెప్ట్ తో సాగే అలౌకిక తెలుగు ప్రేక్షకులను అలరించడం ఖాయం.

నెక్స్ ట్ ప్రాజెక్ట్...?

-తెలుగులో ఇదే బ్యానర్ లో అఖండిత అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను చేస్తున్నాను. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తాం. అలాగే కన్నడలో ఐ మిస్ యూ రా, తమిళంలో ‘అళగాన రాక్షసి’సినిమాలు చేయబోతున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు నిర్మాత చల్లా భానుకిరణ్...

 

goldnsilver

తాజా వార్తలు