‘దొంగాట’ నిర్మాతగా సంతృప్తినిచ్చింది

May 05, 2015 | 01:56 PM | 50 Views
temper
Artist Name :
మంచు లక్ష్మీ
Interviewed By :
మోహన్
Interview Date :
May 05, 2015

Interview Details :

విద్యానిర్వాణ సమర్పణలో లక్ష్మీ మంచు, అడవిశేష్‌ ప్రధానపాత్రధారులుగా మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం దొంగాట’. వంశీ కృష్ణ దర్శకుడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 8న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా లక్ష్మీ మంచుతో ఇంటర్వ్యూ...

ఇంత టెన్షన్ పడలేదు...

దొంగాట చిత్రం ఈ నెల 8న విడుదలవతుంది. చాలా అతృతగా ఎదురుచూస్తున్నాను. ఫుల్‌ ఫన్‌ ఫిలిం. అవుటండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌. ఫుల్ కామెడి రోల్ ను చేశాను. ఇప్పటి వరకు ఇంత కామెడి ఉన్న రోల్‌ నేను చేయలేదు. నా ‘గుండెల్లో గోదారి’ చిత్రానికి కూడా నేను ఇంతగా భయపడలేదు.

ఏదో పాస్ అయితే చాలనుకున్నాను...

ఈ చిత్రంలో నేను పాట పాడటానికి ప్రత్యేకంగా కారణలేవీ లేవు. ఈ సినిమాలో తొమ్మిది మంది హీరోస్‌తో చేసిన సాంగ్‌ ఉంది. అది పెద్ద హిట్టవుతుంది అనుకున్నాను. మంచి లిరిక్స్‌ కుదిరాయి. అందరూ లక్ష్మి..నువ్వు పాడితే బావుంటుందని చెప్పడంతో నేను పాడాను. నేను పాడిన పాట ఏదో పాస్‌ అయిపోతే చాలనుకున్నాను. అయితే నా పాటకు చాలా మంచి రెస్పాన్స్‌ హ్యపీగా గా ఉంది.

అదెప్పుడూ నాకు బాధ కలిగిస్తుంది...

-మన దేశంలో ఉన్న సమస్యే అది. ఎందుకంటే ఏం మాట్లాడినా నువ్వు ఆడపిల్లవి కదా అని అంటారు. అదేంటో తెలియదు కానీ ఇద్దరూ ఒకటే అని తెలిసినా అదే భావన ఇక్కడ ఇంకా ఉంది. అడపుట్టుకే తప్పు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అదే నాకు బాధను కలిగిస్తుంటుంది. ఆ ఫీల్ ను ఈ పాటలో చూపించాను. ఈ సాంగ్ లో నేను ఎక్కడా మగవాళ్లని తిట్టలేదు, విమర్శించానంతే. ‘మీరు షార్ట్‌ వేసుకుంటే తప్పులేదు కానీ నేను ప్యాంట్‌ వేసుకుంటే తప్పా..’ అనేది నా భావన.

మెసేజ్ లేకపోతే సినిమా చేయను...

-సినిమాలో కూడా నేను హీరోయిన్ రోల్ చేశాను. ఇదొక క్రైమ్‌ కామెడి నేపథ్యంలో సాగే సినిమా. ఆ హీరోయిన్‌ను కొందరు కిడ్నాప్‌ చేస్తారు. వారెందుకు కిడ్నాప్‌ చేస్తారనేదే సినిమా. సాధారణంగా నేను మెసేజ్‌  లేకుండా సినిమా చేయలేను. ఈ సినిమాలో కూడా హ్యుమన్‌ రిలేషన్స్‌కి, మనీకి ఉన్న సంబంధాన్ని హార్ట్‌ టచింగ్‌ మెసేజ్‌తో చూపించాం.

నిర్మాతగా చాలా సంతృప్తినిచ్చిన చిత్రం...

-సినిమా తీయడంలో తప్పు ఉండదు. బడ్జెట్ విషయంలోనే తప్పు ఉంటుంది. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది.  అందుకు కారణం ఉంది. నేను నిర్మాతగా చేసిన తొలి సినిమా ఝుమ్మందినాదంను రాఘవేంద్రరావుగారితో చేశాను. ఆయనకున్న అనుభవంతో సినిమా తీయడం ఇంత సులభమా అని అనిపించేతలా సులువుగా సినిమాని పూర్తి చేసేశారు. తర్వాత చేసిన ‘ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’, ‘గుండెల్లో గోదారి’ చిత్రాలకు నిర్మాతగా ఏం కావాలంటే  అది సమకూర్చాను. అయితే బడ్జెట్‌లో లిమిటేషన్స్‌ పెట్టుకుని ఉండాల్సింది. కానీ నేనది చేయలేదు.. అదే నేను చేసిన పెద్ద తప్పు. కానీ ఈ సినిమా విషయంలో నేను, వంశీ కృష్ణ ఎక్కడ ఏ సీన్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయాలను డిస్కస్‌ చేసుకుని చేశాం. ఒక నిర్మాతగా నాకు చాలా సంతృప్తినిచ్చిన చిత్రమిది. అనుకున్న బడ్జెట్ లోనే సినిమాని పూర్తి చేసేశాం.

ఆయన డైరెక్ట్ చేయనని చెప్పారు...

-ఓ సందర్భంలో ఓ హై టెన్షన్ పాయింట్ తట్టింది. నేను, మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన వంశీకృష్ణ ఈ కథను రామ్ గోపాల్ వర్మగారితో డైరెక్ట్ చేయడానికి డెవలప్ చేశాం. రామ్‌గోపాల్‌వర్మ దగ్గరకే తీసుకెళ్లాం. అయితే కథ విన్న ఆయన కథ చాలా బావుంది. కానీ నేను ఈ జోనర్‌లో సినిమా చేయను అన్నారు. నేనెంతో ఒప్పించే ప్రయత్నం చేశాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. అయితే ఈ స్టోరిపై వంశీకృష్ణకి పూర్తి అవగాహన ఉండటంతో తననే డైరెక్ట్‌ చేయమని అన్నాను. తను కూడా ఒప్పుకున్నాడు.

ఆయనో గ్రేట్ డైరెక్టర్...

-రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. చాలా జీనియస్, గ్రేట్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. వరల్డ్‌ సినిమాలో మన ఇండియన్‌ సినిమా విలువని పెంచిన గొప్ప దర్శకుడు. సౌండిరగ్‌, లైటింగ్‌ ఇలా చాలా టెక్నికల్‌ విషయాలు పరంగా సినిమాలో ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు.

క్రెడిట్ నాకే సొంతం...

-సెకండాఫ్ లో నా బర్త్ డే సందర్భంలో ఈ నైట్ కి నువ్వే హీరో..అంటూ సాగే సాంగ్ ను డిఫరెంట్ గా చేయాలనుకున్నాం. అప్పుడు తొమ్మిది మంది హీరోలతో చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ విషయంలో నేను దేవుడికి థాంక్స్‌ చెప్పుకోవాలి. నేను అడగ్గానే అందరూ హీరోలు నా మీద నమ్మకంతో ఒప్పుకుని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ క్రెడిట్ నాకే సొంతం

వంశీకృష్ణ చాలా ఫోకస్ డ్ పర్సన్...

-వంశీకృష్ణ చాలా ఫోకస్‌డ్‌ పర్సన్‌. గౌతమ్‌మీనన్‌ దగ్గర ఘర్షణ సినిమా నుండి ఏ మాయా చేసావే వరకు పనిచేశాడు. అదీ కాకుండా నాతోనే తను తొలి సినిమా చేయాలనుకున్నాడు. ఆ కోరిక ఈ విధంగా నేరవేరింది.

అవన్నీ రూమర్స్...

-మనోజ్ పెళ్లిలో రజనీకాంత్ గారు డ్యాన్స్ చేస్తారనే వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలు. ఆ విషయాన్ని మేం ఎక్కడా కన్ ఫర్మ్ చేయనప్పుడు ఎలా రాసేస్తారు. ఎందుకంటే రజనీకాంత్‌గారితో నాన్నగారికి చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. నా పెళ్లికి, విష్ణు పెళ్లికి కూడా ఆయన వచ్చారు. అప్పుడు రాని ఈ వార్తలు ఇప్పుడెలా వస్తున్నాయో తెలియడం లేదు. మనోజ్‌ పెళ్లి పనులను నాన్నగారు దగ్గరుండి చూసుకుంటున్నారు. మేమైతే ఈ సమ్మర్‌లో ఏదైనా డెస్టినేషన్‌కి వెళ్లి అక్కడ పెళ్లి చేసేద్దామని చెప్పినా నాన్న వినలేదు. అన్నీ సంప్రదాయబద్ధంగా జరగాలని పట్టుబట్టి దగ్గరుండి చూస్తున్నారు.

విద్యానిర్వాణతో ఎంజాయ్ చేస్తున్నాను...

-నేను చాలా ఎక్స్ ప్రెసివ్. నా కుమార్తె విద్యానిర్వాణతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తను ఇప్పడు టచ్ చేస్తున్నా కలుగుతున్న ఫీలింగే వేరు. మాటల్లో చెప్పలేనిది.

నెక్స్ ట్‌ ప్రాజెక్ట్‌?

-తరుణ్‌ భాస్కర్‌ అనే కొత్త దర్శకుడితో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నాను. తను గతంలో చాలా షార్ట్ ఫిలింస్ చేశాడు. ఫార్ట్ ఫిలిం చూసి నచ్చడంతో తనతో మాట్లాడి సినిమా చేస్తున్నాను. ఆ చిత్రం జూన్‌ నుండి ప్రారంభమవుతుంది.

goldnsilver

తాజా వార్తలు