అందరినీ అలరించే యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లయన్’

May 09, 2015 | 03:22 PM | 22 Views
temper
Artist Name :
నిర్మాత రుద్రపాటి రమణారావు
Interviewed By :
మోహన్
Interview Date :
May 09, 2015

Interview Details :

నందమూరి బాలకృష్ణ హీరోగా జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మించిన చిత్రం ‘లయన్‌’. ఈ సినిమా ఈ నెల14న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత రుద్రపాటి రమణారావుతో ఇంటర్వ్యూ....

లయన్‌ను ఎలా ఉండబోతుంది?

` తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులను అలరించేలా ఉంటుంది. ఇందులో నందమూరి బాలకృష్ణ నటనలోని మరో యాంగిల్‌ను చూస్తారు. ఫస్టాఫ్‌ అంతా ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌గా, కామెడితో సాగిపోతుంది. సెకండాఫ్‌ అంతా యాక్షన్‌తో మాసివ్‌గా ఉంటుంది. 

లయన్‌టైటిల్‌ను పెట్టడానికి కారణం?

` ఈ ‘లయన్‌’ టైటిల్‌ పెట్టడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి బాలకృష్ణగారు అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నలభై ఆరువేల లయన్‌ క్లబ్స్‌. వీరు ప్రపంచ వ్యాప్తంగా తమ సేవను చాటుకుంటున్నారు. అలాగే బాలకృష్ణగారు కూడా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకమ్మ కాన్సర్స్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌గా సేవాకార్యక్రమాలను చేస్తున్నారు.

బాలకృష్ణతో ఇలాంటి డిఫరెంట్‌ సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారు?

` నేను బాలకృష్ణగారికి పెద్ద అభిమానిని. ఆయనతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమా చేయాలని అనుకున్నాను. వేరే దర్శకుడితో వెళ్లి ఆయన్ను కలిశాను. అయితే బాలకృష్ణగారు అలాంటి సినిమాలు చాలా చేశామని, ఏదైనా డిఫరెంట్‌గా చేద్దామని అన్నారు. అలాంటి సమయంలో సత్యదేవగారు చెప్పిన కథ నాకు నచ్చింది. నేను అదే కథను బాలకృష్ణగారికి వినిపించాను. ఆయనకి బాగా నచ్చింది. వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు.

కథ వినగానే మీకు ఒక నిర్మాతగా ఏ అంశాలు నచ్చాయి?

` స్క్రిప్ట్‌ మొత్తమే డిఫరెంట్‌గా ఉంటుంది. సాధారణంగా సినిమాల్లో కొన్ని సీన్స్‌ చూస్తే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఏ సీన్‌కి అదే డిఫరెంట్‌గా ఉంటుంది.

సత్యదేవ దర్శకత్వం గురించి..?

` కొత్త దర్శకుడు ఎలా చేస్తాడో అని చిన్న డౌట్‌ ఉండేది. అయితే ఆయన టేకింగ్‌ సూపర్‌. సింహాలో బాలకృష్ణగారు ఎంత కొత్తగా కనపడ్డారో ఈ సినిమాలో కూడా అలా కనపడతారు.

ఆడియో రెస్పాన్స్‌ ఎలా ఉంది?

` గతంలో బాలకృష్ణగారు, మణిశర్మగారి కలయికలో అనేక మ్యూజికల్‌ హిట్స్‌ వచ్చాయి. వాటికి ఏ మాత్రం తగ్గని రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ఫస్ట్‌ సాంగ్‌ కృష్ణుడిపై ఉంటుంది. సెకండ్‌ సాంగ్‌ త్రిషపై టీజింగ్‌ సాంగ్‌ ఉంటుంది. అలాగే మూడు, నాలుగు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

బాలకృష్ణ రోల్‌ ఎలా ఉంటుంది?

` ఇందులో బాలకృష్ణ రెండు షేడ్స్‌ ఉన్న పాత్ర చేశారు. అందులో ఒకటి నిజాయితీ గల సిబిఐ ఆఫీసర్‌ రోల్‌. మరో రోల్‌ గురించి నేను చెప్పడం కంటే స్క్రీన్‌పై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

అభిమానిగా, నిర్మాతగా లయన్‌ఎలాంటి ఫీలింగ్‌ను ఏర్పరిచింది?

` అభిమానిగా చాలా హ్యపీగా ఫీలయ్యాను. నిర్మాతగా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించాం. సినిమా అవుట్‌పుట్‌ సూపర్‌గా ఉంది. నిర్మాతగా కూడా హ్యపీగా ఉన్నాను.

మరి విడుదల ఆలస్యం కావడానికి కారణం?

` ముందు మే 8న విడుదల చేయాలనుకున్నాం. సిజీ వర్క్‌ అంతా చెన్నైలో జరిగింది. ఆ వర్క్‌ జరిగే విషయంలో కొద్దిగా ఆలస్యం కావడం, దానివల్ల ఓవర్‌సీస్‌కి కాపీ వెళ్లడంలో డిలే అయింది. అంతే కాకుండా డి.టి.ఎస్‌. ఇంజనీర్‌ మధుసూదన్‌గారు మరణించడం ఇలా కారణాలతో సినిమా విడుదలను మే 14న విడుదల చేస్తున్నాం.

బాలకృష్ణతో పనిచేయడం ఎలా అనిపించింది?

` తొలిసారి అభిమానిగా అయన్ను కలిశాను. మొదటిసారి నలభై అయిదు నిమిషాలు మాట్లాడారు. తర్వాత సినిమాలో ఆయనతో మంచి అనుబంధం ఏర్పడిరది. సినిమా షూటింగ్‌లో ఆయన కేర్‌ తీసుకుని మమల్ని నడిపించారని చెప్పాలి. ఆయన సహకారం మరువలేనిది. చాలా హ్యపీగా ఉన్నాను.

ఈ సినిమాలో హైలైట్స్‌?

` సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి పర్టికులర్‌గా హైలైట్స్‌ అని చెప్పలేం. అయితే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, సెకండాఫ్‌లో వచ్చే ట్రైబల్‌ ఫైట్‌, క్లయిమాక్స్‌ చాలా సూపర్‌గా ఉంటాయి. అందరినీ అలరిస్తాయి.

నెక్స్‌ ట్‌ ప్రాజెక్ట్‌?

` ప్రస్తుతం బాలకృష్ణగారు 99, 100వ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన 101వ సినిమా అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను.

goldnsilver

తాజా వార్తలు