Interview Details :
ఈ నెల 26న జాదూగాడు సినిమాతో తెరముందుకు రాబోతున్నాడు నాగశౌర్య. ఇంతకు ముందు ఆయన నటించిన ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి డీసెంట్ హిట్స్ అనిపించుకున్నాయి. చింతకాయల రవి దర్శకుడు యోగేష్ దర్శకత్వం వహించిన జాదూగాడు గురించి నాగశౌర్య చెప్పుకొచ్చిన విశేషాలు..
# ఇప్పటిదాకా క్లాస్ సినిమాల్లో చేశారు... జాదూగాడు టైటిల్ వెరైటీగా ఉందే?
- ఇది మాస్ జోనర్ మూవీ. మాస్, క్లాస్.. అన్ని వర్గాలకూ నచ్చుతుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సినిమాకు ప్రాణం పోస్తాయి. లౌడ్ సినిమా. ఆడియోకి మంచి స్పందన వస్తోంది.
# ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నట్టున్నారు?
- అవునండీ. ఈ సినిమా సక్సెస్ అయితే ఏడాదికి తప్పకుండా రెండు సినిమాల్లో చేస్తాను.
# జాదూగాడులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
- చాలా బావుంటుంది. నా పాత్ర పేరు కృష్ణ. ఐఎస్డీ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే పాత్ర. రికవరీ ప్రాసెస్‌లో ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ.
#క్లాస్ టు మాస్ టర్న్ కావడానికి స్పెషల్ రీజన్ ఉందా?
- కెరీర్ ప్రారంభంలోనే మాస్ ఎందుకని చాలా మంది అడిగారు. కానీ నాకు ఈ సినిమా కథ కనెక్ట్ అయింది. జాదూగాడు అంటే మోసగాడు అని అర్థం. స్టోరీ కూడా క్లాస్, మాస్ తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది.
#మిమ్మల్ని అంతగా ఇంప్రెస్ చేసిన విషయాలేంటి?
- ప్రీ క్లైమాక్స్ దాదాపు 40 నిమిషాలు సాగుతుంది. సప్తగిరి కామెడీ కూడా హైలైట్ అవుతుంది.
# గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో స్పెషల్‌గా ఏమైనా చేశారా?
- డ్యాన్సులు, ఫైట్లు చేశాను. నేను ఫైట్లు చేస్తే చూడరేమో అనే అనుమానం నాలో ఎక్కువగా ఉండేది. అయితే దాన్ని పోగొట్టింది మాత్రం యోగేష్‌గారే. నాతో చాలా బాగా ఫైట్లు చేయించారు.
# చేతిలో ఇంకేం ప్రాజెక్ట్ లున్నాయి?
- నందినిరెడ్డిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. 70 శాతం పూర్తయింది. అలాగే రమేష్‌వర్మగారి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా. ఈ సినిమాకు శ్యామ్.కె.నాయుడు కెమెరా, ఇళయరాజాగారు సంగీతాన్ని అందిస్తున్నారు.