కిక్-3 చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాం

August 19, 2015 | 10:14 AM | 10 Views
temper
Artist Name :
రవితేజ
Interviewed By :
నీహార్ ఆన్ లైన్
Interview Date :
August 19, 2015

Interview Details :

మాస్ ప్రేక్షకులకు రారాజు రవితేజ. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఎప్పుడూ రెడ్ బుల్ తాగిన వాడిలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. తన దగ్గరికి స్క్రిప్ట్ తో వచ్చే ఏ దర్శకునికి కూడా నో చెప్పకుండా కొత్తవారిని సైతం ఎంకరేజ్ చేస్తుంటాడు. అందుకే రవితేజ అంటే తెలుగు ఇండస్ట్రీలో  ఓ ప్రత్యేకం. ఇక ఆరేళ్ల క్రితం ఆయన హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ వచ్చింది. అది బ్లాక్ బస్టర్. రవితేజ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు డబుల్ కిక్ ఇచ్చేందుకు కిక్ 2 తో వస్తున్నాడు. ఇది సీక్వెల్ కాదంటున్నాడు మాస్ రాజా. కంపోర్ట్ కోసం ఓ యువకుడు పడే తాపత్రయమే ఈ చిత్రమట. ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ కి రవితేజ ఇచ్చిన ఇంటర్వ్యూ...

 

తొలుత సీక్వెల్ అన్నారు?

కిక్ కథ వేరు. దీని కథ వేరు. రెండూ వేర్వేరు కథలు, క్యారెక్టర్లు. కాకపోతే కిక్ లోని షేడ్ లు ఇందులోని పాత్రలపై కాస్త కనిపిస్తాయి.

 

ఇంతకీ కథ ఏంటీ?

ఓ వ్యక్తి తన కంఫర్ట్ కోసం కథని ఎలా నడిపించాడన్నదే సినిమా. రాబిన్ హుడ్ తరహాలో కనిపిస్తా. నా కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా.

సినిమా కోసం చాలా చేంజ్ అయ్యారు?

ఈ సినిమా కోసమే బరువు తగ్గలేడు. ఆరోగ్యం కోసం బరువు తగ్గాను. 82 కేజీల నుంచి 72 కేజీలకు తగ్గా. ఆ ప్రాసెస్ లో ఉండగా కిక్2 సెట్స్ కెళ్లింది .. కాబట్టి తక్కువ బరువుతో కనిపించానంతే.

కిక్ 2 గురించి అప్పుడే అనుకున్నారా?

అలాంటిదేం లేదు. కాకపోతే ఎండింగ్ ని బట్టి కిక్ 2 ఉంటుందని అంతా అంచనా వేశారు. అదే ప్రచారమైంది. ప్రచారమైందే ఇప్పడు నిజమైంది. వక్కంతం చెప్పిన ఓ లైన్ ఆకట్టుకుంది. దాన్నే డెవలప్ చేస్తే కిక్ 2 అయ్యింది. అదీ సంగతి. ఇంకో విషయమేంటంటే కిక్ 3 కి కూడా ప్లాన్ వేస్తున్నాం.

ఇందులో హైలెట్స్?

తొలికాపీ ఇంకా చూడలేదు. కానీ అందరికీ నచ్చే సినిమా ఇది. మనోజ్ పరమహంస కెమెరా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అస్సెట్స్. డబుల్ కిక్ షురూ..

ఈ మధ్య తెలుగు సినిమా ఖ్యాతి ఖండాతరాలు దాటింది. దీనిగురించి?

బాహుబలితో తెలుగువాడి గౌరవం ఉత్తరాదిన పెరిగింది. బాహుబలి శ్రీమంతుడు కొత్త మార్కెట్ కి తలుపులు తెరిచాయి. ఇది మంచి పరిణామం.

కొత్త సినిమాలు ఏమైనా చూశారా?

బాహుబలి, శ్రీమంతుడు ఈ రెండు సినిమాలతో పాటు రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్త మావ చూశాను. చాలా బావుంది. రాజ్ తరుణ్ చాలా బాగా నటించాడు. నవతరం దూసుకు రావాలి.

అన్నట్టు పూరితో మళ్లీ సినిమా ఎప్పుడు ఉంటుంది?

ఇడియట్ తర్వాత ఇడియట్ 2 చేద్దామనుకున్నా కుదరలేదు. కిక్ 2 తర్వాత కుదిరినా కుదరొచ్చు. పూరితో పనిచేసి చాలా కాలమైంది. వచ్చే ఏడాది కలిసి పనిచేసే అవకాశం ఉంది.

మల్టీ స్టారర్లపై మీ అభిప్రాయం?

మల్టీస్టారర్లకు సిద్ధమే. వెంకీ తో వీరూపోట్ల దర్శకత్వంలో చేయాల్సింది. కానీ కుదరలేదు.

తదుపరి ప్రాజెక్టులు ?

సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ చిత్రీకరణలో ఉంది. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ లో రిలీజవుతుంది. తదుపరి ప్రాజెక్టు ఇంకా ఏవీ నిర్ణయించలేదు.

యంగ్ జనరేషన్ మిమల్ని బాగా ఇమిటేట్ చేస్తున్నట్టున్నారు?

యువహీరోలు నన్ను ఇమ్మిటేట్ చేయడం కాదు. నాది ఫ్రీ  యాక్టింగ్ స్టయిల్. అది అలవాటు చేసింది పూరీగారు. ఆ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. కానీ, వాళ్లు నన్ను ఇమిటేట్ చెయ్యకుండా వాళ్లకో స్టైల్ క్రియేట్ చేసుకుంటే మంచింది అంటూ ముగించాడు మాస్ రాజా.

goldnsilver

తాజా వార్తలు