మామయ్య చిత్రాలను రీమేక్ చేసే ధైర్యం లేదు

September 22, 2015 | 02:24 PM | 6 Views
temper
Artist Name :
సాయి ధరమ్ తేజ్
Interviewed By :
నీహార్ ఆన్ లైన్
Interview Date :
September 22, 2015

Interview Details :

బోణీ చిత్రంతోనే మెగా ఫ్యామిలీ నుంచి సరైన వారసుడొచ్చాడు అనిపించుకున్నాడు. డాన్స్ లతోపాటు డైలాగ్ డెలివరీలో స్టార్ లకు ఏమాత్రం తీసిపోకుండా మామలకు తగ్గ అల్లుడిగా దూసుకెళ్తున్నాడు. మొదటి చిత్రం పిల్లా.. నువ్వులేని జీవితం హిట్ కావటంతోపాటు వెనువెంటనే భారీ ప్రాజెక్టులు సైన్ చేసి సెన్సేషన్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. త్వరలో హరీష్ శంకర్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిలీజ్ కానుంది. రిలీజ్ కి ముందు  సాయిధరమ్ ఇంటర్వ్యూ మీకోసం...

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో కొత్త పాయింట్ ఏంటి?

ఎమోషన్ రొమాన్స్ సన్నివేశాల్లో కొత్తదనం కో్సం ప్రయత్నించా. నా పాత్ర కోసం దర్శకుడితో కలిసి బోలెడంత డిష్కస్ చేశాను. ఇందులో కొత్త సాయి ధరమ్ ని చూస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఏదైనా డిగ్రీ చదువుతున్నామా? అన్నట్టే ఉంది. నా జీవితంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.. ఓ మరచిపోలేని అనుభూతి.

కథ గురించి?

గబ్బర్ సింగ్ తరహాలోనే ఈ చిత్రం కూడా హరీష్ శైలిలో  సాగే కమర్షియల్ ఎంటర్ టైనర్. అదే టైంలో నిర్మాత దిల్ రాజు టేస్ట్ కు తగ్గట్టు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కు పెద్ద పీట వేశారు. కుటుంబ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. మొత్తంగా ఇదో పూర్తి స్థాయి ఎంటర్ టైనింగ్ ప్యాకేజ్.

మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

సుబ్రహ్మణ్యం పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. డబ్బు కోసం డిఫరెంట్ కోణంలో వసూళ్లు చేసే వాడు సుబ్బు. పాత్ర ఆధారంగా చేసుకొని కథలోని ఎమోషన్ నడుస్తూ ఉంటుంది. సుబ్రమణ్యంకి డబ్బు అవసరం ఏమిటి? అతడు అమెరికా ఎందుకు వెళ్ళాడు? ఇలాంటి ప్రశ్నల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. నా గత రెండు చిత్రాల కంటే వైవిధ్యంగా కథాంశం ఉంటుంది.

హరీష్ శంకర్ తో మీ ప్రయాణం?

హరీష్ ‘మిరపకాయ్’ సినిమా తీసినప్పట్నుంచి బాగా తెలుసు. ఈ సినిమా ఆరంభానికి ముందే... నేనిప్పుడు ఫ్లాపిచ్చిన డైరెక్టర్ ని - గబ్బర్ సింగ్’ డైరెక్టర్ ను కాను అని అన్నారు. కథ వినగానే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. వెంటనే చేసేద్దాం అని నిర్ణయించుకున్నా. హరీష్ తో కలిసి పనిచేయడం అంటే ఓ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

రెజీనాతో వరుసగా రెండో సినిమా కదా?

రెజీనా ఓ మంచి ఫ్రెండ్. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటూంటాం. స్నేహితులమే కాబట్టి ఆన్ సెట్స్ సరదాగానే గడిచిపోయింది. నాకు బేసిగ్గా రొమాన్స్ సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బంది. అలాంటివి చేయాల్సి వచ్చినపుడు రెజీనా నేను ముందే డిస్కస్ చేసుకొని సీన్ సరిగ్గా రావడానికి మా వంతుగా ఏమేం మార్పులు చేయొచ్చో ముందే అనుకునేవాళ్లం.

దిల్ రాజుతో వరుస సినిమాలు? కారణం?

ఆయన మంచి కథలతో రెడీగా ఉన్నారు. అవన్నీ నాకూ నచ్చాయి. దీంతో వరుసగా కమిటయ్యా. పిల్లా నువ్వులేని జీవితం - సుబ్రమణ్యం ఫర్ సేల్ - అనిల్ రావిపూడి సినిమా - శతమానం భవతి అన్నీ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్లోనే.

మామయ్య హిట్ సాంగ్ రీమేక్ చేశారు గా?

గువ్వ గోరింకతో .. సాంగ్ ఎనర్జిటిక్ సాంగ్. ఈ సినిమాలో ఒక మెలోడీలా కనిపిస్తూనే మంచి ఎనర్జీనిచ్చే పాట రావాల్సిన సందర్భం ఒకటి ఉంది. దానికి మావయ్య సినిమాల్లోని ఈ పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందని ఎంచుకున్నాం. మావయ్య సాంగ్ స్థాయిని అందుకోవడం సాధ్యమయ్యే పనికాదు. మా వరకూ ఓ ప్రయత్నం అంతే.

బాడీ లాంగ్వేజ్ గురించి వస్తున్న కామెంట్లు?

మావయ్యల బాడీ లాంగ్వేజ్ ను ఫాలో అవ్వడం ఇమిటేట్ చేయడం లాంటివి అస్సలు చేయను. కానీ, చిన్నప్పట్నుంచీ మావయ్య వాళ్ళను దగ్గర్నుంచి చూస్తూ పెరిగిన వాడిని కావడంతో వాళ్ళ మ్యానరిజమ్స్ కొన్ని నాకూ వచ్చాయి. అంతే తప్ప కావాలని ఇమిటేట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయను.

చిరు సినిమాల్లో ఏదైనా రీమేక్ చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నారా?

అలాంటి ఆలోచనే చేయను. చిరంజీవిని అందుకోవడమంటే అంత ఈజీ కాదు. ఇలా మన సినిమాలు చేస్తూ పోవడమే కానీ మావయ్య సినిమాలు రీమేక్ చేయడమనే ఆలోచనను దగ్గరకు రానివ్వను.

మెగా ఫ్యామిలీలోనే మీకు చాలా పోటీ ఉందిగా?

పోటీ గురించి నేను ఆలోచించను. ఎవరికి వారే. వారి వారి టాలెంట్ ను అనుసరించి మెగా ఫ్యాన్స్ ఫ్యామిలీ మొత్తం అందరినీ ఆదరిస్తుంది. ఒకేరోజు మా సినిమాలు రిలీజైనా బావుంటే జనాలు ఆదరిస్తారు. పోటీలో అలా సినిమాలు రిలీజ్ కావడం మంచిదే.

అప్ కమింగ్ ప్రాజెక్టులు?

‘తిక్క’ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అనిల్ రావిపూడితో చేస్తోన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్ కెళతాం. అలాగే ఆ తర్వాత ‘శతమానం భవతి’ ప్రారంభం కానుంది. అన్నింట్లో నావంతు నటనను నేను కనబరుస్తాను అంటూ ముగించాడు సాయి ధరమ్ తేజ్.

goldnsilver

తాజా వార్తలు