నేను అనే ఫీలింగ్ వదిలేస్తే వచ్చిందే నువ్వు

August 19, 2015 | 12:24 PM | 14 Views
temper
Artist Name :
ఉపేంద్ర
Interviewed By :
నీహార్ ఆన్ లైన్
Interview Date :
August 12, 2015

Interview Details :

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర వైవిధ్యానికి చిరునామా. ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం ఉంటుంది. అదే టైంలో సామాజిక అంశాలను కూడా సృశిస్తుంటాడు. ఓం చిత్రం దగ్గర నుంచి సూపర్ దాకా ఆయన చిత్రాలన్నీ సోషల్ మేసేజ్ తో కూడుకున్నవే. అదే సమయంలో ఆయన సినిమాలు విచిత్రంగా ఉంటాయి. ప్రేక్షకులకు నచ్చేందుకు కూడా అదోక కారణం. ఒక్క కన్నడలోనే కాదు తెలుగులోనూ ఆయన అభిమానులను సొంతం చేసుకోగలిగారు. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఉపేంద్ర 2. పదేళ్ల క్రితం ఆయన నటించిన 'ఉపేంద్ర'కు ఇది  సీక్వెల్. ఈ సందర్భంగా ఆయన నీహార్ ఆన్ లైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీకోసం...

 

చాలా గ్యాప్ తర్వాత హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.?

నా అభిమానులకు హ్యపీ, నాక్కూడా హ్యాపీయే. ఆక్చువల్ గా నాకు తెలుగు సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ, నేనేదీ ప్లాన్ చేయను. ఎలా జరిగితే అలా చేసుకుంటూ వెళ్లిపోతాను.

'ఉపేంద్ర 2' ప్ర్యతేకత ఏంటి?

ఉపేంద్ర 'నేను' అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. ఇది మాత్రం 'నువ్వు' అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. తొలి భాగం మొత్తం నాకేది అనిపిస్తే అది చేస్తా. మలి భాగంలో నువ్వు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చేస్తా.

సీక్వెల్ గురించి అప్పుడే అనుకున్నారా?

లేదు. 'నేను' అనే ఫీలింగ్ వదిలేసిన తర్వాత వాడేమవుతాడు? అని 'ఉపేంద్ర'లో నేను చేసిన క్యారెక్టర్ గురించి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అలా వెంటాడుతూ వచ్చింది. అందులోంచి వచ్చినదే ఈ సీక్వెల్.

వాస్తవ జీవితానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందా?

అవును. ఇది అందరి సినిమా, 'నువ్వు' అంటే ప్రతి ఒక్కరూ. అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అనేది చూపించాం.

ఉపేంద్రతో  పోలిక...?

అలా ఏం లేదు. ఆ సినిమా గురించి కనీస అవగాహన లేకపోయినా ఫర్వాలేదు. ఈ చిత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమా దారి ఈ సినిమాది.

'నువ్వు' అంటే ఏంటి?

అంతర్గత స్వేచ్ఛకు సంబంధించిన సినిమా ఇది. ఆ స్వేచ్ఛ గురించి చాలా డీప్ గా డిస్కస్ చేశాం. అది ఆసక్తికరంగా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అవుతంది.

సామాజికపరమైన అంశాలు ఉంటాయా?

లేదు. ఇది ప్యూర్లీ పర్సనల్ గా ఉంటుంది. అంతర్లీనంగా ఓ సందేశం ఉంటుంది.

మీ సినిమాలు మహిళా ప్రేక్షకులు చూడటానికి వెనకాడతారు?

కానీ, చూస్తే ఇష్టపడతారు. ఈ చిత్రం మహిళా ప్రేక్షకులు కూడా చూసే విధంగా ఉంటుంది. వాళ్లకూ నచ్చుతుంది.

ఈ చిత్రానికి ఇన్ స్పిరేషన్ ఏమైనా ఉందా?

లేదు. వేరే సినిమాలు చూసి ఇన్ స్పయిర్ అయ్యి ఈ సినిమా తీయలేదు. థాట్ ప్రాసెస్ లోంచి వచ్చిన పాయింట్ తో తీశాను. అందుకే ఈ సినిమా ఓ కొత్త ప్యాట్రన్ లో ఉంటుంది.

కథ కొత్తగా ఉంటుందా?

నాకు తెలిసి కొత్త కథలు అనేవి ఉండవు. అన్ని కథలు ఆల్ మోస్ట్ అందరికీ తెలిసినవే. కానీ, ఆ కథలు చెప్పే విధానంలో ఒక న్యూ వే ఉంటుంది. ఈ సినిమా ఆ వేలో ఉంటుంది.

డైరక్షన్, యాక్టింగ్ ఈ రెండింటిలో మీకేది సంతృప్తిగా ఉంటుందా?

డైరెక్షన్ లో ఒక ఫుల్ నెస్ ఉంటుంది. ఎందుకంటే, సినిమా మొత్తం నడిపించాలి. కానీ, నటన అంటే జస్ట్ అలా వచ్చి.. ఇలా నటించేసి వెళ్లడం. అంతే. యాక్టింగ్ ఎంజాయబుల్ గా ఉంటుంది. కానీ, ఇక్కడ కష్టం తక్కువ. డైరెక్షన్ కి ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ కష్టపడినప్పుడు ఎంజాయ్ మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా.

నిర్మాత నల్లమలుపు బుజ్జి గురించి...?

నాతో అప్పట్లో 'రా' తీశారు. మా మధ్య మంచి స్నేహం ఉంది. బుజ్జి పెద్ద నిర్మాత అయ్యారు. నేనూ సెటిలయ్యాను. 'ఉపేంద్ర 2'ని చూసి, నచ్చితే తెలుగులో విడుదల చేయమని బుజ్జితో అన్నాను. అప్పుడు తను 'నాకు 'ఉపేంద్ర' అంటే చాలా ఇష్టం. నేను 'ఉపేంద్ర 2'ని విడుదల చేస్తాను' అని కనీసం ఈ సినిమా చూడకుండా తెలుగులో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. బుజ్జి ఈ సినిమా విడుదల చేయడం వల్ల ఇది పెద్ద సినిమా అయ్యింది.

ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లో మీరు తలకిందులుగా ఉన్నారు?

అది పెద్ద టాపిక్ అయ్యింది. మామూలుగా అభిమానులు కటౌట్లకు పాలాభిషేకం చేస్తారు కదా.. ఇప్పుడెలా చేయాలి? అని ఆలోచిస్తున్నారు (నవ్వుతూ).

అలాగే, అఘోరా గెటప్ కూడా కనిపిస్తోంది?

అవును. కథలో భాగంగా ఆ గెటప్ ఉంటుంది. ఈ సినిమాలో నేను ఏ గెటప్ లో కనిపించినా, అది కథానుగుణంగానే ఉంటుంది తప్ప, కథకు సంబంధం లేకుండా ఉండదు.

చివరగా... మీ నుంచి ఎక్కువ తెలుగు సినిమాలు ఆశించవచ్చా?

నేను తెలుగు సినిమాలు చేయడానికి రెడీ. దర్శక, నిర్మాతలు ఆహ్వానిస్తే కాదనను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు కనబరుస్తున్న ప్రేమాభిమానాలను దూరం చేసుకోలేను అంటూ ముగించారు.

goldnsilver

తాజా వార్తలు