సరైనోడు

April 22, 2016 | 05:06 PM | 14 Views
Rating :
సరైనోడు

నటీనటులు : అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ తెస్రా, శ్రీకాంత్, ఆదిపినిశెట్టి, బ్రహ్మనందం, తదితరులు

సాంకేతిక వర్గం :

సంభాషణలు: ఎం.రత్నం, సంగీతం ఎస్ఎస్ థమన్, బ్యానర్ గీతా ఆర్ట్స్, నిర్మాత అల్లు అరవింద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు బోయపాటి శీను

మాస్ సినిమాల స్థాయిని పీక్స్ లోకి తీసుకెళ్లిన దర్శకుడు బోయపాటి శీను. హీరోయిజం ఫ్లస్ డైలాగ్ డెలివరీలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే పవర్ ఫుల్ చిత్రాలను అందించాడు. ఇక ఫుల్ ఎంటర్ టైనర్ అండ్ ఎనర్జిటిక్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే సరైనోడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాల మధ్య అదే స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అంచనాలు అందుకుందా చూద్దాం.

కథ :

గణ(అల్లు అర్జున్) ఓ ఆర్మీ ఆఫీసర్. దేశ సరిహద్దుల్లో కంటే దేశం లోపలే తన అవసరం ఉందని భావించి రాజీనామా చేసి తన వాళ్ల దగ్గరికి వచ్చేస్తాడు. ఇక్కడికొచ్చాక బాబాయ్ (శ్రీకాంత్ ) కు సాయం చేస్తూ... కొన్ని అరాచక శక్తుల పనిపట్టే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో యంగ్ ఎమ్మెల్యే హన్షిత రెడ్డి(కేథరిన్) తో ప్రేమలో పడి ఆమెను పడేసి పెళ్లికి సిద్ధమైపోతాడు. సడన్ గా అదే టైంలో మహాలక్ష్మి(రకుల్) అతని పంచన చేరుతుంది. తనని, తన ఊరిని వైరం ధనుష్(ఆదిపినిశెట్టి) బారి నుంచి కాపాడమని గుణని ప్రాధేయపడుతుంది. అలా మొదలైన గణ-ధనుష్  వైరం ఎక్కడిదాకా వెళ్తుంది. చివరికి యుద్ధంలో ఎవరికి గెలిచారు అన్నదే సింపుల్ గా కథ.

ఫ్లస్ పాయింట్లు:

నో డౌట్ సినిమాకి మేజర్ ఫ్లస్ పాయింట్ అల్లు అర్జునే. ఊర మాస్ రోల్ లో అద్భుతమైన నటన కనబరిచాడు. డాన్సుల్లో, ఫైట్లలో సింప్లీ సూపర్బ్. బాడీ లాంగ్వేజ్ కు యాక్షన్ సీక్వెన్లు బాగా సెట్ అయ్యాయి. సినిమా కోసం అల్లు అర్జున్ పడిన శ్రమ తెరపై క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ఆది పినిశెట్టి... సైలెంట్ అండ్ స్టైలిష్ విలన్ గా బాగా చేశాడు. కొన్ని సీన్లలో బన్నీని డామినేట్ చేశాడు కూడా.  ఓవైపు హీరోగా చేస్తూ విలన్ గా చేయటంలో అతని గట్స్ ను అభినందించాలి. ఇక హీరోయిన్లు ఇద్దరు వారి పరిధిలో నటించారు. గ్లామర్ పరంగా అదనపు ఆకర్షణ తెచ్చారు. శ్రీకాంత్ ఓ కీలకపాత్రలో అలరించాడు. క్లైమాక్స్ ఆ పాత్రే కీలకం.  చాలా రోజుల తర్వాత బ్రహ్మీ కామెడీ కాస్త పేలింది.

సాంకేతిక అంశాల విషయానికొస్తే... అల్రెడీ హిట్ అయిన పాటల స్క్రీన్ పై ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలా ఉంది. రిషి పంజాబి కెమెరా పనితనం బావుంది. రత్నం డైలాగులు పేలాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

మైనస్ పాయింట్లు :

న్యాయం కోసం హీరో పోరాటం అన్న కథ పాతదే. అయితే హీరోయిజం ఎక్కువ చేసే క్రమంలో విలన్ తో వైరాన్ని తక్కువ చేసి చూపాడు బోయపాటి శీను. అలాగే వీరిద్దరి పోరాటం కోసం రెండు గంటలు ప్రేక్షకులు ఎదురుచూడాల్సి వస్తుంది. కథ కూడా సింహ, లెజెండ్ తరహాలోనే అనిపిస్తుంది. హీరోయిన్లు కేవలం పాటలకే తప్ప పెద్ద ప్రాధాన్యం ఉన్నట్లు అనిపించదు.  కీలకమైన సెకంఢాప్ మరీ లెంగ్తీగా, వీక్ క్లైమాక్స్ వల్ల తేలిపోయింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పేలవంగా ఉంది. కొన్ని సీన్లు సడన్ గా కట్ చేసినట్లు ఉంటుంది.

చివరగా :

ఊర మాస్ అంటూ వచ్చిన సరైనోడు నిజంగా ఆ వర్గం ప్రేక్షకులకు పండగలాంటిదే. సన్నాఫ్ సత్యమూర్తిలో క్లాస్ అవతారంలో కనిపించిన బన్నీని పూర్తిస్థాయి మాస్ రోల్ లో చూసేసరికి ప్రేక్షకుడు షాక్ అవ్వక మానడు. అయితే హింస ఎక్కువగా ఉండటం వల్ల ఓ వర్గం ప్రేక్షకులు నిరాశ చెందవచ్చు.

చివరగా... చివరి 15 నిమిషాలు ఓపిక పడితే... సమ్మర్ కి సరైన మాస్ ఎంటర్ టైనర్ సరైనోడు.ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు