భలేమంచి రోజు

November 27, 2015 | 05:20 PM |2 Views
Movie Name :
భలేమంచి రోజు
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=_ww_nSKPVHI
Actor/Actress/Director names :

సుధీర్ బాబు, వామిక, సాయికుమార్, టిల్లు వేణు, తదితరులు

ఆర్ట్‌: రామకష్ణ, డైలాగ్స్‌: అర్జున్‌, కార్తీక్‌, సంగీతం: సన్నీ ఎం.ఆర్‌.నిర్మాతలు: విజ§్‌ుకుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య.

Expected Release Date :
2015-12-18
Synopsis :

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండదండలతో వచ్చిన హీరో సుధీర్ బాబు. ప్రేమకథా చిత్రమ్ హిట్ అయినప్పటికీ అది దర్శకుడి అకౌంట్లోకి వెళ్లిపోవటంతో అతనికి పెద్దగా లాభం చేకూరలేకపోయింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వరుస చిత్రాలు తీస్తున్నాడు. అవి వచ్చినట్లే వచ్చి బొక్కా బోర్లాపడుతున్నాయి. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు ఇవే కోవలోకి వస్తాయి. ఇక తాజాగా శ్రీరాం ఆదిత్య డైరెక్షన్‌లో రానున్న ‘భలే మంచిరోజు’ సినిమాని 70 ఎంఎం బ్యానర్‌పై విజయ్‌, శశి నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ఆడియో ఇటీవల మహేష్, రానాల చేతుల మీదుగా జరిగింది. అక్కడే ట్రైలర్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ విషయానికొస్తే... సుధీర్‌‌బాబు సరసన వామిక అనే కొత్తమ్మాయి హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ ఫిల్మ్ స్టోరీ అంతా ఒక్క రోజులో జరిగేదని, ఆసక్తికరమైన సన్నివేశాలతో వినోద భరితంగా వుండబోతుందని టాక్. ఇక సాయికుమార్ ఓల్డ్ స్టయిల్‌లో కనిపించాడు. కన్ఫ్యూజన్ లో హీరోయిన్ కిడ్నాప్ చేయటం వల్ల హీరో ఎదుర్కొనే సమస్యలు ఏంటో ఫన్నీగా చూపాడు దర్శకుడు శ్రీరాం. ముఖ్యంగా సాయి కుమార్ డైలాగులు, మేనరిజం నవ్విస్తాయి.

విజువల్ గా కూడా ట్రైలర్ బావుండటంతో చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పొచ్చు. చూద్దాం సుధీర్ కి లక్ కలిసొచ్చి భలే మంచి హిట్ అందుకుంటాడో లేదో.   

Post Your Comment

తాజా వార్తలు