పూరీ జగన్నాథ్, దిశా పఠానీ, రేవతి, పోసాని కృష్ణమురళి, ముకేష్ రుషి, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాత: సీ.కళ్యాణ్, దర్శకుడు: పూరీ జగన్నాథ్
ఫూరీ చేసే సినిమాలన్నింటినీ ఫాస్ట్ ఫుడ్ లా ఫటాఫట్ కానిచ్చేస్తాడు. మొన్నామధ్యే షూటింగ్ ప్రారంభమైన వరుణ్ తేజ్ చిత్రాన్ని అదే స్పీడ్ తో కానిచ్చేశాడు. టైటిళ్ల విషయంలో కాస్త కన్ఫూజ్ క్రియేట్ చేసినప్పటికీ ఎట్టకేలకు లోఫర్ పేరును ఫిక్స్ చేసేశాడు. ముందుగా ఫస్టులుక్ ని రిలీజ్ చేయగా దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక అదే ఊపులో ట్రైలర్ ను కూడా వదిలాడు. ఫస్టులుక్ పోస్టర్స్ లో మదర్ సెంటిమెంట్ .. లవ్ .. యాక్షన్ అంశాలను ఎంచుకున్న పూరీ, ట్రైలర్ విషయంలోనూ అంతే జాగ్రత్త తీసుకున్నాడు.
ఎలాంటి పరిస్థితుల్లో కథానాయకుడు పుట్టి పెరిగాడు .. అతనిపై తండ్రి ప్రభావం ఎలా పడిందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా స్పష్టం చేశాడు. ''నేను పుట్టిందే నొక్కేయడానికి .. మధ్యలో ఆపేస్తే తొక్కేస్తా'' అంటూ కథానాయకుడు చెప్పే డైలాగ్ .. పూరీ మార్క్ ను గుర్తుచేస్తుంది. కథానాయికను హీరో ఆటపట్టించడం .. హీరో గొడవలకి దిగడం .. అతని మాట తీరు యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. మదర్ సెంటిమెంట్ మోతాదుకు మించినట్లు అనిపిస్తోంది. జాండీస్ కొడుకు చనిపోయాడని అబద్ధం చెప్పి పిల్లాడిని తండ్రి (పోసాని)లోఫర్ గా తయారుచేయటం, ఆ తర్వాత తల్లి కోసం కొడుకు పడే ఆరాటం, బిడ్డపై తల్లి చూపే మమకారం వెరసి సెంటిమెంట్ సిమెంట్ ను గట్టిగా దట్టించాడు పూరీ. మొత్తం మీద సినిమాలోని భారీతనాన్ని ఈ ట్రైలర్ ద్వారా ఆవిష్కరించడంలో పూరీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.
Post Your Comment