షేర్

October 29, 2015 | 10:12 AM |1 Views
Movie Name :
షేర్
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=fm4cce7v7Co
Actor/Actress/Director names :

కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, మకేష్ రుషి, ఎమ్మెఎస్ నారాయణ, థర్టీ ఇయర్స్ పృథ్వీ

బ్యానర్ ; సాయి నిహారిక, శరత్‌చంద్‌ విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకం, నిర్మాత: కొమర వెంకటేష్‌, సంగీతం థమన్, దర్శకత్వం : మల్లికార్జున్

Expected Release Date :
2015-10-30
Synopsis :

సింహం అస్తమానం వేటాడదు. కానీ వేటకి దిగిందంటే మాత్రం ఇక తిరుగుండదు. ఇక్కడ కూడా ఓ కుర్రాడు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం సింహంలా విజృంభించాడు. ఇది డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కొత్త చిత్రం షేర్ స్టోరీ లైన్.  సోనాల్‌చౌహాన్‌ కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తున్న చిత్రం ఆడియో ఈ మధ్యే విడుదలైంది . గతంలో కళ్యాణ్ రామ్ తో అభిమన్యు, కత్తి వంటి చిత్రాలు తీసిన మల్లికార్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రంలో బ్రహ్మానందం,  ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందించారు. ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉంది. ఈ ట్రైలర్ లో ఎక్కువగా పృథ్వీరాజు ను వాడుకున్నారు. డైలాగుల వరకు వచ్చేసరికి వాయిస్ ఉందిగా అని వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయ్ అనే కళ్యాణ్ రామ్ పంచ్ డైలాగ్.. పోలవరం ప్రాజెక్ట్ వీడి పెళ్ళి జరిగినట్టే ఉంటాయ్ కానీ జరగవ్ చిరాగ్గా అని పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయ్. మొత్తానికి పక్కా యాక్షన్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లు అర్థమౌతుంది.

Post Your Comment

తాజా వార్తలు