శివమ్

September 15, 2015 | 02:43 PM |5 Views
Movie Name :
శివమ్
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=sPZLc6naZKg
Actor/Actress/Director names :

రామ్, రాశిఖన్నా, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, పోసాని కృష్ణ మురళి, జయప్రకాశ్ రెడ్డి, వినీత్ కుమార్ తదితరులు,

కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, బ్యానర్: స్రవంతి మూవీస్, నిర్మాత:  రవికిషోర్, దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి

Expected Release Date :
2015-10-09
Synopsis :

గత కొద్దికాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్. మూస ధోరణి చిత్రాలతో ఆడియన్స్ ని ఇరిటేట్ చేస్తున్నాడనే ఓ కంప్లైంట్ ఉంది. ఆ క్రమంలోనే చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇక తాజాగా సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ లో ఓ చిత్రాన్ని హీరోగా తెరకెక్కించారు.  ఓ హీరో... అందమైన హీరోయిన్... ఓ ముగ్గురు విలన్లు. చిన్న విలన్ నుండి పెద్ద విలన్ వరకు. రామ్ ను బ్రిలియంట్ అంటూ పొగిడిసే స్నేహితులు. కట్ చేస్తే మార్కెట్లో ఫైట్లు పంచ్ డైలాగులు. మళ్ళీ కట్ చేస్తే ఫారిన్ లో పాటలు. యథావిథిగా మనోడి స్టయిలింగ్. సేమ్ లుక్ , అవే అరుపులు. హీరోయిన్ మాత్రం ఈసారి క్యూట్ గా కుమ్మేసింది. అదే శివమ్ చిత్రం. ఈ సినిమా ఆడియో ఇటీవల అల్లు అరవింద్ చేతుల మీదుగా జరిగింది.

కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డితో స్రవంతి రవికిషోర్ తమ బ్యానర్ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసిని సినిమా ఇది. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. దాదాపు ఈ మధ్యన వస్తున్న హీరో రామ్ సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయ్. ఓ హీరో, ఓ క్యూట్ హీరోయిన్, విలన్లు, ఆమె సమస్యను హీరో నెత్తిన వేసుకోవటం... ఇలా ఏదో పాత సినిమానే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప... ఫ్రెష్ ఫీలింగ్ లేనే లేదు.   ''శివమ్'' సినిమా ట్రైలర్ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. పరమ రొటీన్ గా చూసిన సినిమానే చూస్తున్నట్లుంది.  ఇంత రొటీన్ గా ఉండటంతో కొత్తను కోరుకునే సినిమా లవర్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఇకపోతే రామ్ ఫ్యాన్సు మాత్రం బాగా ఎక్సయిట్ అవుతున్నారు. రామ్ ఎనర్జి చిత్రానికి బాగా ఆకర్షణ అవుతుందని  ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ రామ్.

Post Your Comment

తాజా వార్తలు