ప్రభాస్, రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్, ప్రభాకర్ తదితరులు
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
కథ: విజయేంద్రప్రసాద్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇంతవరకూ ఏ తెలుగు సినిమాను చేయనంత భారీ వ్యయం దాదాపు 250 కోట్లు ఈ సినిమాకు ఖర్చు చేశారు. ఒక హాలీవుడ్ సినిమాకు ఏ విధంగానూ తీసిపోని విధంగా టెక్నికల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది. బాహుబలి పార్ట్ 1 ఒక్క తెలుగులోనే ఇప్పటి వరకు దాదాపు 83 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రిలీజ్ ముందే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగలేదు. శాటి లైట్ రైట్స్, ఇతర రైట్స్ ఇలా అన్ని కలిపి పార్ట్ 1 ఇప్పటికే 125 కోట్ల బిజినెస్ చేసింది. ఇక తెలుగు, తమిళం, మళయాలం, విదేశీ వెర్షన్లు కలిపితే ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించడం ఖాయం.
ఇక కథ విషయానికి వస్తే ఇది ఒక జానపద మూవీగా చెప్పుకోవచ్చు. కథ ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ట్రూలర్ చూసిన వాళ్ళంతా కథ గురించి చాలా ఊహాగాలు మొదలయ్యాయి. ఈ కథలో అన్నదమ్ములు, కత్తులు, యుద్ధాలు... రాజనీతి వంటివి కనిపిస్తున్నాయి.
Post Your Comment