నాగ చైతన్య, కృతిసనన్, బ్రహ్మానందం, రవిబాబు, పోసాని కృష్ణ మురళి, పూజా రామచంద్రన్, రావు రమేష్, సత్య, ప్రవీణ్, మధురిమ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు సుధీర్ వర్మ
సంగీత దర్శకుడు సన్నీ ఎంఆర్
ఈ చిత్రంలో హీరో నాగ చైతన్య కంటే ముందు చెప్పుకోవాల్సింది డైరక్టర్ సుధీర్ వర్మ గురించి. స్వామి రారా వంటి సింపుల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి టాలీవుడ్ ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకున్నాడు. సగటు ప్రేక్షకుడు స్ర్కీన్ ప్లే పట్ల బోరింగ్ గా ఫీలవుతున్న టైంలో ఓ ఢిపరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాడు. అదే దోచేయ్. కాకపోతే ఇందులో కూడా దొంగతనం నేపథ్యంలోనే కథను నడిపే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక నాగచైతన్య ఒక లైలా కోసం లాంటి డీసెంట్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం. లవర్ బాయ్ ట్యాగ్ లైన్ నుంచి దొంగగా మారి అలరించేందుకు సిద్ధమయిపోతున్నాడు. ఇక హీరోయిన్ కృతిసనన్. మహేష్ వన్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం అయినప్పటికీ పరిణితి చెందిన నటనను కనబరిచింది. ఇక ఇప్పుడు తన క్యూట్ యాక్టింగ్ తో అలరించేందుకు ముందుకు వచ్చేస్తుంది. చిత్రంలో ఒక్క బ్రహ్మానందం, రావు రమేష్, పోసాని తప్ప మిగతా వారంతా స్వామిరారా టీం వారే. మరి ఈ క్రైమ్ థిల్లర్ తో సుధీర్ హిట్ అందుకుంటాడా? కొత్త దర్శకుడి రెండో చిత్రం ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ నుంచి తప్పించుకుంటాడా? వెయిట్ అండ్ సీ.
Post Your Comment