అనుష్క, రానా, అల్లు అర్జున్, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, అజయ్
దర్శకుడు: గుణశేఖర్
కాకతీయ సామ్రాజ్య పట్టపు రాణి రుద్రమదేవి గురించిన కథను తెరకెక్కించారు దర్శకుడు గుణ శేఖర్. ఈ సినిమాను తీయాలని ఆయన పదేళ్ళుగా కలలు గన్నానని చెప్పుకున్నారు. 40 ఏళ్లుపాటు ప్రపంచంలో ఏ రాణి పరిపాలించని విధంగా పరిపాలించిన రుద్రమదేవి కథాంశాన్ని తీసుకున్నారు. పాత్రలకు తగినట్టుగా నటీ నటుల ఎంపిక జరిగింది. రుద్రమదేవిగా అనుష్క ఈ పాత్రలో చక్కగా ఇమిడిపోయింది. మరో ప్రత్యేకమైన పాత్రలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించగా, చాళుక్య వీరభద్రునిగా రానా నటించారు. చిత్రంలో తెలంగాణ భాషను ఉపయోగించడం మరో విశేషం. గుణ శేఖర్ ఎంతో ఫైనాన్షియల్ సమస్యలను ఎదుర్కొని ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి దాదాపు ఆయన 70 కోట్లు ఖర్చు చేయడం విశేషం. తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ కావడంతో ముఖ్యమంత్రి ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చి గుణశేఖర్ కు ఊరట నిచ్చారు.
Post Your Comment