మహేష్ బాబు, శృతి హాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్ రుషి, సంపత్, హరీష్, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్: రాజుసుందరం, దినేష్, బాస్కో సీజర్, థ్రిల్స్: అనల్ అరసు, అసిస్టెంట్ డైరెక్టర్స్: త్రివేది, అసోసియేట్ డైరెక్టర్స్: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్: వాసు, తులసి, చీఫ్ కో డైరెక్టర్స్: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.యస్.ప్రకాష్, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎమ్), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.
శ్రీమంతుడు సినిమాకు ఇప్పటి వరకూ ఏ సినిమా తీసుకోని ఓ కొత్త కాన్సెస్ట్ తో కథను అందిస్తున్నారు. మహేష్ బాబు చాలా ధనవంతుడు. ఓ ఊరిని దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు తన అండదండలు అందించాలని అనుకుంటాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కొందరు శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సోషల్ మెసేజ్ ను అందిస్తూ కమర్షియల్, లవ్ ఎలిమెంట్స్ ను కథకు జోడించారు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరింత వన్నె తెచ్చేలా కనిపిస్తోంది. వరుసగా రెండు ఫ్లాప్ లు ఇచ్చి మహేష్ అభిమానులను నిరాశ పరచడంతో, తన ఫాన్స్ కు సారీ చెప్పుకుని మరీ ఈ సినిమాను చాలా కేరింగ్ గా చేసినట్టు కనిపిస్తోంది. దర్శకుడు కొరటాల శివ సక్సెస్ కోసం ఎంత కష్టపడి సినిమా తీశాడో... అంత కంటే ఎక్కువ రిస్క్ తీసుకుని మహేష్ బాబు నటించినట్టు దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు కూడా.
Post Your Comment