దర్శకుడు: రమేష్ అరవింద్
కథ, స్క్రీన్ ప్లే: కమల్ హాసన్
సంగీతం: గిబ్రాన్
నటీనటులు: కమల్ హాసన్,. బాల చందర్, ఆండ్రియా, పూజా కుమార్, కె.విశ్వనాథ్, జయరాం
ఈ మధ్య కాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని రిలీజ్ డేటును పోస్టుపోన్ చేసుకుంటూ వచ్చిన సినిమా ఉత్తమ విలన్. మత పరంగా మనోభావాల్ని దెబ్బతీసిందంటూ కోర్టులో వేసిన కేసు నుంచి బయట పడి అన్ని అవాంతరాలూ దాటుకుని చివరికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది కమల్ హాసన్ చేస్తున్న మరో విశిష్ట, విభిన్నమైన చిత్రం. నటుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టాడు. సినిమా టైటిల్ లోనే ఓ వైవిద్యం చూపిస్తూ ఎన్నో రోజులుగా అభిమానులను ఊరిస్తూ చివరికి కార్మికుల రోజైన మేడే రోజున అభిమానులకు పండగ చేయనుంది. తమిళ నాట పేరున్న దర్శకుడు లింగుస్వామి ఈ సినిమా నిర్మాణ కర్తల్లో ఒకరు. కమల్ సినీ గురువు, దర్శకుడు కె. బాల చందర్ ఈ సినిమాలో తన పాత్రను తానే పోషించారు. కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు ఈ సినిమాలో కమల్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి కళాకారుడి పాత్ర. విశ్వరూపంలో కమల్ సరసన కీలక పాత్ర పోషించిన ఆండ్రియా ఈ సినిమాలో కూడా నటించింది.
Post Your Comment