నారారోహిత్, ప్రియాబెనర్జి, మధుసింగం పల్లి, రవివర్మ, సత్యదేవ్, భాను, రూపాదేవి తదిరులు
ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: యస్.వి.విశ్వేశ్వర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్: మురళి కొండేటి, పాటలు: వశిష్
ధర్మ(నారారోహిత్) పనిరాక్షసుడు. తన పనికి ఎవరైనా అడ్డు వస్తే ఒప్పుకునే రకం కాదు. వారితో ఎంతవరకైనా పోరాడే తత్వముండే జైలర్. మరి అలాంట మనస్తత్వముండే జైలర్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. బాణం, రౌడీఫెలో చిత్రాల తర్వాత పోలీస్ ఆఫీసర్ గా నారారోహిత్ చేస్తున్న చిత్రమిది. అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే, కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అందుకే నిర్మాతగా కూడా మారి ఈ చిత్రాన్ని చేశానని రోహిత్ అన్నాడు. ఈ సినిమా రస్టిక్ లుక్ కోసం కలర్ టు షేడ్స్ తగ్గడమే కాకుండా హెయిర్ స్టయిల్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని కృష్ణ విజయ్ తో గతంలో మద్రాసి చిత్రం చేయాల్సిందని, కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయిందని ఇప్పుడు ఈ సినిమాతో కుదిరిందని నారారోహిత్ చెప్పుకొచ్చాడు.
Post Your Comment